breaking news
DG krishna prasad
-
డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన త్రివేది
సాక్షి, హైదరాబాద్ : డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై రాజీవ్ త్రివేది స్పందించారు. తాను ఎవరికీ ఎలాంటి ఫార్ములా సూచించలేదని, డీజీపీ నియామకమనేది ముఖ్యమంత్రి విచరణక్షాధికారమని ఆయన గురువారమిక్కడ అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా కొత్త డీజీపీగా ఎవరిని నియమించాలన్న దానిపై ప్రభుత్వంతో నిన్న చర్చలు జరిగాయి. ఈ రేసులో కేంద్ర సర్వీసులో ఉన్న సుదీప్ లఖ్టకియాతో పాటు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి డీజీపీ పోస్టు ఖాయమన్న చర్చ ఐపీఎస్‌ల్లో నడుస్తోంది. ఇక డీజీపీ నియామక ప్రక్రియలో త్రివేది ఫార్ములా బెటర్ అని, తనకు ఏడాది, రాజీవ్ త్రివేదికి రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇవ్వాలని డీజీ కృష్ణ ప్రసాద్ ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన పదవీకాలాన్ని మహేందర్ రెడ్డికి ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను సీఎంకు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదని, డీజీపీగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని త్రివేది పేర్కొన్నారు. -
పీజీ ఎంట్రన్స్ స్కామ్‌లో మరో 11 మంది అరెస్ట్
వీరిలో ముగ్గురు బ్రోకర్లు, 8 మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పీజీ ఎంట్రన్స్ స్కామ్‌లో మరో 11 మంది నిందితులను సీఐడీ అరెస్ట్‌చేసింది. వీరిలో ముగ్గురు బ్రోకర్లు ఉండగా, 8 మంది విద్యార్థులున్నారని సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ మంగళవారం తెలిపారు. అరెస్టయిన వారిలో బ్రోకర్లు గద్దె రాంబాబు, షకీల్ అహ్మద్, శివప్రసాద్‌లు ఉన్నారు. అలాగే విద్యార్థులలో కృష్ణ కార్తిక్(ర్యాంకు 31), కాజా నీలహారిక(ర్యాంకు 54), రాధారెడ్డి శ్యామల(ర్యాంకు60), కీర్తీ చౌదరి(79), లంకా ప్రత్యూష(80), ఫణి శ్రీ (ర్యాంకు 94), భరత్‌చంద్ర (ర్యాంకు 110), షేక్ హుస్సేన్‌బాషా (ర్యాంకు 263) ఉన్నారు. కాగా ఇప్పటివరకు 18 మంది బ్రోకర్లు, 23 మంది విద్యార్థులు కలిపి మొత్తం ఈ స్కామ్‌లో 41 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన గద్దె రాంబాబు బెంగళూరులోని షకీల్‌తో కలసి ఈస్కామ్‌లో పాలు పంచుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ‘పీజీమెట్’పై 25కల్లా తీర్పు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్ష (పీజీమెట్)ను తిరిగి నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ నెల 25కల్లా తీర్పు వెలువరిస్తానని చెప్పారు. పీజీ వైద్య ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 69ని సవాలు చేస్తూ డాక్టర్ విక్రంరెడ్డి, మరో 90 మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.