breaking news
Domestic Violence Act Complaint
-
నా భర్తొక నార్సిసిస్ట్, తీవ్ర హింస, రూ. 50 కోట్లు చెల్లించాలి: మాజీ మిస్ ఇండియా
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ (Celina Jaitly) విడాకులకు సిద్దమైంది. భర్త పీటర్ హాగ్ (Peter Haag-48)పై గృహ హింస కేసు దాఖలు చేసి, అతని వల్ల కోల్పోయిన ఆదాయం రూ. 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నవంబర్ 21న ముంబై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త అయిన హాగ్ కు నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది.తన భర్త తనను తాను గొప్పగా ఊహించుకుంటాడని (నార్సిసిస్ట్), స్వార్థపరుడని సెలీనా ఆరోపించారు. పిల్లల పట్ల ప్రేమలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను తీవ్ర భావోద్వేగ, శారీరక, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని తెలిపారు. అంతేకాదు ఆస్ట్రియాలో విడాకుల కోసం దాఖలు చేశాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ కారణంగానే తాను ఇంట్లోనుంచి పారిపోయి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే సెలీనా తనకు నెలకు రూ. 10 లక్షల భరణం కోరింది. ముంబైలోని తన నివాసంలోకి ప్రవేశించకుండా అతడిని నిరోధించాలని కోర్టును అభ్యర్థించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో హాగ్‌తో నివసిస్తున్న వారి ముగ్గురు పిల్లల కస్టడీ కూడా తనకు రావాలని పిటిషన్లో కోరింది. పిల్లలు పుట్టిన తరువాత ఏదో ఒక సాకుతో తనను పనిచేసుకోనీయకుండా అడ్డుపడ్డాడని.. తన ఆర్థిక స్వేచ్ఛను, గౌరవాన్ని హరించాడని ఆరోపించింది. అప్పుడప్పుడు చిన్న, చిన్న ప్రాజెక్టులను మాత్రమే చేయగలిగానని వెల్లడించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!కాగా, 2010లో నటి సెలినా జైట్లీ హగ్‌ను పెళ్లాడింది. వీరికి విన్స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్చి 2012లో మగపిల్లలు (ట్విన్స్) పుట్టారు. తిరిగి ఏదేళ్ల తరువాత మళ్లీ ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది, వారిలో ఒకరు హైపోప్లాస్టిక్ గుండె కారణంగా మరణించారు. మాజీ మిస్ ఇండియా చమిస్ యూనివర్స్ రన్నరప్‌గా నిలిచిన సెలీనా.. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, మనీ హై తో హనీ హై, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ లాంటి సినిమాలతో పాపులర్ అయింది. మరోవైపు గత వివాహ వార్షికోత్సవం సందర్భంగా హాగ్ కోసం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది. ఇంతలోనే ఈ విడాకుల వార్త అభిమానుల్లో అందోళన రేపింది. -
భార్యల నుంచి కాపాడండి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘బాబోయ్..భార్యల గృహహింసను భరించలేకున్నాం..హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి రక్షించండి’..లాక్డౌన్ వేళ తమిళనాడులోని భర్తల గోడు ఇది. ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యల గృహహింస నుంచి కాపాడాల్సిందిగా తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఒక వినతిపత్రం పంపారు. ఉత్తరంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘కరోనావైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన మగవారి పరిస్థితి దయనీయంగా మారింది. భార్యల వల్ల ఎదుర్కొంటున్న గృహహింస భౌతికంగానే కాక మానసికంగా కూడా బాధపెడుతోంది. మహిళా సంరక్షణ, సంక్షేమ చట్టాలను చూపి భర్తలను బెదిరిస్తున్నారు. మరోవైపు గృహహింసకు పాల్పడే మగవారిని వెంటనే అరెస్ట్ చేస్తామని అదనపు డీజీపీ రవి విడుదల చేసిన ఒక ప్రకటన మగవారిని మరింత అవేదనకు గురిచేస్తోంది. మగవారి బాధలు తెలుపుకునేందుకు కనీసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని అరుళ్ తమిళన్ అందులో పేర్కొన్నారు. -
‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’
