breaking news
Defense experts
-
పాకిస్తాన్ వైమానిక శక్తి...మూడోవంతు ఊడ్చుకుపోయింది!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్‌కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్ తదితర క్షిపణులు పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడడం తెలిసిందే. వాటి ధాటికి అవి కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలతో పాటు రక్షణ నిపుణులు తేల్చారు. ‘‘పాక్ వైమానిక స్థావరాల్లోని కీలక వ్యవస్థలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాక్ ఎంతోకాలంగా మిడిసిపడుతున్న ఎఫ్ 16, జేఎఫ్ 17 వంటి అత్యాధునిక అమెరికా, చైనా తయారీ యుద్ధ విమానాల్లో చాలావరకు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి’’ అని వెల్లడించారు. సైనిక ఆపరేషన్లలో స్వావలంబన ప్రస్థానంలో ఆపరేషన్ సిందూర్‌ను మైలురాయిగా రక్షణ శాఖ అభివర్ణించింది. భారత రక్షణ పాటవానికి, ఆ రంగంలో సాధించిన స్వావలంబనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. ‘‘సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలతో పాటు ఆ దేశ నలుమూలల్లోని కీలక సైనిక, వైమానిక వ్యవస్థలను కూడా తుత్తునియలు చేసి చూపించాం. పాక్ మాత్రం సైనికపరంగా కేవలం విదేశీ సాయాన్నే నమ్ముకుంది. మనపై దాడులకు చైనా తయారీ పీఎల్–15, తుర్కియేకు చెందిన ‘యిహా’ డ్రోన్లు, యూఏవీలను వాడింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ద్వారా తిరుగులేని రుజువులను ప్రపంచానికి చూపించాం’’ అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఐఏఎఫ్ చీఫ్‌దే కీలకపాత్ర పాక్ వైమానిక స్థావరాలపై మన దాడుల్లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్సింగ్దే కీలక పాత్ర. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దాడులు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యంగా అతి కీలకమైన రావల్పిండిలోని చక్లాలా (నూర్ ఖాన్) ఎయిర్‌బేస్‌పై దాడి ప్లానింగ్ పూర్తిగా ఆయనదే. ఆ దాడిలో పాల్గొన్న పైలట్ల ఎంపిక తదితరాలను కూడా సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. శనివారం తెల్లవారుజామున చక్లాలాలో మూడు ప్రాంతాలపై మన క్షిపణులు విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించాయి. వాటి దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడు గంటలు బంకర్లో తలదాచుకోవడమే గాక తన నివాసాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చేశారట!నేవీ త్రిముఖ వ్యూహం పాక్‌పై మన దాడుల సందర్భంగా నేవీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్‌ను అష్టదిగ్బంధం చేసేసింది. అందులో భాగంగా పాక్‌కు జీవనాడి వంటి కరాచీ ఓడరేవుపై మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పూర్తిస్థాయిలో గురిపెట్టింది. ఏకంగా 36 నావికా దళాలను మోహరించింది. ఏడు డి్రస్టాయర్లు, ఐఎన్ఎస్ తుషిన్ వంటి యుద్ధనౌకలు వాటిలో ఉన్నాయి. అవన్నీ బ్రహ్మోస్, ఎంఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులను ఎక్కుపెట్టి ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాయి. అంతేగాక వరుణాస్త్ర వంటి అత్యాధునిక టార్పెడోలతో జలాంతర్గాములను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా సన్నద్ధం చేసింది. దాంతో మరో దారిలేక పాక్ నేవీ కేవలం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది.నవాజ్ కనుసన్నల్లోనే...! భారత్‌పై పాక్ సైనిక చర్యలను పూర్తిగా ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మనపై దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు సమాచారం. నవాజ్ మూడుసార్లు పాక్ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) సారథి. 1999లో ఆయన ప్రధానిగా ఉండగానే కార్గిల్ యుద్ధం జరిగింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం తెలిసిందే. ఆ మర్నాడు షహబాజ్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో ప్రభుత్వపరంగా ఏ హోదా లేని నవాజ్ కూడా పాల్గొన్నారు.మా మద్దతు పాక్‌కే: తుర్కియే అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురవుతున్నా తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. అన్నివేళలా పాక్‌కే మద్దతుగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం కుండబద్దలు కొట్టారు. ‘‘పాక్ మా నిజమైన మిత్రదేశం. మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్–తుర్కియే దోస్తీ జిందాబాద్!’’ అని చెప్పుకొచ్చారు. -
Defence stocks rally: డిఫెన్స్ షేర్లు లాభాల గన్స్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్ కౌంటర్లకు జోష్ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. జాబితా పెద్దదే గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్ సంబంధ షేర్లలో మజ్గావ్ డాక్‌యార్డ్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్(ఇండియా), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ వెల్లడించారు. కారణాలున్నాయ్.. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్‌కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరంగ్ షా తెలియజేశారు. భవిష్యత్‌లో బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్, కొచిన్ షిప్‌యార్డ్ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు. దిగుమతి ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్‌తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
వ్యక్తిగత స్వేచ్ఛా? దేశ భద్రతా?
