breaking news
detonators recovered
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రెండు బ్యాగుల నిండా బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్పీ ఎస్ఎస్పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్‌లో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది. ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు! -
పేలుడు పదార్థాలు స్వాధీనం
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల బోడగుట్టలోని స్టోన్ క్రషర్లపై శనివారం రాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కన్నాల బోడగుట్ట క్వారీల్లో అక్రమ బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్, బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కన్నాల క్రషర్లపై దాడులు నిర్వహించారు. 2,915 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 247 జిలెటిన్ స్టిక్స్‌తోపాటు 11 అమ్మోనియం నైట్రేట్ బస్తాలు, పేలుడుకు వాడే బ్యాటరీ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. పిడుగు వెంకటేశ్, ఫక్రుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు ఈగం లక్ష్మయ్య, గండికోట వెంకటేశ్, హరిప్రసాద్, శ్రీసాయి క్రషర్ యజమాని రమణారెడ్డి, సమ్మయ్యపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. లెసైన్సు లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన నిందితులపై పేలుడు పదార్థాల నిషేధిత చట్టం 9బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు.