breaking news
Directed by Shiva
-
అజిత్ చెల్లెలిగా లక్ష్మీమీనన్
నటుడు అజిత్ చెల్లెలిగా మారబోతున్నారు నటి లక్ష్మీమీనన్. ఎన్నై అరిందాల్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటుడు అజిత్ నటించనున్న చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆరంభం, ఎన్నై అరిందాల్ చిత్రాల తరువాత శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్ర కథ అన్నాచెల్లెలి ఇతివృత్తంగా తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఇందులో చెల్లెలి పాత్ర కీలకం కావడంతో ఆ పాత్రలో నటించే నటి కోసం సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలిసింది. నటి నిత్యామీనన్, శ్రీదివ్యల్లో ఒకరిని ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. నటి నిత్యామీనన్ అజిత్‌కు చెల్లెలిగా నటించడానికి నిరాకరించినట్లు తెలిసింది. ఇక శ్రీదివ్య కూడా ఈ విషయంలో మౌనం దాల్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీంతో నటి లక్ష్మీమీనన్‌ను అజిత్‌కు చెల్లెలి ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. కుంకి నుంచి కొంభన్ వరకు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ కేరళ కుట్టి ఇటీవల ప్లస్‌టూ పరీక్షల కోసం నటనకు చిన్న విరామం తీసుకున్నారు. పరీక్షలు ముగియడంతో నటనకు రెడీ అని ప్రకటించారు. చిన్న గ్యాప్ తరువాత లక్ష్మీమీనన్ నటించనున్నది చెల్లెలి పాత్ర కావడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. -
కల నెరవేరిందా?
తమిళ చిత్రపరిశ్రమలో ‘మీకు ఏ హీరో సరసన నటించాలని ఉంది’ అని అడిగితే.. ఎక్కువమంది హీరోయిన్లు చెప్పే పేరు ‘అజిత్’. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హన్సిక కూడా ఇదే సమాధానం చెప్పారని చెన్నయ్ టాక్. ఆమె అలా అన్నప్పుడు తథాస్తు దేవతలు దీవించేశారేమో..! ఎందుకంటే హన్సిక కల త్వరలో నెరవేరనుందట. ప్రస్తుతం అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత శివ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారట. ఇందులో విద్యాబాలన్‌ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్త ప్రచారమైంది. అయితే అది నిజం కాదట. తాజాగా, హన్సిక పేరు వినిపిస్తోంది. అజిత్ సరసన ఈ బ్యూటీని దాదాపుగా ఖరారు చేశారని సమాచారం.