breaking news
Director Anirudh
-
వైవిధ్యమైన పాత్రలో..
కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో యమా బిజీగా ఉన్నారు నయనతార. ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెండ్ చిత్రాలతోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘కొలమావు కోకిల’ (కో కో ) సినిమాలో ఇప్పటి వరకూ చేయని పాత్ర చేస్తున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన్ డ్రగ్స్ అమ్మే యువతిగా కనిపిస్తారట. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ యువతి స్మగ్లింగ్ వైపు ఎలా వెళ్లింది? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. నెల్సన్ దిలీప్ కుమార్ కథ చెప్పగానే మరోమాట మాట్లాడకుండా నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట నయనతార. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. -
బీప్సాంగ్తోనే అనిరుద్ అవుట్
యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది నటుడు ధనుష్ అన్న విషయం తెలిసిందే. 3 చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన అనిరుద్‌కు ధనుష్ భార్య ఐశ్వర్యకు సహోదర బంధం ఉంది. నటుడు ధనుష్ ఆయన్ని ప్రోత్సహించడానికి అదీ ఒక కారణం. 3 చిత్రం విజయం సాధించక పోయినా అందులోని వై దిస్ కొలై వెరి డీ పాట అనిరుద్‌కు బహుళ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత ధనుష్ ఆయనకు వరుసగా అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. మారి, వేలై ఇల్లా పట్టాదారి,తంగమగన్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ధనుష్ తాజా చిత్రం కొడికి కూడా అనిరుద్‌నే సంగీతదర్శకుడిగా ఎంపిక చేశారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆ చిత్రం నుంచి అనిరుద్‌ను తొల గించి సంతోష్నారాయణ్ను ని యమించడం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాం శంగా మారిం ది.అనిరుద్ శిం బు బీప్‌సాంగ్ వివాదంలో ఇరుక్కున్నారనే వార్తలు వెలువడ్డ సమయంలో ధనుష్ ఆ ప్రచారాన్ని ఖండించారు. అనిరుద్ తనకు కన్నబిడ్డలాంటివాడు. తను చిన్నతనం నుంచి తెలుసు. అనిరుద్‌ను తాను పెంచి పోషించాను. తను అలాంటి పాటకు సంగీతాన్ని అందించి ఉండరు అని ఒక పత్రికా సమావేశంలో కూడా అన్నారు. అలాంటిది ఇప్పుడు తన చిత్రం నుంచే అనిరుద్‌ను తొలగించడానికి కారణాలను కోలీవుడ్ ఆరా తీసే పనిలో పడింది. ఈ వివరాల్లోకెళితే నటుడు శింబు బీప్ సాంగ్ వివాదంలో అనిరుద్పై కూడా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ని పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయవచ్చు అనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ వ్యవహారంలో శింబు మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ను పొందారు.సంగీత కచేరీ కోసం కెనడా వెళ్లిన అనిరుద్ మాత్రం ఈ వివాదం చెలరేగి నెల రోజులు దాటినా చెన్నైకి తిరిగి రాకుండా కెనడా, లండన్ల చుట్టూ తిరుగుతూ పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఒక వేళ అనురుద్ ఈ కేసుల నుంచి ఎలాగోలా బయట పడ్డా ఆయన ఇప్పటికే అంగీకరించిన చిత్రాలు మూల పడ్డాయి. వాటికి సంగీతాన్ని అందించడానికి అనిరుద్‌కు చాలా కాలం పడుతుంది. అంతే కాకుండా బీప్‌సాంగ్ వ్యవహారంలో అనిరుద్‌కు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి సమయంలో ఆయన్ని మళ్లీ తన చిత్రానికి పెట్టుకుంటే తన ఇమేజ్‌కు దెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన ధనుష్ తన కొడి చిత్రం నుంచి తొలగించి సంతోష్నారాయణ్ను ఎంపిక చేసినట్లు కోడంబాక్కమ్ వర్గాల టాక్. ఇది తన టైమ్‌గా భావించిన సంతోష్‌నారాయణ్ తన పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేసినట్లు, బేరసారాలనంతరం ముప్పావు కోటికి సెటిల్ అయినట్లు కోలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.