breaking news
Dilimitesan process
-
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
పరుగు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు యంత్రాంగం సన్నాహాలు ముగిసిన డీలిమిటేషన్ నేడు ఓటర్ల జాబితా విడుదల 26న బీసీల ముసాయిదా జనవరిలో ఎన్నికలు? సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా కదులుతోంది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. వార్డుల (డివిజన్ల) వారీగా ఓటర్ల జాబితాను మంగళవారం (నేడు) ప్రజల ముందుకు తీసుకురానున్నారు.వీటిని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలు, ఆర్డీవో, తహశీల్దారుల కార్యాలయాల్లో ఉంచడంతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తారు. ప్రజలు, రాజకీయ పక్షాలు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉంటుంది. అనంతరం 26వ తేదీన బీసీల ముసాయిదా జాబితాను ప్రజల ముందు ఉంచుతారు. దానిపై అభ్యంతరాలకు వారం రోజుల గడువిస్తారు. ఫిర్యాదుల ఆధారంగా అవసరమైన మార్పుచేర్పులు చేసి ఓటర్ల జాబితాలో బీసీలను మార్కింగ్ చేస్తారు. అనంతరం జనాభా ప్రాతిపదికన మొత్తం 150 డివిజన్లలో ఏవి ఏ వర్గానికి చెందుతాయో ఖరారు చేస్తారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఇవన్నీ డిసెంబర్ 15లోగా పూర్తయ్యాక... మిగిలేది ఎన్నికల నోటిఫికేషనే. జనవరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సిబ్బంది కోసం లేఖలు ఈ ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు)తో సహా దాదాపు 50 వేల మంది ఎన్నికల సిబ్బంది కోసం జీహెచ్ఎంసీ అధికారులు వివిధ విభాగాల అధికారులకు లేఖలు రాశారు. జీహెచ్ఎంసీ వద్ద ప్రస్తుతం 6900 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. మరో 5 వేల ఈవీఎంలు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ప్రారంభోత్సవాలు ముమ్మరం.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎక్కువ వ్యవధి లేకపోవడంతో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు ఇం టింటికి రెండు చెత్తడబ్బాల కార్యక్రమాన్ని ప్రారంభిం చడం... పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం తెలిసిందే. ప్రచారం జోరు.. జీహెచ్ఎంసీలో అమలవుతున్న రూ.5భోజన కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాల ప్రచార హోర్డింగులు సైతం భారీగా దర్శనమిస్తున్నాయి. నగరంలోని వివిధ ముఖ్య కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇలా.. ఎన్నికల లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బీపీఎస్, ఎల్ఆర్ఎస్లను కూడా ఇటీవలే అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఒక అభిప్రాయం కాగా... జీహెచ్ఎంసీ ఖజానా నిండేందుకూ ఉపకరించగలదని భావిస్తున్నారు.