చైతూ షేర్ చేసిన క్రేజీ డోర్ మ్యాట్..

Naga Chaitanyas Shares A Doormat With An  Hilarious Message - Sakshi

క‌రోనా కార‌ణంగా చాలామంది ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఉద్యోగులు సైతం వ‌ర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి పట్టునే ఉన్నారు.  దీంతో వీకెండ్ పార్టీలు, స్పెష‌ల్ అకేష‌న్స్‌కి షాపింగ్ ఖ‌ర్చులు చాలావ‌ర‌కు త‌గ్గాయి. వ‌ర్చువ‌ల్ మీటింగుల‌కు సైతం చాలామంది కేవ‌లం పైన సూట్, షార్ట్స్ వేసుకొని క‌వ‌ర్ చేస్తూ ప్యాంటుల‌ను భ‌ద్రంగా బీరువాల్లోనే దాచేస్తున్నారు. మొత్తం 2020 ఇలాగే గ‌డిచేలా ఉంది. ప్ర‌స్తుతానికి చాలామంది జీన్స్‌కు గుడ్‌బై చెప్పేశారు. స‌రిగ్గా ఇలాంటి క్రేజీ కొటేష‌న్‌తో ఉన్నఓ డోర్ మ్యాట్‌ను హీరో నాగచైత‌న్య త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పంచుకున్నాడు. ప్యాంటులేని ఇళ్లు (హోం ఈజ్ వేర్ ప్యాంట్స్ ఆర్ నాట్ ) అని పెద్ద బోల్డ్ లెట‌ర్స్‌తో ఉన్న ఓ డోర్ మ్యాట్‌ని షేర్ చేస్తూ   "డోర్ మ్యాట్ ఆఫ్ ది ఇయర్''  అంటూ ఓ క్యాప్ష‌న్‌ను జోడించాడు. నాగ‌ చైత‌న్య షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. (నా కథ నేనే చెబుతా)

కేవ‌లం అర‌గంట‌లోనే ఈ డోర్ మ్యాట్‌కు  41,000 లైకులు వ‌చ్చాయి. దాదాపు అంద‌రూ త‌మ‌కు రిలేట్ చేసుకుంటూ ఎమోజీలు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే చైతూ గారు ఇలాంటివి త‌రుచుగా పోస్టులు చేయండంటూ కోరాడు. ఇక చాలా రిస‌ర్వ్‌డ్‌గా ఉండే నాగ ‌చైత‌న్య సోష‌ల్ మీడియాలో చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే స‌మంత మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటూ త‌న లేటెస్ట్ అప్‌‌డేట్స్‌ని పోస్టు చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. (బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి )

And the door mat of the year award goes to ...

A post shared by Chay Akkineni (@chayakkineni) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top