breaking news
Dining accommodation
-
తిరుమలలో గో ఆధారిత సంప్రదాయ భోజనం
తిరుమల: శ్రీవారి భక్తులకు ఉచిత భోజన సదుపాయంతోపాటు సంప్రదాయ భోజనాన్ని కూడా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో షడ్రుచులతో కూడిన భోజన వసతి కల్పించనుంది. ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఇకపై భక్తులకు కూడా ఈ సంప్రదాయ భోజనాన్ని కాస్ట్ టు కాస్ట్ (ఎంత ఖర్చు అయితే అంత) సేల్ విధానంలో అందించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవన్లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్నమయ్య భవన్లో కొందరికి సంప్రదాయ భోజనం గో ఆధారిత భోజనం ఇలా ► అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి.. మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. ► దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు. ► కాలాబాత్ బియ్యంతో ఉప్మా, కులంకార్ బియ్యంతో ఇడ్లీలు తయారు చేశారు. వీటిలో వ్యాధినిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ► సెప్టెంబర్ 8వ తేదీ వరకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. -
సమస్యలన్నీ పరిష్కరిస్తా..
పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో వసతి గృహాల్లో చేర్పిస్తున్నారు. కానీ హాస్టళ్లలో సదుపాయాలు, వసతులు, సౌకర్యాలు కరువై విద్యార్థులు సతమతం అవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం, నిధుల కొరత కారణంగా సమస్యలు తిష్టవేస్తున్నాయి. ప్రభుత్వ వసతిగృహాల్లో అన్ని వసతులు కల్పిస్తారని ఆశపడి వచ్చిన విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం మెస్‌చార్జీలు పెంచి, సౌకర్యాల కల్పనకు కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో సౌకర్యాలు ‘కల్పన’గానే మారాయి. ఇప్పటికీ చాలా వసతిగృహాల్లో మెనూ అమలు కావడం లేదు, కిటికీలకు తలుపులు లేక చలికి వణికిపోతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఆయన వీఐపీ రిపోర్టర్‌గా మారి కాగజ్‌నగర్ పట్టణంలోని బీసీ వసతిగృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, సాధకబాధకాలు తెలుసుకున్నారు. హాస్టల్ పనితీరు, మెనూ, సిలబస్, ఆరోగ్యం, క్రీడలు, భోజన వసతి, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కోనప్పకు వివరించారు. - కాగజ్‌నగర్ టౌన్ బీసీ వసతి గృహానికి చేరుకోగానే హాస్టల్ ముందు పడి ఉన్న చెత్తాచెదారంపై వార్డెన్ మనోజ్‌తో ఇదేంటి అని ప్రశ్నించారు.. వార్డెన్ మనోజ్ : రేపటిలోగా చెత్తను తొలగిస్తాం సార్.. హాస్టల్లోకి వస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను చూసిన విద్యార్థులు.. నమస్తే సార్ ఎమ్మెల్యే : బాబు నమస్తే ఎలా ఉన్నారు విద్యార్థులు : బాగున్నాం సార్ ఎమ్మెల్యే : మీ లీడర్ ఎవరు విద్యార్థులు : రాజు, సుధాకర్, పాండు మా లీడర్లు సార్ ఎమ్మెల్యే : పాండు ఎక్కడ ఉన్నావు.. పాండు : సార్ నేనే పాండు అంటూ విద్యార్థి ముందుకు వచ్చాడు. ఎమ్మెల్యే : పాండు నీది ఏ ఊరు పాండు : సార్ నాది కన్నర్‌గాం, ఆసిఫాబాద్ మండలం ఎమ్మెల్యే : బాబు మీ హాస్టల్లో ఏ సమస్యలు ఉన్నాయి పాండు : సార్ పెట్టెలు రాలేదు. బోరింగ్ చెడిపోయింది. ఎమ్మెల్యే : అక్కడే ఉన్న వార్డెన్ మనోజ్‌ను పెట్టెల గురించి ఆరా తీశారు. వార్డెన్ : సార్ ఉన్నతాధికారికి రాసి పంపాం. వచ్చిన వెంటనే పెట్టెలు ఇస్తాం. ఎమ్మెల్యే : ఈ రోజు మెనూ ఏం ఇచ్చారు విద్యార్థి : సార్ ఇప్పుడు తయారవుతోంది. ఎమ్మెల్యే : గుడ్లు ఎప్పుడు ఇస్తుండ్రు విద్యార్థి : వారానికి ఆరు రోజులు