breaking news
dr g samaram
-
డాక్టర్ సమరానికి గోల్డ్‌మెడల్ ప్రదానం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా సమయంలో విశేష సేవలు అందించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరానికి జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరాన్ని హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై, తదితరులు అభినందనలు తెలియజేశారు. -
యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి
యువత అలోచనలు పురోగమనం కంటే తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. పాత అభిరుచులను గౌరవిస్తూనే ప్రస్తుత పరిస్థితులపై దృష్టిసారించాల్సి ఉన్నా నేటి యువతలో అది కొరవడింది. యువతలో నూతన పోక డలు, నాయకత్వ లక్షణాలు ఎప్పుడు వస్తాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం అభిప్రాయపడ్డారు. ఐఎంఏ జోనల్ సమావేశానికి శ్రీకాకుళం వచ్చిన ఆయన జెడ్పీ సమావేశ మందిరంలో ‘సాక్షి’తో ఆదివారం మాట్లాడారు. శ్రీకాకుళం సిటీ : సమాజం, దేశం గురించి యువతలో ఆలోచించే ధోరణి తగ్గిందని సమరం ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగం, సంపాదనకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని, ఇది సరైన చర్యకాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో యువత భాగాస్వామ్యం అవసరమన్నారు. యువతలోని, దేశంలోని నాయకత్వ లక్షణాలు లోపించాయన్నారు. యువతకు దిక్యూచిగా నిలపల్సిన నాయకత్వం ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. యువత స్వార్ధరాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. సినిమాల ప్రభావం కూడా యువతపై ఎక్కువగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఐవీ గురించి ప్రస్తావిస్తూ.. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య తగ్గిందన్నారు.