breaking news
Development of Highways
-
AP: రాష్ట్రంలో రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందనున్నాయి. మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు ఈ నెల 17న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 51 రహదారులకు మహర్దశ పడుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న విజయవాడ రానున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ఆయనతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా రాష్ట్రంలోని పోర్టులు, పర్యాటక ప్రదేశాలు, వెనుకబడిన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ రహదారులను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి వీలవుతుందని గడ్కరీ దృష్టికి తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారు. వాటిలో కొన్ని నిర్మాణాలు ఇప్పటికే పూర్తవ్వగా, మరికొన్నింటిని నిర్మించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒకేసారి రహదారులకు ప్రారంభోత్సవం, కొత్తగా నిర్మించనున్న వాటికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావించింది. నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ రూపొందించింది. ఈ నెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రాష్ట్రంలో కొత్తగా 31 జాతీయ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించనున్నారు. వీటిలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. -
జాతీయ రహదారిగా ఖేడ్- బీదర్ రోడ్డు
* రూ.10కోట్లు మంజూరు ఎంపీ బీబీపాటిల్ నారాయణఖేడ్: నియోజకవర్గంలోని రహదారుల అభివృధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. నారాయణఖేడ్- బీదర్ రహదారి జాతీయ రహదారిగా మారనున్నదని, ఖేడ్ నుంచి సంత్పూర్ రహదారి నిర్మాణానికి రూ.10కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. శనివారంఖేడ్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఖేడ్ ప్రాంతాభివృద్ధికి పాటుపడతానన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా స్థానిక నేతలు ఎంపీని ఘనంగా సత్కరించారు. అంతకు ముందు కార్యకర్తలు పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు బిడెకన్నె హన్మంతు, వెంకట్రాంరెడ్డి, రవీందర్‌నాయక్, ప్రభాకర్, మారుతిపటేల్, ఇస్మాయిల్, నవాబ్, గోవింద్‌యాదవ్, మల్‌శెట్టియాదవ్, మారుతి యాదవ్, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.