ముంబై : భర్త అభినవ్ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడు అంటూ టీవీ సీరియల్ నటి శ్వేతా తివారి గృహహింస కేసును నమోదు చేయడంపై కూతురు పాలక్ తివారి స్పందించారు. తండ్రి తనను శారీరకంగా వేధించాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కాగా భర్త తనను వేధిస్తున్నాడంటూ శ్వేతా తివారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో అభినవ్ తన కూతురిని కూడా కొట్టాడంటూ ఆమె ఆరోపించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలపై శ్వేత కూతురు పాలక్ తివారి సోషల్ మీడియాలో స్పందించారు. కఠిన సమయంలో తన తల్లికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు కావని కొట్టిపారేశారు. మీడియా ఏదైనా విషయం గురించి ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, అబద్దాలను ప్రచారం చేయకూడదని సూచించారు. తన తల్లి అనేక సార్లు గృహహింసకు గురైన విషయం వాస్తవమే కానీ కేసు నమోదు చేసిన రోజు తప్ప ఏ రోజు అభినవ్ కోహ్లి తన తల్లిని కొట్టలేదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖ రాశారు. చదవండి : భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి అదే విధంగా సవతి తండ్రి(అభినవ్) తనను ఎప్పుడు శారీరకంగా వేధించలేదని.. కనీసం అసభ్యంగా తాకలేదని పాలక్ పేర్కొన్నారు. అభినవ్ ప్రతీసారి అసభ్యకర వ్యాఖ్యలతో తల్లిని దూషించేవాడని, దానికి ప్రత్యక్ష సాక్షురాలు తనేనని తెలిపారు. ఒక కుటుంబానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచురిస్తే ఆ కుటుంబానికి ఎంతో బాధగా ఉంటుందని వాపోయారు. ‘మీరు(మీడియాను ఉద్దేశించి) రాసే వార్తలు ఒకరి జీవితానికి సంబంధించినవని గుర్తుంచుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా పాలక్ తివారీ.. శ్వేతా తివారికి మొదటి భర్త రాజా చౌదరి ద్వారా కలిగిన సంతానం. రాజా చౌదరితో విడాకులు తీసుకున్న అనంతరం శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. -
ఎస్సైపై గృహహింస కేసు నమోదు
సాక్షి, కృష్ణా : గుడివాడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తు ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వీఆర్‌లోకి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్పై అతని కోడలు గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమటలో నివాసం ఉండే శిరీషా, భాస్కర్‌కు 2013లో వివాహం అయింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద ఐదున్నర లక్షలు, 15 సవర్ల బంగారం, అర ఎకరం పొలంతో పాటు, అడపడుచు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చారు. తన బాబును చూడనివ్వటం లేదని, పైగా తన బ్యాంకు అకౌంట్నుంచి లోన్లు తీసుకుని, తనను వేధిస్తున్నారని శిరిషా విజయవాడలో ‘స్పందన’ కార్యక్రమంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ సూచన మేరకు గురువారం పటమట పోలీసులకు అమె ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నన్ను చంపేస్తారేమో..
ఇదే అత్తింటి నుంచి ఆఖరి ఫోన్ వెళ్లేసరికే కూతురు శవమైంది గృహహింస చట్టం కింది శిక్షించాలి శైలజ తల్లిదండ్రుల వినతి విశాఖపట్నం: ‘మా అమ్మాయి ఆ రోజు ఉదయమే ఫోన్ చేసింది.. భర్త, ఆడపడుచులు చిత్రహింసలు పెడుతున్నారని, చంపేస్తారేమోనని భయం వ్యక్తం చేసింది.. మర్నాడు మేం వెళ్లే సమయానికి ఆమె ఉరి వేసుకొని చనిపోయినట్లు అత్తింటి వారు చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటే ఒంటిపై బలమైన గాయాలు ఎందుకుంటాయి..?’ అని శైలజ తల్లిదండ్రులు రౌతు అప్పారావు, అరుణ కన్నీటితో ప్రశ్నించారు. గత నెల 29న విజయనగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ కుమార్తె కేసును గృహహింస చట్టం కింద విచారించాలని వారు శనివారం డీఆర్డీఏ కార్యాలయం శిశు సంక్షేమ శాఖలోని గృహహింస చట్ట విభాగంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు సాక్షితో తమ ఆవేదన పంచుకున్నారు. వేపగుంట మండలం అప్పన్నపాలేనికి చెందిన రౌతు అప్పారావు, అరుణ 2012లో విజయనగరం జొన్నగుడ్డి ప్రాంతంలోని రెల్లివీధికి చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాసరావుతో తమ కుమార్తె శైలజకు వివాహం జరిపించారు. రూ.2 లక్షల కట్నంతోపాటు 30 తులాల బంగారం దఫదఫాలుగా చదివించుకున్నారు. అయినా అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు వేధిస్తూ తమ కూతురిని చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం రూ.2 లక్షలు తేవాలంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడని, పిల్లలు పుట్టలేదని ఆడపడుచుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని తెలిపారు. భర్త, అత్తమామలు, ఆడపడుచులు చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆత్మహత్యగా చిత్రించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ విజయనగరంలో ఒకటో పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ కుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.


