breaking news
Delhi-Bangalore
-
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
చౌకగా మిడ్నైట్ విమాన టికెట్లు!
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానాయాన సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త సర్వీసును ప్రారంభించనుంది. తన నెట్వర్క్ పరిధిలో నవంబర్ 2 నుంచి రెడ్ ఐ ఫ్లయిట్ సర్వీసెస్‌ను మొదలుపెట్టనుంది. దీనిద్వారా ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-నాందెడ్‌కు నడిచే మిడ్ నైట్ విమానాల టికెట్ ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా రెడ్ ఐ విమానాలు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణమై.. తెల్లవారుజాముకు గమ్యస్థానాన్ని చేరుతాయి. ఇప్పటికే రెండు దేశీయ విమానాయాన సంస్థలు ఇలాంటి ఆఫర్లను ప్రయాణికులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్, ఇండిగో సంస్థలు చౌక ధరలకు అర్ధరాత్రి నడిచే విమానాల సర్వీసులను అందజేస్తున్నాయి. గుర్గావ్కు చెందిన స్పైస్ జెట్ కూడా ఇదేదారిలో ముందుకుసాగుతున్నది. తన శీతకాలం షెడ్యూల్ భాగంగా ఇలాంటివే మరో ఆరు సర్వీసులను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తున్నది. రెడ్ ఐ సర్వీసులో భాగంగా ఢిల్లీ-బెంగళూరు మధ్య టికెట్ ధరను రూ. 3889గా స్పైస్ జెట్ నిర్ణయించింది. రెడ్-ఐ విమాన సర్వీసులు భారత్‌లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా.. అమెరికా, యూరప్ దేశాల్లో అవి ఎంతగానో ప్రజాదరణ పొందాయి.