breaking news
devadula lift irigation project
-
రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి
సాక్షి ప్రతినిధి వరంగల్/ఏటూరునాగారం/మధిర: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు సమీపంలో వైరా నదిపై రూ.600 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ విడుదల చేస్తేనే లక్షల ఎకరాల భూమి సాగవుతోందని, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సైతం 25 రోజుల్లోనే ఖాళీ అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వల్లనే ఏపీలో బనకచర్ల, శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ వల్లే నష్టం..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు కలిసి దొంగచాటుగా ఆర్డినెన్స్ తెచ్చి భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఏపీలో కలిపి, గిరిజనులకు చెందిన 2 లక్షల ఎకరాలు పోలవరానికి ధారాదత్తం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. గిరిజనులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా పోలవరం ఎత్తు తగ్గించి రెండు లక్షల ఎకరాలను కాపాడాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాక నికర జలాలు, వరద జలాల వాటా తేలాకనే బనకచర్ల ప్రస్థావన తీసుకురావాలని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధిర నియోజకవర్గంలోని 30 గ్రామాలను నాగార్జునసాగర్ రెండో జోన్లోకి మార్చి, రూ.600 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు దేవాదులరాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు దేవాదుల అని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా దేవాదుల చొక్యారావు ఎత్తిపోతల పథకం, సమ్మక్క–సాగర్ బరాజ్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వారు ఆదివారం పరిశీలించారు. ముందుగా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాదుల పంపుహౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి, ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 28 వేల ఎకరాల భూ సేకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూ నిర్వాసితులకు చెల్లించేందుకు రూ.67 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరింత భూ సేకరణ కోసం రూ.179 కోట్ల వరకు అవసరమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను కూల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతేనని ఆరోపించారు. ఇచ్చంపల్లి తుమ్మిడిహెట్టి బరాజ్‌ను రూ.38 వేల కోట్లతో కట్టి తీరుతామని భట్టి, ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా, దేవాదుల నుంచి వేరే ప్రాంతాలకు నీళ్లు తీసుకపోతున్నారని, తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు. రామప్ప– లక్నవరంను అనుసంధానిస్తూ కెనాల్ నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, నాగరాజు, మురళీనాయక్, ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. -
దేవాదులపై హరీష్‌రావు సమీక్ష
సాక్షి, వరంగల్: దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే జులై లోపు ప్యాకేజీ-2, అక్టోబర్ లోపు ప్యాకేజీ-3 పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గడువులోపు పనులు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే వర్షాకాలం నాటికి రామప్ప నుంచి పాకాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లాలోని చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా హరీష్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నింటినీ పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. మే నెల నుంచి రైతులకు పంట పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
దేవ.. దేవ
ప్రశ్నార్థకంగా మారనున్న దేవాదుల ఎత్తిపోతల పథకం భవిష్యత్ ఏజెన్సీ కక్కుర్తితో పాడవుతున్న మోటార్లు అనుభవం లేని ఇంజనీర్ల పర్యవేక్షణ నిర్దేశిత పంపింగ్ లక్ష్యానికి ఆటంకాలు సాక్షి, వరంగల్ : దేవాదుల ఎత్తిపోతల పథకం మోటార్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కంపెనీ నిర్వాకం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. మోటార్ల నిర్వహణ బాధ్యతలను సొంతగా ఎలాంటి అనుభవం లేని సంస్థకు సాగునీటి శాఖ అప్పగించింది. ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థ అనుసరిస్తున్న వైఖరి మొత్తం ప్రాజెక్టు మనుగడకే ఇబ్బందులు కలిగించేలా ఉంది. బ్రెజిల్ మోటార్లు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బ్రెజిల్ నుంచి భారీ మోటార్లను దిగుమతి చేసుకున్నారు. అయితే, భారీ మోటార్ల వారం టీ గడువు ముగిసింది. ఈ మేరకు నిర్వహణ, మరమ్మతుల ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మోటార్లలో సాంకేతిక సమస్యలు వస్తే బ్రెజిల్‌కు చెందిన ఇంజనీర్ల బృందం మరమ్మతు చేయాలి. కానీ అక్కడి నుంచి వచ్చే ఇంజనీర్ల బృందం... మోటార్లను మరమ్మతు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తే ఇక వాటి ని బ్రెజిల్‌కు తరలించాల్సిందే. తద్వారా మరమ్మతుకు ఖర్చు ఎక్కువ కావడమే కాకుం డా చాలా సమయం పడుతుంది. మరమ్మతుల కోసం మోటార్లను బ్రెజిల్ తీసుకు వెళ్తే దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో ఇబ్బం దులు ఏర్పడుతాయి. వర్షాభావ ప్రాంతాలకు నీరు అందించడంలో అవాంతరాలు వస్తాయి. ఇలా కాకుండా మోటార్ల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటే భారీ మరమ్మతులను నియంత్రించేందుకు వీలవుతుంది. మోటార్ల నిర్వహణ కాంట్రాక్టు పొందిన సంస్థ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సా గునీటి శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మోటార్లను నడిపే విషయంలో నిపుణులను నియమించుకుంటే చిన్నస్థాయి సమస్యలకు వెంటనే అరికట్టొచ్చు. అయితే, కాంట్రాక్టు పొందిన సంస్థ మాత్రం దీనికి విరుద్ధంగా తక్కువ వేతనం ఇచ్చి జూనియర్ ఇంజనీర్లను నియమించి వారికి భారీ మోటార్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. కూలెంట్ అయిల్ లేక... నెల క్రితం భీంఘన్ పూర్ పంప్‌హౌజ్‌లోని నీటిని పంపింగ్ చేస్తున్న సమయంలో మోటార్లలోని కాయిల్స్ కాలిపోయినట్లు తెలిసింది. సరిపడా కూలెంట్ అయిల్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని కాంట్రాక్టు సంస్థకు అధికారులు చెప్పినట్లు తెలిసింది. నెల గడిచినా ఇప్పటికీ మోటార్లు రిపేరు చేయలేదని అధికారులు అంటున్నారు. ఏటూరునాగారంలోని దేవాదుల ఇన్ టేక్ వెల్ వద్ద ఉన్న ఇలాంటి మరో మోటారును తమకు తెలియకుండానే తీసుకొచ్చి భీంఘన్ పూర్ వద్ద అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాయిల్స్ కాలిపోయిన మోటారును మరమ్మతు కోసం పుణకు తరలించినట్లు తెలిసింది. దేవాదుల ప్రాజెక్టులోని భారీ మోటార్లను తరలించాలంటే భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏటూరునాగారం ఇన్ టేక్ వెల్ మోటారును ఎవరికీ తెలియకుండానే కాంట్రాక్టు సంస్థ భీంఘన్ పూర్‌కు తరలించినట్లు తెలిసింది. ఇలా తరలించే క్రమంలో మోటారు కింద పడిపోయినట్లు సాగునీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు.