breaking news
Dera chairperson Vipassana
-
హనీప్రీత్ గురించి విపాసన ఏం చెప్పారంటే..
సాక్షి,చండీగర్: డేరా సచా సౌథా చైర్పర్సన్ విపాసనా ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చారు. డేరా చీఫ్ గుర్మీత్‌ను దోషిగా నిర్దారించిన అనంతరం ఆగస్ట్ 25న హింస చెలరేగిన తర్వాత ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ సిర్సాకు వచ్చిందని పోలీసుల విచారణలో విపాసన వెల్లడించారు. హనీప్రీత్‌ను రోహ్తక్ నుంచి సిర్సాకు తీసుకువచ్చేందుకు తాను వాహనం సమకూర్చానని డీఎస్పీ కుల్దీప్ బెనివల్ నేతృత్వంలోని సిట్ బృందానికి విపాసన చెప్పారు. మూడున్నర గంటల పాటు విపాసనను సిట్ బృందం ప్రశ్నించింది. ఆగస్టు 27 తర్వాత సిర్సా నుంచి హనీప్రీత్ అదృశ్యమయ్యారని, అప్పటి నుంచి డేరా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లతో ఆమె టచ్‌లో లేరని చెప్పారు. గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించకముందు, ఆ తర్వాత డేరా ప్రాంగణంలో నెలకొన్న పరిస్ధితి గురించి విపాసనను సిట్ టీమ్ ప్రశ్నించినట్టు సమాచారం. హనీప్రీత్ వెంట ప్రదీప్ గోయల్ ఇన్సాన్, ప్రకాష్ కుమార్ అలియాస్ విక్కీలు ఉన్నారని విపాసన వెల్లిడించినట్టు డీఎస్పీ బెనివల్ చెప్పారు. గోయల్, ప్రకాష్‌లు డేరా ప్రతనిధి ఆదిత్యా ఇన్సాన్ బంధువులు కావడం గమనార్హం.వీరిని ఉదయ్‌పూర్, మొహాలీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు పంచకుల సిట్ వద్ద కస్టడీలో ఉన్నారు. -
ఇంతకీ గుర్మీత్ భార్య, పిల్లలు ఏమయ్యారు?
సాక్షి, న్యూఢిల్లీ : గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు పాలు కావటంతో డేరా సచ్ఛా సౌదా కొత్త చీఫ్‌గా ఎవరన్న ప్రశ్న మొదలయ్యింది. ఈ రేసులో రాక్ స్టార్ కుటుంబ సభ్యుల పేర్లు కాకుండా అనూహ్యంగా దత్త పుత్రిక హనీప్రీత్ తో పాటుగా డేరా చైర్పర్సన్ విపాసన పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుర్మిత్ భార్య, పిల్లలు ఎక్కడనున్నారు? ఇంత జరుగుతున్నా వాళ్లు ఎందుకు స్పందించటం లేదు? అన్న ఆరాలు మొదలయ్యాయి. గుర్మీత్ భార్య ఎవరు? గుర్మీత్ తన పదో తగరగతి పూర్తి చేసుకోగానే హర్జీత్ కౌర్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి అమర్‌ప్రీత్, చరణ్‌ప్రీత్ ఇద్దరు కూతుళ్లు, కుమారుడు జస్మిత్ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురి పిల్లలు కాకుండా ప్రియాంక తనేజా(హనీ ప్రీత్)ను గుర్మీత్ దత్తత తీసుకున్నారు. సొంత పిల్లల కన్నా హనీప్రీత్తోనే ఆయన ఎక్కువ సానిహిత్యంగా ఉండేవారంట. ఇక ఆయన పిల్లల సంగతి ఏమోగానీ భార్య మాత్రం తరచూ డేరాలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేదని పలువురు చెబుతుండగా, మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని అంటున్నారు. డేరాలో గుర్మీత్‌కు చాలా దగ్గరగా ఉండి సపర్యలు చేసినవాళ్లు కూడా గత ఐదేళ్లలో ఆమెను చూసింది లేదనే అంటున్నారు. డేరా కాంప్లెక్స్ లోనే ఎక్కువ సమయం గడిపే హర్జీత్ సాదాసీదా దుస్తులు ధరించి, మిగతా భక్తులతో కలిసిపోయి కూర్చుని ధ్యానంలో పాల్గొనేదంట. అయితే డేరా కార్యకలాపాల్లో ఆమె ఎలాంటి భూమిక పోషించిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకే హర్జీత్ కౌర్.. డేరా బాబా భార్య అని ఎవరూ గుర్తించేవారు కాదని కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు గుర్మిత్పై ఆరోపణలు వచ్చిన సమయంలోనూ హర్జీత్ స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేసులో దోషిగా తేలటం, ఆపై శిక్ష ఖరారుల నేపథ్యంలో కూడా హర్జీత్, ఆమె పిల్లలు కనిపించలేదు. చివరకు జైలుకు తరలించే సమయంలోనూ హనీప్రీత్ గుర్మీత్‌కు వెంట ఉంది. ఈ తరుణంలో వాళ్ల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. సెలబ్రిటీ హోదాకు దూరంగా ఉండాలనే అలా చేస్తున్నారా? గుర్మీత్ వ్యవహారాలు తెలిసే ఆయనను..కుటుంబీకులు దూరం పెట్టారా? హనీప్రీత్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వటం నచ్చకే ఇలా చేస్తున్నారా? ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు చర్చించుకుంటున్నారు.