'నా సినిమా.. పెద్దగా ఆడలేదు'
షారుక్ ఖాన్, కాజోల్ కలిసి నటించారంటే బాక్సాఫీసు మళ్లీ బద్దలవుతుందని అంతా ఆశించారు. కానీ 'దిల్వాలే' సినిమా మాత్రం అంత సీన్ లేదని నిరూపించింది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ బాద్షా షారుక్ కూడా అంగీకరించాడు. తన సినిమా ఆడాల్సినంతగా ఆడలేదని చెప్పాడు. ఇది తనకు చాలా నిరాశ కలిగించిందని చెప్పాడు. భారతదేశంలో దానికి రావల్సినంత కలెక్షన్లు రాలేదని, అయితే ఓవర్సీస్లో మాత్రం బాగుందని అన్నాడు.
జర్మనీ, ఆస్ట్రియా లాంటి దేశాల్లో అది బాగా నడిచిందన్నాడు. భారతదేశంలో ఇప్పటివరకు దిల్వాలే సినిమాకు కేవలం రూ. 145 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాను షారుక్ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సరిగ్గా క్రిస్మస్ సెలవుల సమయంలో.. డిసెంబర్ 18న విడుదల చేసినా, ఇదిమాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.