breaking news
delhi girls gang raped
-
మా బాయ్‌ఫ్రెండ్స్ ఎదుటే రేప్ చేశారు
న్యూఢిల్లీ: ఐదుగురు దుండుగులు తమపై లైంగికదాడి చేస్తుంటే తమ బాయ్‌ఫ్రెండ్స్ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారే కానీ తమను కాపాడే ప్రయత్నం చేయలేదని ఢిల్లీ అమన్ విహార్ బాధితుల్లో ఓ అమ్మాయి చెప్పింది. తమను రక్షించాలని ఏడ్చామని, ఎవరూ ఆదుకోలేదని విలపించింది. ఇటీవల ఢిల్లీలో ఇద్దరు టీనేజి యువతులపై సామూహిక లైంగికదాడి జరిగిన సంగతి తెలిసిందే. 17, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి రాత్రి 7 గంటల ప్రాంతంలో ముకుంద మెట్రో స్టేషన్ సమీప ప్రాంతానికి వెళ్లారు. నలుగురం కలసి ఓ నిర్జన ప్రదేశంలో కూర్చుని ఉండగా, ఐదుగురు దుండగులు వచ్చి వేధించారని బాధితురాలు చెప్పింది. తాము అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, నిందితులు కర్రలు తీసుకుని బాయ్‌ఫ్రెండ్స్‌ను కొట్టి, తమను బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి పాల్పడినట్టు తెలిపింది. బాయ్‌ఫ్రెండ్స్ తమను కాపాడుతారని భావించామని, సాయం చేయమని అరిచామని, వారు కూర్చుని దారుణాన్ని చూస్తున్నారే కానీ తమను రక్షించే ప్రయత్నం చేయలేదని బాధితురాలు వెల్లడించింది. కాగా మరో బాధితురాలు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దుశ్చర్య అనంతరం నిందితులు పారిపోగా, బాధితులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేయగా, మరొకడు పరారీలో ఉన్నాడు. -
ఇద్దరు యువతులపై సామూహికంగా..
దేశరాజధాని నగరం ఆడవాళ్లకు సురక్షితం కాదన్న విషయం మరోసారి తేలిపోయింది. ఇద్దరు టీనేజి యువతులపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 17, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి ముకుంద మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక నిర్జన ప్రాంతానికి వెళ్లారు. అక్కడే అబ్బాయిలను కొట్టి.. అమ్మాయిలపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో నలుగురిని గుర్తించి గురువారం రాత్రే పోలీసులు అరెస్టు చేశారు. ఐదో వ్యక్తిని కూడా గుర్తించినా, అతడు పరారీలో ఉన్నాడు. నిందితులు కూడా యువతులు ఉండే ప్రాంతంలోనే ఉంటారని, అయితే పరిచయం లేరని అంటున్నారు. పోస్కో చట్టంతో పాటు ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద వారిపై అమన్ విహర్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు డీసీపీ విక్రమ్‌జీత్ సింగ్ తెలిపారు. నిందితుల్లో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.