breaking news
Details of the assets
-
బాబు ఆస్తి తగ్గింది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయి అక్టోబర్ 2 నుంచి జన్మభూమి-మా ఊరు నెల 22న నయూ రాయపూర్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కలు ఎంత పచ్చి అబద్ధాలో చెప్పటానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. తన కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 40 శాతం వాటా ఉందని బాబు శుక్రవారమూ చెప్పారు. అది స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీ కాబట్టి దాని విలువను బాబు దాచినా దాగదు. శుక్రవారంనాడు దాని షేరు ధర రూ.349. ఆ ధర దగ్గర దాని మార్కెట్ క్యాప్ విలువ రూ.810 కోట్లు. మరి అందులో 40 శాతమంటే ఎంత? 324 కోట్లు కాదా? మరి బాబు ఈ వాటాల విలువతో సహా తన కుటుంబానికున్న స్థిర, చరాస్తుల విలువంతా కలిపి రూ.39 కోట్లంటారేం? ఏటేటా తగ్గించుకుని పోతున్నారేం? ఎవరిని నమ్మించాలని? ఈయన మారేదెప్పుడు? హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు వారి ఆస్తులను స్వయంగా వెల్లడిస్తారని చెప్పారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్తుల వివరాలు తెలియజేయడంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు.. ‘‘నా భార్య ఆస్తులు అన్నీ యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్ మాత్రం రూ.1.08 కోట్లు పెరిగింది. బంగారం పెరిగింది. నికర ఆస్తులు తగ్గాయి. కుమారుడు లోకేష్ ఆస్తులు కూడా యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్‌లో రూ.34 లక్షలు పెరిగారుు. వాహనాల సంఖ్య ఒకటి మేరకు పెరిగింది. నికర ఆస్తుల విలువ రూ.1.40 కోట్లు తగ్గింది. బ్రహ్మణి నికర ఆస్తి పెరిగింది. నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తులు పెద్దగా పెరగలేదు. గతంలో రెండున్నర కోట్ల నష్టాల్లో ఉంటే ఈసారి రూ.90 లక్షల లాభాల్లోకి వచ్చింది. హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.1,722 కోట్లు ఉంది. 22 సంవత్సరాల క్రితం నేను ప్రమోటర్‌గా ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు ఇంత పెద్దస్థాయిలో ఉండటం గర్వంగా ఉంది. నా భార్య భువనేశ్వరితో పాటు మిగిలిన బృందం సమర్ధ నిర్వహణ వల్లే పలు అవార్డులు సాధించింది. మెంటర్‌గా దీనికి సంతోష పడుతున్నాను. కంపెనీ కోసం ములుగులో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. క్రమశిక్షణ, నిబద్దత కోసమే ఆస్తులు ప్రకటిస్తున్నాను. ప్రతి రాజకీయ నేత ఆస్తులు ప్రకటించాలి. మెట్రో వివాదాన్ని వాళ్లే పరిష్కరించుకోవాలి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విషయంలో నాపై విమర్శలు రావటం బాధాకరం. ఎల్ అండ్ టీ అనే కంపెనీని నిపుణులు నిర్వహిస్తున్నారు. దానికి యజమాని ఉండరు. ఈ వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం, డెవలపర్ పరిష్కరించుకోవాలి. అయితే ఈ సమస్యను ఆ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో నేను మాట్లాడను. హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ను కేటాయించింది నేను సీఎంగా ఉన్న సమయంలోనే. హామీలన్నీ అమలు చేస్తా హామీల అమలు, పరిపాలన తదితరాల గురించి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల నుంచి టీడీపీ నేర్చుకోవాల్సిన పనిలేదు. వీరు ఆతృత పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరు చూసి ప్రజలు బుద్ధి చెప్పారు. భూస్థాపితం చేశారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన హమీలను ప్రజలు అసహ్యించుకుని టీడీపికి అధికారం కట్టబెట్టారు. వారికి మాట్లాడే అధికారం లేదు. ఇబ్బందులున్నా, ఆర్ధిక వనరులు లేకున్నా ఇచ్చిన హామీలన్నింటినీ ఒక దాని తరువాత ఒకటి అమలు చేస్తాను. అక్టోబర్ 2 నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చేపడుతున్నాం. దీపావళి వరకూ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇదే సమయంలో సామాజిక పింఛన్లు అందచే జేస్తాం. సాధ్యమైనంత త్వరగా విజయవాడకు.. అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ర్ట అధికారుల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర ఆదాయం తేలాలి. సమస్యలున్నా రానున్న రోజుల్లో మంచి జరుగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. విద్యుత్ కోసం రూ.85 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. విజయవాడలో స్థలాలు చూస్తున్నాం. అది పూర్తైన తరువాత వేటిని అక్కడకు తరలించగలమో వాటిని తరలిస్తాం. సాధ్యమైనంత త్వరగా అక్కడకు వెళతాం. సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ పర్యటనకు వెళుతున్నా. ఒకరోజంతా అక్కడ ఉండి ఆ రాష్ర్ట నూతన రాజధాని నయా రాయపూర్ను పరిశీలించటంతో పాటు పోలవరం, ఇతర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తా. ఎర్రచందనం స్మగ్లర్లు ఒక వ్యవస్థలా తయారయ్యారు. వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేద్దామన్నా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.’’ చంద్రబాబే ఆయన ఆస్తులపై విచారణ కోరొచ్చుగా..! : అంబటి ఏపీ సీఎం బాబు తన ఆస్తులపై ఏటా కల్లబొల్లి ప్రకటనలు చేసే బదులు ఆయనే చట్టబద్ధ సంస్థల తో విచారణ కొరచ్చు కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చింది. బాబుకు నిజాయితీ ఉం టే దర్యాప్తునకు ముందుకు రావాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హెరిటేజ్ కంపెనీలో వందల కోట్ల ఆస్తులు, బాలాయపల్లి భూములు, హైటెక్ సిటీ పరిసరాల్లో ఫాంహౌస్, హైదరాబాద్‌లో ఆయన తనయుడి పేరు మీద ఉన్న ఇల్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో, మహా రాష్ట్ర, తమిళనాడుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులు, సంపద, నగలు, నగదు.. బాబు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సంపాదిం చారంటే అంతకు మించి గిన్నిసు బుక్కు ఎక్కించాల్సిన అంశం ఉం టుందా అని ప్రశ్నించారు. ఏటా ఇలా ఆయన ఆస్తులం టూ ఆడిటింగ్ గానీ, చట్టబద్ధతగానీ లేకుండా తెల్ల కాగి తాల మీద అంకెలు వేసి, కనీసం సంతకం కూడా పెట్టకుండా ప్రకటన విడుదల చేయడమేమిటని ప్రశ్నిం చారు. దీనికి బదులు ఆయన స్వదేశీ, విదేశీ, బినామీ ఆస్తుల న్నింటి మీదా చట్టబద్ధమైన విచారణ కోరాలని అన్నారు. . -
ఆస్తుల సమాచారం ఇవ్వాల్సిందే
అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు డిసెంబర్ 31లోగా గడువు తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులు తవు ఆస్తుల వివరాలు ఇవ్వకుండా మొండికెస్తే.. ఇకపై కష్టమే! అంతేకాదు ఏమాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినా.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారులు తవు ఆస్తుల వివరాలపై కచ్చితమైన సవూచారం వెల్లడించాల్సిందే. దీనిపై కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అఖిల భారత సర్వీసు అధికారులు ఇచ్చే సమాచారం ఇకపై లోక్‌పాల్ చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఆస్తుల వివరాల వెల్లడికి ప్రస్తుతం సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఆస్తుల వెల్లడిలో కచ్చితత్వం లేకుంటే.. క్రిమినల్ చర్యలు ఉంటాయని పేర్కొంది. భార్య/భర్త ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో లేదా బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న పక్షంలో వారి వేతన వివరాలను అధికారులు సీల్డ్ కవర్లో వెల్లడించాలని కూడా కోరింది. ఇప్పటి వర కు అధికారులు ప్రతీ సంవత్సరం తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నా శాఖాపరమైన అంశంగా ఉండేది. లోక్‌పాల్ చట్టం రావడంతో ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేం ద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇవ్వని పక్షం లో సదరు