breaking news
Doctor Sridhar
-
బాలిక కళ్లలోంచి కట్టెపుల్లలు!
-
బాలిక కళ్లలోంచి కట్టెపుల్లలు!
తిమ్మాపూర్: పదమూడేళ్ల బాలిక కళ్లల్లో నుంచి చిన్న, చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రామకృష్ణకాలనీకి చెందిన దుర్శేటి రవి-లత కూతురు శివాని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గత మంగళవారం రాత్రి శివాని ఒక్కసారిగా తనకు కళ్లు నొప్పి పెడుతున్నాయని ఏడ్చింది. కంట్లో నుంచి చిన్నచిన్న కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. కాసేపటికి ఆగి పోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి ఆదివారం రాత్రి 10 గంటలకు రెండు కళ్లు మళ్లీ నొప్పి పెడుతున్నాయని శివాని విలపించింది. కాసేపటికే రెండు కళ్ల నుంచి కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. ఇలా రాత్రి నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 32 పుల్లలు బయటకు వచ్చాయి. ఎడమ కన్ను నుంచి ఎక్కువగా వచ్చాయి. గ్రామస్తులు, మీడియా ప్రతినిధు ల సమక్షంలో సైతం బాలిక కళ్లలోంచి పుల్లలు బయటకు వచ్చాయి. కుటుంబసభ్యులు ఆం దోళనతో శివానిని సోమవారం సాయంత్రం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు శ్రీధర్ పరీక్షించారు. కళ్ల నుం చి రాళ్లు రావడం సహజమేనని, కానీ, పుల్లలు రావడం అరుదైన సంఘటన అని చెప్పారు.