breaking news
Director Vikram K Kumar
-
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్‌తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్‌గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్‌గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం. -
ప్రముఖ దర్శకుడి పెళ్లి తేదీ ఇదే!
తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్లో ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ నెలకొంది. ముఖ్యంగా ప్రతిభావంతులైన దర్శకులంతా వరుసగా బ్యాచ్‌లర్ జీవితానికి చరమగీతం పాడి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దర్శకులు క్రిష్, హను రాఘవపూడి పెళ్లిలు చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి 'మనం', 'ఇష్క్', '24' చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ కూడా చేరబోతున్నారు. '24' సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనిధిని విక్రమ్ ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే నెల 4న శ్రీనిధిని చెన్నైలో విక్రమ్ కే కుమార్ పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చెన్నైలోని హిల్టన్ హోటల్లో అంగరంగ వైభవంగా జరగనున్న వీరి వివాహానికి నాగార్జున, ఏఆర్ రహమాన్, సూర్య, శ్రియ శరణ్, నిత్యా మీనన్, సమంత, మాధవన్ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు పలువురు రానున్నట్టు సమాచారం. విక్రమ్ కే కుమార్ పెళ్లిముహూర్తం నిశ్చయమవ్వడంతో శుభలేఖలు అచ్చువేయించి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది. 'మనం', 24 వంటి విభిన్న సినిమాలు అందించిన విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం స్క్రిప్ట్ పనుల్లో అతను బిజీగా ఉన్నట్టు సమాచారం.