breaking news
donate kidney
-
కట్నంగా కిడ్నీ
వరకట్నమా... అదెక్కడుంది? అని పైకి అంటున్నారు గానీ లాంఛనాలు నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఎన్ని అప్పులు చేస్తున్నారో సమాజానికి తెలుసు. తాజాగా బిహార్‌లో ఒక ఘటన ఉలిక్కిపడేలా చేసింది. వరుడు అడిగిన మోటార్ సైకిల్ని పెళ్లికూతురు ఇవ్వలేననేసరికి ‘పోనీ కిడ్నీ ఇవ్వు.. అమ్ముకుంటాం’ అన్నారు. దాంతో పెద్ద కేసయ్యి పెళ్లి ఆగిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు తగ్గి ఉండాల్సిన అవసరం ఇంకా ఉందా? వాళ్లు మొదట బైక్ అన్నారు. లేదా నాలుగు లక్షల క్యాష్ అన్నారు. లేదా కిడ్నీ అన్నా ఇవ్వు అంటున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉంటున్న దీప్తి అనే మహిళ ఈ విషయమైన పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయడానికి వస్తే పోలీసులు కూడా డంగై పోయారు. విషయం ఏమిటంటే– దీప్తికి 2021లో పార్థ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో దీప్తి వివరించింది– ‘మా అమ్మా నాన్నలు నా పెళ్లి కోసం 30 లక్షలు ఖర్చు పెట్టారు.అయినా అత్తవారింటిలో అడుగు పెట్టినప్పటి నుంచి కట్నం కోసం సూటి పోటి మాటలు వినిపించేవి. మా అత్తగారు ఆయుర్వేద దుకాణం తెరవడానికి మరో 8 లక్షలు తెమ్మని నన్ను కోరారు. నేను అతి కష్టం మీద 3 లక్షలు నాన్నను అడిగి తెచ్చాను. రెండేళ్ల క్రితం నా భర్తకు కిడ్నీ వ్యాధి ముదిరింది. అది పెళ్లికి ముందే ఉంటే దాచి పెళ్లి చేశారు. మేము ఢిల్లీకి వెళ్లి అక్కడ మా ఆడపడుచు ఇంట్లో ఉండి వైద్యం చేయించాం. అక్కడి నుంచే నాకు సమస్యలు మొదలయ్యాయి’ అని తెలిపిందామె.డబ్బు లేదా కిడ్నీదీప్తిని ఆమె అత్తామామలు మొదట బైక్ అడిగారు. తర్వాత నాలుగు లక్షలు తెమ్మన్నారు. తర్వాత భర్తకు కిడ్నీ అయినా ఇవ్వు అని డిమాండ్ చేశారు. దీప్తి ఇవ్వను అని చెప్పేసరికి పుట్టింటికి తరిమేశారు. దాంతో తట్టుకోలేకపోయిన దీప్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే విడాకులు కావాలని డిమాండ్ కూడా చేసింది. భర్త ఇందుకు నిరాకరించినా దీప్తి మాత్రం ఈ పెళ్లి నుంచి బయటపడాలని నిశ్చయించుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.మెడకు చుట్టుకుంటున్న లాంఛనాలుకట్నం అనే మాట మన దేశంలో ఎట్టకేలకు అనాగరికంగా మారాక ఆడపెళ్లివారికి ఖర్చులు మరో విధంగా చుట్టుముట్టాయి. వాటిలో ప్రధానమైనది బంగారం. పిల్లకు ఏం పెడతారు అనే విషయం చాలా పెద్ద సమస్య– బంగారం రేటును తలుచుకుంటే! అలాగే కల్యాణ మంటపం, భోజనాలు, ఇతర ఆర్భాటాలు మహామహులను కూడా అప్పుల పాలు చేస్తున్నాయి. పెళ్లయ్యాక కూడా ఆ ఖర్చు అనీ ఈ ఖర్చు అనీ అల్లుళ్లు పిండేస్తున్నారు. కార్లు అడిగే అల్లుళ్లు కొందరైతే వ్యాపారానికి పెట్టుబడి అడిగేవారు కొందరు. ఇటు భర్తకు సర్ది చెప్పలేక అటు తల్లిదండ్రులను అడగలేక ఆడపిల్లలు పోకచెక్కలవుతున్నారు.అమ్మాయికి ఏం తక్కువ?ఇన్నేళ్ల తర్వాత కూడా అమ్మాయి డబ్బు ఇచ్చేదిగా అబ్బాయి డబ్బు తీసుకునేవాడిగా వివాహ వ్యవస్థ ఉండటం విషాదం. ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ మరో వైపు కుటుంబంలో కీలకపాత్ర పోషిస్తూ ఉన్నా ‘తగ్గి ఉండే’ ధోరణిని సమాజంప్రోత్సహిస్తూనే ఉంది. విద్యావంతులైన వధూవరులు పెళ్లి విషయంలో పరస్పర గౌరవనీయమైన లాంఛనాలను చర్చించి ఎవరికీ ఇబ్బంది, ఆర్థిక భారం కలిగించని వాటికే చోటిస్తూ వివాహానికి అంగీకరించాలి. అందుకు పెద్దల్ని ఒప్పించాలి. పెద్దలు ఏవేవో డిమాండ్లు పెట్టి, నెరవేర్చుకుని పక్కకు తప్పుకున్నాక కాపురం చేయాల్సింది వధువరులే. కనుక పరస్పర గౌరవానికి చోటుండే వివాహాలపై వారే ముందడుగు వేయాల్సి ఉంది.మరాఠాలు ఇస్తున్న సందేశంమొన్నటి మే నెలలో పుణెలోని వైష్ణవి హగవానె అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం – వరకట్న వేధింపులు. ఈ ఆత్మహత్య మహరాష్ట్రలో సంచలనం సృష్టించింది. దీనికి విరుగుడు కనిపెట్టడానికి మరాఠా సమూహాలు వరకట్నాన్ని, పెళ్లి ఆర్భాటాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. పుణె చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరిగి రైతుల భూములకు రెక్కలొచ్చాయి. బిల్డర్లకు భూములు అమ్మిన రైతులు భారీగా ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు. వీటిని చూసి సగటు మధ్యతరగతి వారు కూడా చేతులు కాల్చుకుని అప్పుల పాలవుతున్నారు. ఎంత ఖర్చయినా పర్లేదు... మంచి కుర్రాణ్ణి తేవాలని వేలానికి దిగుతున్నారు. వీటన్నింటిని నిషేధిస్తూ మరాఠా పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అక్కడి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుండటంతో ప్రభావం కనపడుతోంది. -
విడాకులకు దారితీసిన కిడ్నీదానం! ఆరోగ్యానికి ప్రమాదమా?
శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు. అలాంటి మూత్రపిండాలను దానం చేసే విషయంలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ కిడ్నీ దానం చేసే విషయంలో చాలా మూర్ఖంగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడొక భర్త కూడా తన నమ్మి వచ్చిన భార్యను కిడ్నీ దానం చేసిందని విడాకులు ఇచ్చేశాడు. తన సోదరుడి గురించి కిడ్నీ దానం చేసిందని అతను ఇలాంటి దారణమైన పనికి పూనుకున్నాడు. కిడ్నీ దానం చేసినంత మాత్రాన వారిని ఇక ఎందుకు పనిరారని, రోగుల కింద ట్రీట్ చేయాల్సిన పనిలేదు. ఎందువల్ల ఈ కిడ్నీ దానం విషయంలో చాలామందికి చెడు అభిప్రాయాలే ఉన్నాయి. ఇంతకీ ఇది మంచిదా కాదా? ఇదివరకటిలా దాతలు జీవనం సాగించలేరా? తదితరాల గురించే ఈ కథనం!. ఈ కిడ్నీ దానం విషయంలో ఎంతలా చెడు అభిప్రాయం ఉందంటే.. ఉత్తరప్రదేశంలో ఈ విషయం గురించి ఓ జంట కాపురంలో చిచ్చు రేగింది. ఏకంగా విడాకుల వరకు దారితీసింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో బైరియాహి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. భార్య ఉత్తరప్రదేశ్‌లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. తన సోదరుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో అతనికి కిడ్నీ దానం చేసింది ఆ మహిళ. ఐతే ఆమె ఈ విషయాన్ని భర్తకు కూడా తెలిపింది. అంతే వెంటనే ఆమె భర్త వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు నమోదు చేసింది. ఇలాంటి అమానుష