breaking news
director Vamsi Paidipally
-
'7/జీ బృందావన కాలనీ' సినిమా లాంటి అనుభూతిని ఇస్తుంది'
‘‘బేబీ’ ట్రైలర్ బాగుంది. జూలై 14న టీమ్ అంతా పండగ చేసుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ‘‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో.. ‘బేబీ’ అదే ఫీల్ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు’’ అన్నారు మారుతి. ‘‘ఈ చిత్రం నిర్మాతకు గౌరవాన్ని తీసుకొస్తుంది’’ అన్నారు సాయి రాజేష్. ‘‘బేబీ’ ప్రేక్షకులను నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది’’ అన్నారు ఆనంద్, విరాజ్. ఎస్కేఎన్ కూడా పాల్గొన్నారు. -
స్క్రిప్ట్ వర్క్@అమెరికా!
రోమ్‌లో రోమన్‌లా నడుచుకోవాలంటారు. అమెరికాలో? అమెరికన్లా నడుచుకోవాలి! మరి, అమెరికన్లా ఆలోచించాలంటే? అమెరికన్ ఎన్నారైలా నడుచుకోవాలంటే? కొన్నాళ్లు అమెరికాలో ఉండాలి. అమెరికన్స్‌ని అబ్జర్వ్ చేయాలి. అందుకే, మహేశ్‌బాబు కొత్త సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగస్టులో రచయితల బృందంతో అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట! మహేశ్ హీరోగా నటించనున్న 25వ సిన్మాకు వంశీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో సి. అశ్వినీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా కథ అమెరికా నేపథ్యంలో సాగుతుంది. ఆగస్టులో అమెరికా వెళ్లనున్న దర్శకుడు వంశీ పైడిపల్లి అక్కడే స్క్రిప్ట్ వర్క్‌ను కంప్లీట్ చేయడంతో పాటు లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తారట. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న ఏఆర్ మురుగదాస్ ‘స్పైడర్’ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. మహేశ్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘భరత్ అను నేను’ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది.