breaking news
Delhi civic elections
-
ఆ గ్రామం ఎన్నికలను బహిష్కరించింది..అక్కడ ఎవరూ ఓటు వేయరు!
న్యూఢిల్లీ: వాయువ్య ఢిల్లీలోని ఒక గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఓటు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు అక్కడి ప్రజలు. ఈ మేరకు ఢిల్లీలోని వాయువ్య జిల్లాలోని కతేవారా గ్రామంలోని ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బహష్కరించారు. తమ ప్రాంతంతో రోడ్లు, డ్రైయిన్లతో సహా కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరసనగా గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. డిసెండర్ 4 ఆదివారం ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే కతేవారా గ్రామస్తులు అధికారులు తమ గోడు పట్టించుకునేంత వరకు ఓటు వేయమని కరాకండీగా చెప్పారు ప్రజలు. ఈ మేరకు అక్కడి గ్రామస్తులు ఈశ్వర్ దత్ మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మించాలని పాలకవర్గంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మూడు రోడ్లను నిర్మించాలని కోరుతున్నాం. తాము ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. మా డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికలను కూడా బహిష్కరిస్తాం. అని చెప్పారు. ఇక అక్కడి ప్రజలు మున్సిపల్ ఎన్నికలు రోజంతా తమత పనులు చేసుకుంటూ గడిపారు. కాగా, మూడు పౌర సంస్థలను విలీనం తర్వాత డిల్లీలో జరుగుతున్న తొలి పౌర ఎన్నికలు ఇవి. (చదవండి: చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు) -
కిరాయిదారులకు ఊరట.. సబ్సిడీ అమలు!
త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అద్దెకు ఉండే మధ్యతరగతి జీవులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు. ఇప్పటివరకు అమలుచేస్తున్న విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ఇకనుంచి ఇళ్ల కిరాయిదారులకు కూడా అమలుచేయనున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసి మరోసారి సత్తా చాటాలని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్, నార్త్, ఈస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఈ మూడింటిలోనూ అధికారం కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆప్.. ప్రధానంగా తన ఓటుబ్యాంకు అయిన మధ్యతరగతి ప్రజలపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో నివాస గృహాల ఆస్తి పన్ను చెల్లింపును రద్దుచేసిన సీఎం కేజ్రీవాల్.. ఇకనుంచి ఢిల్లీలో ఉండే కిరాయిదారులకు కూడా విద్యుత్ సబ్సిడీ పథకాన్ని అమలుచేయబోతున్నట్టు ట్విట్టర్లో తెలిపారు.