breaking news
Down load
-
షాప్సి యాప్ డౌన్లోడ్లు 20 కోట్లు
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన హైపర్ వ్యాల్యూ ప్లాట్‌ఫామ్ ‘షాప్సి’ మొబైల్ అప్లికేషన్ (యాప్) 20 కోట్ల డౌన్లోడ్ మైలురాయిని అధిగమించినట్టు ప్రకటించింది. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్‌ను ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ సేల్‌లో అమ్మకాలు రెండింతలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. (జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్ ) చీరలు, పురుషుల టీ షర్ట్లు, కుర్తీలు ఎక్కువగా అమ్ముడుపోయినట్టు వివరించింది. ఈ సంస్థకు మహారాష్ట్ర, యూపీ, పశి్చమబెంగాల్ టాప్–3 మార్కెట్లుగా ఉన్నాయి. 60 శాతం డిమాండ్ టైర్–3 పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. షాప్సి ప్లాట్‌ఫామ్‌పై ఆకర్షణీయమైన ధరలకే ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, కస్టమర్ అనుకూల ఫీచర్లతో ఈ సంస్థ ఎక్కువ మందికి చేరువ అవుతుండడం గమనార్హం. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఇదీ చదవండి: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్ -
10 లక్షలకు పైగా డౌన్లోడ్లతో టాప్‌లో
సాక్షి, ముంబై: రిలయన్స్‌కు చెందిన రీటైల్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ డౌన్లోడ్లలో దూసుకుపోతోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ యాప్ 10 లక్షలకు పైగా డౌన్లోడ్లను సాధించింది. (జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ) దేశవ్యాప్తంగా 200 నగరాల్లో బీటా మోడ్‌లో ప్లాట్‌ఫామ్ లభ్యతను ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే జియోమార్ట్ ప్లాట్‌ఫాం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. యాప్ బ్రెయిన్ డేటా ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ ఆపిల్ యాప్‌స్టోర్‌లో రెండు, మూడు స్థానాలను ఆక్రమించి అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ఘనతను దక్కించుకుంది. ప్రస్తుతం, ఈ షాపింగ్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ దేశవ్యాప్తంగా రోజువారీ రెండున్నర లక్షలకు పైగా ఆర్డర్లను పొందుతున్నట్టు సమాచారం. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఆర్డర్ పరిధితో నిమిత్తం లేకుండా ఉచిత డెలివరీ అందిస్తోంది. అలాగే చెల్లింపుల్లో సోడెక్సో మీల్ కూపన్లను కూడా అంగీకరిస్తోంది. దీంతో జియోమార్ట్‌కు భారీ ఆదరణ లభిస్తోందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (జియో మార్ట్ ఈ-కామర్స్ సేవలు షురూ) -
ఆ యాప్‌ను వందకోట్లసార్లు డౌన్ లోడ్ చేశారు
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా తమ యాప్ ఫేస్ బుక్ మెస్సెంజర్ను ఆండ్రాయిడ్ ద్వారా దాదాపు వందకోట్లమంది 100 కోట్ల(బిలియన్) సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ఫేస్ బుక్ మెస్సేజింగ్ ప్రొడక్ట్స్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ తెలిపారు. దీంతో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకునే యాప్ ల జాబితాలో తాజాగా ఫేస్ బుక్ మెస్సెంజర్ చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎలిట్ క్లబ్ లో వాట్సాప్, గూగుల్ జీమెయిల్, యూట్యూబ్, సెర్చ్ అండ్ మ్యాప్స్ ఉండగా వాటి సరసన్ ఫేస్ బుక్ మెస్సెంజర్ చేరిందన్నారు. -
హాల్ టికెట్.. అందనంటోంది!
ఇతని పేరు టి.బాలగుర్రప్ప. కడపలో నివాసముంటున్నాడు. ఎస్జీటీ పోస్టు కోసం కడప, చిత్తూరు జిల్లాల్లో దరఖాస్తు చేశాడు. అధికారులు సర్టిఫికెట్లన్నీ చూసిన తర్వాతనే దరఖాస్తు స్వీకరించారు. అయితే కడపలో పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ వచ్చింది. చిత్తూరులో మాత్రం ఫోటో రిజెక్ట్..అప్లోడ్ చేయమని సిస్టమ్ అడుగుతోంది. కడప నబీకోటలో నివాసముంటున్న కె.నాగేంద్రప్రసాద్ది విచిత్ర పరిస్థితి. ఇతను డీఎస్సీకి సంబంధించి బయాలజీ, ఇంగ్లిష్ పోస్టులకు దరఖాస్తు చేశాడు. పరీక్ష ఈనెల 10, 11 తేదీల్లో ఉండగా.. ఇప్పటివరకు బయాలజీకి మాత్రం హాల్ టికెట్ వచ్చింది. ఇంగ్లిష్‌కు సంబంధించి హాల్ టికెట్ రావడం లేదు. రిజెక్ట్డ్ డీఈఓ అంటూ వస్తోంది. అధికారులు సమస్యను పరిష్కరించాలని ఇతను కోరుతున్నాడు. సాక్షి, కడప: డీఎస్సీ..బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి నిరుద్యోగి కల ఇది. దీనిని సాధించేందుకు అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే వీరి ఆశలపై ఆన్లైన్ సమస్యలు నీళ్లు చల్లుతున్నాయి. వీటి డౌన్లోడ్ కోసం వెళితే రిజెక్ట్ అని చూపుతుండడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారుల వద్దకు వెళితే వారు తమకేమీ తెలియదని, అదృష్టముంటే వస్తాయని వ్యగ్యంగా మాట్లాడుతున్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్లైన్ సమస్యలో..మరెదో కారణమో తెలీదు డీఎస్సీ హాల్ టికెట్ల జారీ వ్యవహారం అంతా అయోమయంగా మారింది. జిల్లాలో డీఎస్సీకి సంబంధించి 21,826 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది నిరుద్యోగులు జిల్లాతోపాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంత, కర్నూలు జిల్లాల్లో డీఎస్సీకి దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 25 నుంచి ఆన్లైన్లో డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మందికి ఆన్లైన్లో హాల్ టికెట్ల వివరాలు కనిపించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసిన కొంతమంది అభ్యర్థులకు కేవలం ఒకచోట పరీక్ష రాయడానికి మాత్రమే హాల్‌టికె ట్ వస్తోంది. మరో జిల్లాలో పరీక్ష రాయడానికి రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీకి ఫీజుతోపాటు ఖచ్చితంగా సర్టిఫికెట్లను అందజేసినా రాకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరికి డీఈవో రిజెక్ట్ అని...మరికొందరికి ఫోటో అప్లోడ్ చేయాలని.. ఆన్లైన్లో సూచిస్తోంది. దీంతో అభ్యర్థులు బిత్తరపాటుకు గురవుతున్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతోందని...అది సవరిస్తే అందరికీ హాల్ టికెట్లు అందుతాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే.. ‘‘అదృష్టముంటే వస్తాయి పోండి...మమ్మలేమి చేయమంటారు.’’ అంటూ సమాధానం రావడంతో నిరుద్యోగులు అవాక్కవుతున్నారు. హాల్ టికెట్ల మంజూరు కోసం డీఈఓ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. న్యాయం చేస్తాం: బండ్లపల్లె ప్రతాప్ రెడ్డి, డీఈఓ హాల్ టికెట్ రాని నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు తీసుకువస్తే ఉన్నతాధికారులకు పంపుతాం. రెండుసార్లు దరఖాస్తు చేసినా హార్డ్కాపీలో ఒకటే ఉండడం వల్ల కూడా అలా జరిగి ఉండవచ్చు.. సర్టిఫికెట్లు చూపిస్తే పరిశీలించి న్యాయం చేస్తాం. రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసినా ఏదైనా తేడాలుంటే హాల్ టికెట్ ఒక జిల్లాకే వచ్చి ఉండవచ్చు.