Describes
-
దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాం.. చూడాలంటే...!
భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనం ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం సినిమా చూడడానికి ప్రదర్శన శాల (సినిమా హాలు)కు వెళ్లినప్పుడు తెరపై చిత్రాలు ఏ విధంగా కనపడతాయో కొంత అవగాహన ఉంది కదా! ఒక చిన్నగదిలోయంత్రాన్ని (ప్రొజెక్టర్) నడిపిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించి తెరపై బొమ్మలు పడేలా చేస్తాడు ఒక వ్యక్తి. అతడు లేకుండా సినిమా ప్రదర్శన సాధ్యమే కాదు. సినిమా నడిపే వ్యక్తి మాత్రం మనకు కనబడకుండా ఉంటాడు. నీవు అతనిని కలవాలని అనుకుంటే అతడితో పరిచయం ఉన్నవాని (మధ్యవర్తి) సహాయంతో కలవవచ్చు. ఆ సినిమా నడిపే అతనితో స్నేహం పెంచుకొన్న తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు అతని గదిలోకి ప్రవేశించవచ్చు, అతనితో మాట్లాడ వచ్చు కదా!ఈ ప్రపంచమే ఒక విశాలమైన చిత్ర ప్రద ర్శనశాల. దీనియందు మనకు ఎప్పుడూ సంభ వించే సంఘటనలే ప్రదర్శనలు. సినిమాలో ఉన్నట్లు, ఇక్కడ కూడా యంత్రాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతను కూడా కనిపించడు. సరైన పరికరాలు, మధ్యవర్తి ఉంటేనే ఆయన కనిపిస్తాడు. ఈ సందర్భంలో మైత్రి అంటే ‘భక్తి’ అని పిలిచే ఒక సాధనాన్ని ఈ కార్య సాధనలో ఉపయోగిస్తూ సద్గురువు అనే మధ్యవర్తి ద్వారా భగవంతుని చూడవచ్చు. సద్గురువు సహాయంతో భగవంతుని దర్శించుకొన్నవారుఎందరో ఉన్నారు. అటువంటివారి అనుభవాలే మన పవిత్రగ్రంథాల్లో దృష్టాంతాలుగా ఉన్నాయి. భగవంతుని దర్శించుకొనదల చిన వారికి పూర్వం భక్తులు ఏ బాటలో నడచి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారో అటువంటివారు నడచిన మార్గాన్ని ఇతిహాసాలు తేట తెల్లం చేస్తున్నాయి. ఆ మార్గంలోనే భక్తి విశ్వాసాలు, ధైర్యంతో నీవు నడచిన ట్లయితే గమ్యాన్ని చేరుకోగలవు. నిన్ను చెడగొడుతున్న సందేహాలు అన్నీ అప్పుడు తొలగిపోతాయి.శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
ధార్మిక విప్లవాన్ని సాధించిన మహనీయుడు పెదజీయర్
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): ధార్మిక విప్లవాన్ని సాధించిన మహనీయుడు పెదజీయర్ స్వామి అని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పారు. ఆయన 1909 నుంచి 1979 వరకు ఈ భూమిపై భౌతికంగా సంచరించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో ఐదు రోజులుగా సాగుతున్న చినజీయర్ స్వామి ‘తిరునక్షత్ర’మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా చినజీయర్ అనుగ్రహ భాషణం చేశారు. దీపావళి నుంచి 5రోజులుగా దివ్యసాకేత క్షేత్రంలో సీతారామచంద్రస్వామి పునరాగమన కార్య క్రమం జరుపుకున్నట్లు తెలిపారు. 1930కి పూర్వం బ్రాహ్మణులు తప్పా మిగతా వారెవ్వరూ భగవద్గీత, రామాయణం, సహస్రనామాన్ని ముడితే తప్పు, పాపం అనే భావనలో ఉండేవారనీ పెదజీయర్ స్వామి ఉద్యమించాక అవి శ్రద్ధ కలిగిన ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రా వు పాల్గొన్నారు. -
కళ్లు చూసి వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు!
న్యూఢిల్లీ: ఇంతవరకు ఒకరి చేతిరాతిను బట్టి, వారు పడుకునే పొజిషన్ ఆధారంగా, బాడీ లాంగ్వేజ్ను అనుసరించి వారి పర్సనాలిటీ చెప్పొచ్చనే విషయం తెలుసు. కానీ కళ్ల వర్ణాన్ని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో ఒక్కొక్కరి కళ్లు ఒక్కో రంగులో ఉంటాయి. ఆయా రంగులను అనుసరించి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మధు కోటియా చెబుతున్నారు. ఆమె అంచనాలు ఇవి.. నల్ల కళ్లు: ఈ రంగు కళ్లను చూడగానే ఏదో రహస్యాన్ని కలిగా ఉన్నాయి అనే భావన కలుగుతుంది. అయితే వీరు ఎక్కువ విశ్వాసులై ఉంటారు. ఒకరి రహస్యాలను మరొకరితో పంచుకోరు. బాధ్యతాయుతంగా, విధేయంగా ఉండడంలో వీరి తర్వాతే ఎవరైనా. తమ ప్రతిభను ఇతరులకు ఎలా చూపించాలో వారికి బాగా తెలుసు. ఎక్కువ కష్టపడే గుణం వీరి సొంతం. గోధుమ రంగు కళ్లు: ఈ రంగు కళ్లు కలిగిన వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వీరు ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మకతను కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు ఇతరులకు కొంచెం కఠినమైన వ్యక్తిత్వం కలవారిగా కనిపిస్తారు. లేత గోధుమ రంగు కళ్లు: ఈ రంగు కళ్లున్నవారు ఎక్కువ సరదాగా ఉంటారు. ఇతరులను ఎక్కువగా నవ్వించే స్వభావం వీరికి ఉంటుంది. సాహసాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. సందర్భోచితంగా, సమయానుకూలంగా మెలిగే నేర్పుని కలిగి, ఏ పరిస్థితినైనా అర్థం చేసుకుంటారు. మంచి మనసు కలిగి ఉండే వీరు ఒకే తరహాగా ఉండేందుకు ఇష్టపడరు. వీరు ఎదుటివారిని త్వరగా ఆకర్షించగలిగినప్పటికీ ఇతరులతో ఎక్కువ కాలం ఆ బంధాన్ని కొనసాగించలేరు. బూడిద రంగు కళ్లు: ఈ రంగు కళ్లు ఉంటే వారు దృఢ చిత్తులై, హుందాతనంతో వ్యవహరిస్తారు. కొంచెం ఆధిపత్య స్వభావం వీరి సొంతం. గొడవలు, కోపానికి వీలైనంత దూరంగా ఉంటారు. శక్తియుక్తులన్నింటినీ లక్ష్యంపైనే పెడతారు. ప్రేమ, అనురాగాలు వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారి మానసిక బలం, ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక ధోరణి వారిని ఏ పరిస్థితిలోనైనా నెగ్గుకు రాగలిగే నాయకులుగా మారుస్తుంది. పచ్చ రంగు కళ్లు: ఈ రంగు కళ్లున్న వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సుకత ప్రదర్శిస్తారు. జీవితంపై, అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కానీ వీరికి త్వరగా అసూయపడే స్వభావం ఉంటుంది. నీలి రంగు కళ్లు: ఎదుటివారిని త్వరగా ఆకర్షించడం, శాంతియుతమైన ధోరణి కలిగి ఉండడం ఈ రంగు కళ్లున్న వారి ప్రత్యేకత. చాలా తెలివితేటలు కలిగి ఉండడమే కాకుండా, ఇతరులతో అనుబంధాల్ని ఎక్కువ కాలం కొనసాగిస్తారు. నిజాయితీ, దయ లాంటి లక్షణాలతో ఇతరులు సంతోషంగా ఉండడానికి తోడ్పడతారు. చుట్టుపక్కల విషయాల్ని సునిశిత దృష్టితో పరిశీలిస్తారు.