ఇస్తుండ్రు సార్ ఎమ్మెల్యే : ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? విద్యార్థి రాజు : సార్ మంచినీటి సౌకర్యం లేదు. ఎమ్మెల్యే : నా స్వంత డబ్బులతో నేటి నుంచి మంచినీటి సరఫరా చేయిస్తా. ఎమ్మెల్యే : పాఠశాలకు సమయానికి వెళ్తున్నారా? అక్కడ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? విద్యార్థి : ఉదయం, సాయంత్రం వసతిగృహంలో తింటం, మధ్యాహ్నం స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం బాగుండడం లేదు సార్. ఎమ్మెల్యే : స్కూల్ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి నాణ్యమైన భోజనం అందిస్తా. ఎమ్మెల్యే : మరుగుదొడ్ల పరిస్థితి ఎలా ఉంది.. విద్యార్థులు : సార్ మరుగుదొడ్ల పరిస్థితి బాగాలేదు. మరుగుదొడ్లు, స్నానపుగదుల తలపులు ఊడిపడ్డాయి. ఎమ్మెల్యే : వారంరోజుల్లో తలుపులకు మరమ్మతులు చేయిస్తా ఎమ్మెల్యే : ఇతరత్రా సమస్యలు ఏమి ఉన్నాయి విద్యార్థులు : డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఫ్లోరింగ్ లేదు. ఎమ్మెల్యే : హాస్టళ్ల డీడీ అంకం శంకర్‌తో ఫోన్లో మాట్లాడి, డైనింగ్ హాల్, ఫ్లోరింగ్‌కు ప్రతిపాదనలు పంపించండి అని ఆదేశించారు. ఎమ్మెల్యే : ఆరోగ్య పరీక్షల కోసం వైద్యులు వస్తున్నారా? విద్యార్థులు : ఏఎన్ఎంలు వచ్చి పరీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే : హ్యాండ్‌బోర్ ఎప్పటి నుండి పని చేయడం లేదు విద్యార్థులు : సార్ 2 సంవత్సరాల నుండి పని చేయడం లేదు. ఎమ్మెల్యే : వార్డెన్ గారు ఎందుకు రిపేర్ చేయలేదు? వార్డెన్ మనోజ్ : ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను సార్. ఎమ్మెల్యే : హాస్టల్ వాచ్మెన్ ఎవరు, రాత్రి ఉంటున్నాడా? విద్యార్థులు : వాచ్మెన్ ఉంటున్నాడు. రాత్రి పూట పడుకుంటున్నాడు. ఎమ్మెల్యే : మంచినీటి కోసం కుండాలు, రంజన్లు ఉన్నాయా? వార్డెన్ : ప్లాస్టిక్ డ్రమ్ములను పెట్టాం సార్. ఎమ్మెల్యే : టిఫిన్ సరిగ్గా అందుతోందా? విద్యార్థులు : అందుతోంది సార్. ఎమ్మెల్యే : ఏం ఏం పెడుతున్నారు? విద్యార్థులు : ఉప్మా, కిచిడీ, అటుకులు పెడుతున్నారు సార్. ఎమ్మెల్యే : ఎలా చదువుతున్నారు విద్యార్థులు : మంచిగానే చదువుతున్నాము సార్ ఎమ్మెల్యే : కష్టపడి చదివి మంచి మార్కులు సాధించండి. ప్రోత్సహిస్తాం ఎమ్మెల్యే : క్రీడల్లో పాల్గొంటున్నారా? విద్యార్థులు : అవును సార్ ఎమ్మెల్యే : ఇవాలా ఏం టిఫిన్ చేశారు? వార్డెన్ : సార్ కిచిడీ తయారు చేశాం. ఎమ్మెల్యే : సరే విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తా. విద్యార్థులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిసి నేలపై కూర్చుని టిఫిన్ చేశారు. ఎమ్మెల్యే : నేను వచ్చానని మెరుగైన అన్నం పెట్టారా? విద్యార్థులు : కాదు సార్ రోజు ఇలానే ఇస్తారు ఎమ్మెల్యే : ఏ సమస్యలు ఉన్న నా ఫోన్‌కు కాల్ చేసి సమస్యలు తెలపాలి. విద్యార్థులు : సరే సార్ అంటూ నెంబర్ అడిగారు. ఎమ్మెల్యే : నా నెంబర్ 9441255522 ఎమ్మెల్యే : వంటలు సరిగ్గా చేస్తున్నారా? వంట మనుషులు : సరిగ్గా చేస్తున్నాము సార్ ఎమ్మెల్యే : విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి వార్డెన్ : సార్ సమస్యలు ఎదురుకాకుండా చూస్తా. ఎమ్మెల్యే : వెళ్లోస్తాను మరీ, అనుమతి ఇస్తారా? విద్యార్థులు : నమస్తే సార్ మళ్లీ, మళ్లీ మా హాస్టల్‌కు రండి సార్. ఆనందంగా ఉంది సార్. ఎమ్మెల్యే : ఓకే ఓకే నవ్వుకుంటూ వెళ్లారు. వెళ్తుండగా.. మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి బీసీ వసతి గృహం ముందు ఉన్న చెత్తను తొలగింపజేయాలని ఆదేశించారు.