ఘటనలు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. చాలామంది దీన్ని తీవ్రంగా పరిగిణించటానికి ప్రధానం కారణం ఆ విషయంపై ఉన్న అపోహలే. కీడ్నీ దానం ప్రాముఖ్యత.. ఒక కిడ్నీ ఉన్న చాలా మంది రెండు కిడ్నీలు బాగా పనిచేసే వారిలాగే జీవితాన్ని గడపగలరు. అలాగే దాతలకు కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదు. కిడ్నీని దానం చేసే స్త్రీలు ఇప్పటికీ గర్భం దాల్చవచ్చు. సురక్షితమైన ప్రసవం పొందగలరు. దెబ్బతిన్న రెండు కిడ్నీల కంటే ఒక ఆరోగ్యకరమైన కిడ్నీ చాలా మెరుగ్గా పని చేస్తుంది. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి, ఆరోగ్యకరమైన మూత్రపిండాలను కలిగి ఉంటే..కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్‌కు దానం చేసేందుకు ముందుక రావొచ్చు. దీనివల్ల వారి జీవన నాణ్యతను పెంచినవారవుతారు. డయాలిసిస్ చేయించుకోవాల్సిన బాధకరపరిస్థితిని తప్పించిన వారవుతారు. అలాగే దాత కిడ్నీ సర్జరీ తాలుకా మచ్చలు పోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఇక్కడ సర్జరీ చేసిన విధానం, శరీరం తీరుపైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల దుష్ప్రభావాలు వ్యక్తి జీవనశైలి ఆధారంగానే ఉంటాయో తప్ప ప్రత్యేకంగా కాదు. ఆరోగ్యకరమైన రీతిలో జీవనశైలి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. దాత తదుపరి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నిపుణులను అడిగి తెలుసకుని పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇది దారమైన పని కాదు. ఓ వ్యక్తి బతకగలిగే అవకాశం ఇవ్వడం లేదా ప్రాణం పోసిన దానితో సమానం. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
మానవత్వానికి మతం లేదని చాటారు!
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటుండగా మత సామరస్యం వెల్లివిరిసే ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు మతాలకు అతీతంగా మానత్వం ప్రదర్శించారు. తమ మతం కాని మహిళలకు మూత్రపిండాలు దానం చేసి మానవత్వానికి హద్దులు లేవని నిరూపించారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన అనితా మెహ్రా, తస్లీమ జహానే అనే మహిళలకు మూత్రపిండాలు పాడైపోవడంతో ఆస్పత్రిలో చేరారు. తమ భర్తలు కిడ్నీలు దానం చేసేందుకు ముందు వచ్చినా వీరి బ్లడ్ గ్రూపులు మ్యాచ్ కాలేదు. అనిత బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ కాగా, ఆమె భర్త వినోద్ మెహ్రాది ఏ పాజిటివ్. తస్లీమ బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్ కాగా, ఆమె భర్త అహ్మద్ ది బి పాజిటివ్. పరిస్థితిని గుర్తించిన డాక్టర్లు మూత్రపిండాల పరస్పర మార్పిడికి వినోద్, అహ్మద్ ను ఒప్పించారు. అహ్మద్ భార్యకు వినోద్ కిడ్నీ దానం చేయంగా, వినోద్ భార్యకు అహ్మద్ కిడ్నీ ఇచ్చాడు. సెప్టెంబర్ 2న ఆపరేషన్ చేసి కిడ్నీలు అమర్చారు. విభిన్న మతాలకు చెందిన వ్యక్తుల మధ్య కిడ్నీల మార్పిడి తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి వైద్యులు తెలిపారు. వినోద్, అహ్మద్ పరస్పరం ధన్యవాదాలు తెలుపుకోవడం విశేషం.