breaking news
Diamond Facts
-
‘గోల్డెన్ కనరీ’ వజ్రం.. ధర రూ.123 కోట్లు.. అంచనా మాత్రమే!
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పెద్ద పసుపు రంగు ‘గోల్డెన్ కనరీ’ వజ్రం ఇది. దుబాయ్‌లోని సోత్‌బేస్ ప్రదర్శనలో ఉంచారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్లో న్యూయార్క్‌లో వేలం వేయనున్నారు. 1980లలో కాంగో దేశంలో వజ్రాల గని సమీపంలో లభించినపుడు దీని బరువు 890 క్యారెట్లు. తర్వాత పలుమార్లు సానబట్టి ముక్కలుగా మారింది. చివరకు 303.10 క్యారెట్లకు తగ్గించారు. అదే ఈ వజ్రం. డిసెంబర్ 7న న్యూయార్క్‌లో ఇది రూ.123 కోట్ల ధర పలకొచ్చని ఒక అంచనా. ఇదీ చదవండి: పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం -
పెళ్లి కళవచ్చేసింది
వజ్రం కలకాలం నిలిచే ఉంటుంది. అనుభూతి కూడా అంతే. వజ్ర సహిత అనుభూతి అయితే... ఇక మరచిపోవడం మన తరమా... సోమాజిగూడ కీర్తిలాల్స్ షోరూమ్‌లో యంగ్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘డైమండ్ ఫ్యాక్ట్స్’ ఆద్యంతం విజ్ఞాన వినోదాల మేలు కలయికగా మారింది. ముంబై ఫ్యాషన్ డిజైనర్ కృష్ణామెహతా దుస్తులు... వజ్రాల ధగధగల్లో మోడల్స్ మెరిసిపోతూ ఆహూతులకు ఓ విభిన్న సాయంత్రాన్ని అందించారు. షో స్టాపర్‌గా తళుక్కుమన్న నటి సోనియా కాసేపు తన మనసు విప్పి ఉల్లాసంగా ముచ్చటించింది. ‘అచ్చమైన హైదరాబాదీ బ్రైడల్లా మెరిసిపోతున్నా. బాగున్నా కదూ. పెళ్లి పీటలు ఎక్కకుండానే పెళ్లి కళ వచ్చేసింది. ఐయామ్ సో లక్కీ’ అంటూ మురిసిపోయింది సోనియా. తొలిసారి షో స్టాపర్‌గా మెరిసిన ఈ చిన్నది... తనకు ఇప్పటిదాకా హెవీ జ్యువెలరీ అంటే అంత నచ్చేది కాదని, కానీ టాప్ టు బాటమ్ ఆభరణాలతో అలంకరించుకుంటే వచ్చే లుక్ ఎంత బ్రైట్‌గా ఉంటుందో ఇప్పుడు తెలిసిందని, తనను తాను చూసుకొని మురిసిపోయింది. ‘ఇలా అలంకరించుకోవాలని అమ్మాయిలు ఎందుకు అంతగా తపిస్తారో నాకు అర్థమైంది. నావంటి మీదున్న ఆభరణాల కంటే నేనే వాల్యుబుల్’ అంటూ చమత్కరించిన సోనియా.. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది. తెలుగు, హిందీ సినిమాలకు చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.