breaking news
disappoints
-
యాక్సిస్ బ్యాంక్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 5,528 కోట్లకు పరిమితమైంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలపై రూ. 1,231 కోట్ల ప్రొవిజన్లు చేపట్టడం ప్రభావం చూపింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 26 శాతం నీరసించి రూ. 5,090 కోట్లకు చేరింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,918 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం నామమాత్ర వృద్ధితో రూ. 13,745 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 3.73 శాతానికి బలహీనపడ్డాయి. ట్రేడింగ్ ఆదాయం 55 శాతం తగ్గడంతో ఇతర ఆదాయంలోనూ 1 శాతం కోతపడి రూ. 6,625 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజన్లు రూ. 2,204 కోట్ల నుంచి రూ. 3,547 కోట్లకు పెరిగాయి. రెండు రకాల పంట రుణ ప్రొడక్టులను నిలిపివేయడం ఇందుకు కారణమైంది. 10 లక్షల క్రెడిట్ కార్డులు: త్రైమాసికవారీగా యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.57 శాతం నుంచి 1.46 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో 10 లక్షల క్రెడిట్ కార్డులను విక్రయించింది. కనీస మూలధన నిష్పత్తి 16.55 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో యాక్సిస్ ఫైనాన్స్ నికర లాభం తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 327 కోట్ల నుంచి రూ. 385 కోట్లకు బలపడింది. యాక్సిస్ ఫైనాన్స్ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్ చేపట్టవలసి ఉంటుందని తెలియజేశారు.ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 1,169 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
పీసీసీ పదవి దక్కనందుకు జానారెడ్డి అసంతృప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంపై సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే జానారెడ్డి నిరాశకు గురయ్యారు. జానారెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలసి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు కొత్తగా పీసీసీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డికి అవకాశమిచ్చింది. ఇక సీమాంధ్ర పీసీసీ చీఫ్గా రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్గా కేంద్ర మంత్రి చిరంజీవిలను నియమించారు. తెలంగాణ పీసీసీ చీఫ్గా జానా రెడ్డి పేరు చివర వరకు వినిపించింది. ఓ దశలో ఆయననే నియమించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చివర్లో అధిష్టానం పొన్నాల వైపు మొగ్గుచూపడంతో జానా అసంతృప్తికి గురయ్యారు.