breaking news
different views
-
థియేటర్లలో జాతీయగీతంపై ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: ఇక నుంచి ప్రతి సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నిలబడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పలువురు నిపుణుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇది న్యాయవ్యవస్థ మితిమీరిన జోక్యం అని కొందరు అంటుండగా.. తాజా ఆదేశాల ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మంచి ఫలితాన్నే ఇస్తుందని మరొకరు అంటున్నారు. ముఖ్యంగా మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ ఈ విషయంపై స్పందిస్తూ కోర్టులు ప్రజలు నిల్చోవాలని, ఏదో చేయాలని చెప్పకూడదని అన్నారు. కావాలంటే కార్యనిర్వాహక వర్గాన్ని మాత్రం చట్టంలో సవరణలు చేయండని ఆదేశించవచ్చని చెప్పారు. మరోపక్క, తనకు సంబంధించినది కానీ అంశాల వరకు న్యాయవ్యవస్థ వెళ్లకూడదని ప్రముఖ సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి అన్నారు. ఇక ఢిల్లీ నియోజవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, న్యాయవాది మీనాక్షి మాత్రం సానూకూలంగా స్పందించారు. జాతీయ గీతాన్ని ఇప్పటికే పలు పాఠశాలల్లో.. బహిరంగంగా జరిగే వేడుకల్లో, తదితర చోట్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారని, ఇప్పుడొక కొత్త వేదికపై పాడితే తప్పేముందని, ఎలాంటి నష్టం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి నిల్చుంటే కలిగే నష్టమేమి లేదన్నారు. అయితే, థియేటర్లో ప్రతి ఒక్కరు నిల్చొనేలా చేయడం యాజమాన్యాలకు కష్టంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో ఈ సమస్య ఉంటుందని అన్నారు. -
ఆప్ నాయకత్వంలో చీలిక!
- అగ్రనేతల్లో భేదాభిప్రాయాలు.. రెండు గ్రూపుల వృద్ధి న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలో అంతర్గతంగా అనేక విభేదాలు తలెత్తినట్లు ఆప్ అంతర్గత లోక్‌పాల్ కమిటీ తాజాగా పార్టీ నాయకత్వానికి రాసిన లేఖతో వెలుగుచూసింది. పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంపై వస్తున్న విమర్శలకు పరిష్కారం చూపాల్సి ఉందని సూచించింది. ‘ఒక్కరికి ఒక్క పదవి’ విధానాన్ని అవలంబించాలంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆప్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న లోక్‌పాల్ కమిటీ ఇటీవలి పార్టీ జాతీయ కార్యవర్గ భేటీకి ముందే ఆప్ రాజకీయ సలహా కమిటీకి లేఖ రాసింది. 6నెలలుగా పార్టీలో రెండు గ్రూపులు వృద్ధి చెందుతున్నాయని, అగ్రనాయకత్వంలో పరస్పర విశ్వసనీయత లోపించడం వల్ల అనవసర వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయంది. ఢిల్లీ సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్‌గా రెండు పదవుల్లో కేజ్రీవాల్ కొనసాగడంపై కొందరు నేతలు ఇటీవల అభ్యంతరం తెలపడంతో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే పార్టీ నేతలు నిలువరించారు.