ఐఏఎస్ అధికారులను కేంద్ర డిప్యుటేషన్, విదేశీ పర్యటనలకు అనుమతించకుండా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉం టుందని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఢిల్లీ లో నిర్వహించిన అన్ని రాష్ట్రాల సాధారణ పరి పాలన శాఖ ముఖ్యకార్యదర్శుల (పొలిటికల్) సమావేశంలో వెల్లడించింది. ప్రస్తుతం అఖిల భారత సర్వీసు అధికారులకు మాత్రమే అమలు చేస్తున్న ఈ నిబంధనలను త్వరలో రాష్ట్ర కేడర్ అధికారులకు కూడా వర్తింప చేయనున్నారు. అధికారులను త్వరగా కేటాయించండి... అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని డీవోపీటీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున మిడ్ కేడర్ స్ట్రెంత్ సమీక్షను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. రెండేళ్ల క్రితం చేసిన ఈ సమీక్షలో అప్పట్లో 349 మందిగా ఉన్న కేడర్ సంఖ్యను 374కు మార్చారని వివరించిం ది. కొత్త రాష్ట్రం ఏర్పడినందున దానిని సమీక్షిం చి అధికారుల సంఖ్యను నిర్ధారించాలని రాష్ట్రం కోరింది. అధికారుల కొరతతో పాలనా వ్యవహా రాలు గాడిలో పడడం లేదని రాష్ట్రం నుంచి హాజరైన అజయ్‌మిశ్రా కేంద్రానికి వివరించారు. స్వీయ ధ్రువీకరణ... ప్రజలు న్యాయ సంబంధ అంశాల్లో మినహా మిగిలిన అంశాల్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుందని డీవోపీటీ సూచించిందని అజయ్‌మిశ్రా చెప్పారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం 90 శాతంపైగా అంశాల్లో స్వీయ ధ్రు వీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటోం దని, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో చేరే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తనిఖీ చేసుకోవచ్చని, ప్రతీదానికి అఫిడవిట్ లేదా గెజిటెడ్ అధికారులతో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు, దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఎలా చేయాలన్నది నిర్ణయిస్తావుని చెప్పారు. అధికారుల కేటాయింపుల్లో మార్పులు కొందరు ఐఏఎస్‌లు మారే అవకాశం 15న ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అఖిల భారత సర్వీసు అధికారుల తాత్కాలిక కేటాయింపులో 20 మంది వరకు ఐఏఎస్ అధికారుల మార్పులు ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. తాత్కాలికంగా జరిపిన కేటాయింపుల్లో జరిగిన పొరపాట్లతో పాటు, అధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చిన లోపాలపై ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నెల 15న చ ర్చించనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న వారు రాష్ట్రానికి బది లీపై వచ్చినప్పుడు వారిని రాష్ట్ర కేడర్‌లోని సంబంధిత బ్యాచ్‌లో చివరలో చేర్చడం ఆనవాయితీ. కొందరు అధికారులు కేంద్ర సర్వీసు సీనియారిటీనే కొనసాగించారు. దీన్ని సవరించాల్సి ఉంది. దీంతో అధికారుల రోస్టర్ విధానంలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశంలో వీటన్నింటినీ సవరించి తాజా జాబితాను రూపొందించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(డీవోపీటీ)కు సమర్పించనున్నారు. ఈ జాబితాను అక్కడి నుంచి ప్రధానికి పంపిస్తారు. ఆయన ఆమోదం తెలపగానే అధికారుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ అవుతుంది. భార్యాభర్తలు, డిప్యుటేషన్, అంతరాష్ట్ర కేడర్ బదిలీ తదితర అంశాలకు సంబంధించి అధికారులు చేసుకునే దరఖాస్తులను మూడు నెలల్లోగా కేంద్రం పరిష్కరిస్తుందని తెలిపాయి. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయడానికి ఆప్షన్స్ ఇచ్చిన భార్యాభర్తల విషయంలో మా ర్పు ఉండబోదని చెప్పాయి. రాజకీయ అనుబంధమున్న అధికారులు కావాల్సిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, ఆప్షన్ల ప్రకారం కేటాయింపులు జరగని అధికారులు మానసికంగా మథనపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.