breaking news
doormat
-
నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై
కరోనా కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి పట్టునే ఉన్నారు. దీంతో వీకెండ్ పార్టీలు, స్పెషల్ అకేషన్స్‌కి షాపింగ్ ఖర్చులు చాలావరకు తగ్గాయి. వర్చువల్ మీటింగులకు సైతం చాలామంది కేవలం పైన సూట్, షార్ట్స్ వేసుకొని కవర్ చేస్తూ ప్యాంటులను భద్రంగా బీరువాల్లోనే దాచేస్తున్నారు. మొత్తం 2020 ఇలాగే గడిచేలా ఉంది. ప్రస్తుతానికి చాలామంది జీన్స్‌కు గుడ్‌బై చెప్పేశారు. సరిగ్గా ఇలాంటి క్రేజీ కొటేషన్‌తో ఉన్నఓ డోర్ మ్యాట్‌ను హీరో నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ప్యాంటులేని ఇళ్లు (హోం ఈజ్ వేర్ ప్యాంట్స్ ఆర్ నాట్ ) అని పెద్ద బోల్డ్ లెటర్స్‌తో ఉన్న ఓ డోర్ మ్యాట్ని షేర్ చేస్తూ "డోర్ మ్యాట్ ఆఫ్ ది ఇయర్'' అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించాడు. నాగ చైతన్య షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. (నా కథ నేనే చెబుతా) కేవలం అరగంటలోనే ఈ డోర్ మ్యాట్‌కు 41,000 లైకులు వచ్చాయి. దాదాపు అందరూ తమకు రిలేట్ చేసుకుంటూ ఎమోజీలు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే చైతూ గారు ఇలాంటివి తరుచుగా పోస్టులు చేయండంటూ కోరాడు. ఇక చాలా రిసర్వ్డ్గా ఉండే నాగ చైతన్య సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే సమంత మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ని పోస్టు చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. (బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి ) View this post on Instagram And the door mat of the year award goes to ... A post shared by Chay Akkineni (@chayakkineni) on Sep 16, 2020 at 8:11pm PDT -
అమెజాన్ మరో పైత్యం
చండీఘడ్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా.. తప్పులు మీద తప్పు లు చేస్తూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదిర్శిస్తోంది. తాజాగా ఏకంగా వినాయకుడి బొమ్మలున్న స్కేట్ బోర్డులను విక్రయానికి పెట్టింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ తీరుకు నిరసనగా చండీగఢ్‌కు చెందిన న్యాయవాది అజయ్ జగ్గా స్పందించారు. స్కేట్ బోర్డులపై గణపతి బొమ్మలను ముద్రించడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అమెజాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ నుంచి వాటిని తొలగించాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 295 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. భారతీయుల మనోభావాలనుదెబ్బతీసిన అమెజాన్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాగా ఇటీవల అమెజాన్ భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తూ వెబ్ సైట్ లో వస్తువులను విక్రయానికి పెట్టింది. జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్మ్యాట్లలు ఆ తర్వాత మహాత్మాగాంధీ ఫొటో ముద్రించిన చెప్పులను వెబ్సైట్లో పెట్టింది. దీనిపై కేంద్ర విదేశామంత్రి సుష్మా స్వరాజ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.