breaking news
dummy attendance
-
ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగం ఫసక్!
గాంధీనగర్: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది. థర్డ్ ఇయర్ బీకామ్ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది. ఇదీ జరిగింది.. అక్టోబర్‌లో జరిగిన బీకామ్ థర్డ్ఇయర్ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. విచారణ సందర్భంగా.. కంప్యూటర్లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది. అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్ఇయర్ బీకామ్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
బీసీ వసతిగృహాల్లో బయోమెట్రిక్
► డమ్మీ హాజరుకు ఇక స్వస్తి ► జిల్లాకు చేరిన 98 యంత్రాలు ► నాలుగు చోట్ల అమలు జలుమూరు : జిల్లాలో అన్ని బీసీ వసతిగృహాల్లో ఇక బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. బోగస్ హాజరును నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.ఇన్నాళ్లు వసతిగృహాల్లో లేని విద్యార్థులను సైతం లెక్కల్లో చూపి నిధులను కాజేస్తుండగా దానికి ప్రభుత్వ నిర్ణయంతో బ్రేకులు పడనున్నారుు. ఇప్పటికే బయోమెట్రిక్‌కు సంబంధించి జిల్లాకు 99 యంత్రాలు చేరగా వీటిలో నాలుగు చోట్ల విధానం అమలు ప్రారంభమైంది. జిల్లాలో అమలు ఇలా... జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనుంది. మొత్తం 78 బీసీ బాలుర, బాలికల వసతిగృహాలు ఉండగా నాలగవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ 7675 మంది విద్యార్థులు చదువుతున్నారు. పోస్టు మెట్రిక్(కళాశాల) విద్యార్థులు వసతిగృహాలకు సంబంధించి 22 ఉండగా ఇందులో 2525 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు... ఎంత మంది ఇంటికి వెళ్తున్నారు... అనే స్పష్టత కొన్ని వసతిగృహాల్లో ఉండటంలేదు. విద్యార్థుల హజరు ప్రశ్నార్థకం కావడంతో విద్యార్థుల సంరక్షణ, సంక్షేమంపై శ్రద్ధతీసుకునేందుకు ఈ బయోమెట్రిక్ హాజరు కీలకం కానున్నది. దీంతో వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని వసతిగృహాల్లో... జిల్లాలో అన్ని వసతిగృహాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి వాటి ద్వారానే విద్యార్థుల హాజరు తీసుకుంటాం. దీని వల్ల విద్యార్థుల హాజరుపై ఒక స్పష్టత వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుంది. ఇప్పటికే శ్రీకాకుళంలో నాలుగు చోట్ల అమలు కాగా మిగిలిన చోట్ల విడతలు వారీగా అమలు చేస్తాం. -ధనుంజయరావు, బీసీ సంక్షేమ శాఖ డీడీ, శ్రీకాకుళం