breaking news
Dubai Shopping Festival
-
DSF 2024: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారు
సౌత్ ఈస్ట్ ఏషియలోనే అతిపెద్ద ఈవెంట్‌కు దుబాయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎఫ్ఆర్ఈ) దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్(డీఎస్ఎఫ్) 30వ ఎడిషన్ సంబరాలు జరపనుంది. స్థానికంగా ఉన్న కోకా-కోలా అరేనాతోపాటు ఇతర ప్రదేశాల్లో డిసెంబర్ 6 నుంచి జనవరి 12, 2025 వరకు ఈ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 321 వేడుకలు ఉంటాయని చెప్పారు.ఈ ఫెస్టివ్‌లో భారీ తగ్గింపుతో వివిధ వస్తువులు విక్రయిస్తుంటారు. ఇందులో బంగారం, కార్లు వంటి వాటినిసైతం గెలుచుకోవచ్చు. రోజువారీ కారు లాటరీలు నిర్వహిస్తారు. దుబాయ్‌లో రిటైల్ వాణిజ్య పరిశ్రమ ఊపందుకునేందుకు ఈ ఫెస్టివల్‌ను 1996 నుంచి జరుపుతున్నారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ద్వారా భారీగానే ఆదాయం సమకూరుతుంది. క్రమంగా ఈ ఈవెంట్‌ను పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేస్తున్నారు. 1996లో జరిగిన మొదటి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కోసం 500 మిలియన్ల(రూ.నాలుగు వేటకోట్లు)కు పైగా వెచ్చించారు. అందులో 15 లక్షల మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు. క్రమంగా ఈవెంట్‌కు వెళ్లే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.2009లో ఈ ఫెస్టివల్‌కే వెళ్లినవారి సంఖ్య 30 లక్షలకు చేరింది. అందులో రెండు బిలియన్ డాలర్ల(రూ.16 వేలకోట్లు) వరకు వ్యాపారం సాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఈవెంట్ సహకారాన్ని అందిస్తోంది. దాంతోపాటు పర్యాటకం, రిటైల్ మార్కెట్‌ను ప్రేరేపిస్తోంది.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుగత ఈవెంట్ల్లో ప్రత్యేక ఆకర్షణలు..1999లో జరిగిన డీఎస్ఎఫ్ ఈవెంట్లో ప్రపంచంలోనే అతి పొడవైన బంగారు గొలుసును ప్రదర్శించారు.2001లో అతిపెద్ద అగరబత్తి, షాపింగ్ బ్యాగ్ ప్రదర్శనగా ఉంచారు.2002లో అతిపెద్ద చాక్లెట్ల పెట్టె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2004లో అతి పొడవైన బఫే ఏర్పాటు చేశారు.2006లో దుబాయ్ పాలకుడు షేక్ మక్తూమ్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరణం కారణంగా ఈ ఈవెంట్ వాయిదాపడింది. -
పుట్టిన 28 రోజులకే రూ. 24 లక్షలు
దుబాయ్: ‘కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న’ చందాన పుట్టిన 28 రోజులకే ఓ పాప తన కుటుంబానికి లక్షల రూపాయల విలువైన బహుమతులను సాధించి పెట్టింది. నవజాత శిశువు నితేరా బారసాల కోసం ఆమె తండ్రి అనిల్ జనార్దనన్ (కేరళవాసి) 2 దిర్హమ్ల (సుమారు 34 వేల) విలువైన బంగారు చైన్, గాజుల్ని దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు కూపన్లు ఆ పాప పేరు మీద నింపారు. అదే వారికి కనకవర్షం కురిపించింది. నితేరా షాపింగ్ ఫెస్టివల్లో విజేతగా నిలిచింది. లక్షా 40 వేల దిర్హమ్ల (రూ. 24 లక్షలు) విలువైన బంగారు, వజ్రాల నగలను సాధించింది.