♦ ఎఫ్‌బీఐ వర్సెస్ యాపిల్‌తో తెరపైకి ♦ భారత్‌లో ఆంక్షల ముసాయిదాపై వ్యతిరేకత ♦ సెల్‌ఫోన్ డేటా ఎన్‌క్రిప్షన్‌పై ఎడతెగని చర్చ ♦ దేశభద్రతే ముఖ్యమంటున్న ప్రభుత్వాలు,రక్షణ నిపుణులు సాంకేతిక పరిజ్ఞానంతో స్వేచ్ఛ, భద్రత మరింత పెరగాలి. కానీ.. టెక్నాలజీ పెరగటం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు.. దేశభద్రతే ముఖ్యమని మరికొందరు వాదిస్తున్నారు. ఉగ్రవాది సెల్‌ఫోన్ నుంచి సమాచార సేకరణ విషయంలో ఎఫ్‌బీఐ, యాపిల్ కంపెనీ మధ్య తలెత్తిన వివాదంతో ఎన్క్రిప్షన్ వివాదం తెరపైకి వచ్చింది. అటు వాట్సప్, ఫేస్‌బుక్‌లు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకే (ఎన్క్రిప్షన్) ప్రాధాన్యమిస్తామని చెప్పటం... దీనిపై ఆంక్షలకు కేంద్రం ప్రయత్నించటం విమర్శలకు దారితీసింది. అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? దీనివల్ల దేశభద్రతకున్న ప్రమాదమేంటి? రక్షణ, సాంకేతిక నిపుణుల ఏమంటున్నారు? ఎన్క్రిప్షన్ అంటే? మనం పంపిన సమాచారాన్ని అవతలి వ్యక్తికి భద్రంగా చేర్చటమే ఎన్క్రిప్షన్. మనం పంపిన సమాచారంతో పాటు ఓ కోడ్‌నెంబర్ కూడా ఉత్పన్నమవుతుంది. అది గ్రహీతకు చేరిన తర్వాత ఆ పాస్వర్డ్ ఉంటేనే ఈ సమాచారం ఓపెన్ అవుతుంది. మధ్యలో ఎవరూ ఆ పాస్వర్డ్ లేకుండా సమాచారాన్ని తెలుసుకునే వీలుండదు. ఫేస్బుక్ అయినా వాట్సప్ అయినా.. గ్రహీతకు చేరేలోపే హ్యాకర్లు తమ నైపుణ్యంతో దీన్ని చదివేసే అవకాశం ఉంటుంది. అయితే మన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేస్తే హ్యాకింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో సమాచారాన్ని పంపిన వ్యక్తి దీన్ని అందుకున్న వ్యక్తి మాత్రమే దీన్ని చదవగలిగేలా రహస్యంగా ఉంటుంది. దీని వల్ల సమాచార మార్పిడి చేసే కంపెనీలు (వాట్సప్, ఫేస్బుక్..) కూడా ఈ సమాచారాన్ని చదవటం అసాధ్యం. ఈ సందేశాన్ని చదవాలంటే డిక్రిప్ట్ చేయాలి.. ఇందుకు పాస్వర్డ్ తెలిసిఉండాలి. మధ్యలో ఎవరైనా దీన్ని బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తే మొత్తం సమాచారం నాశనం అవుతుంది. వివాదమేంటి? గతేడాది డిసెంబర్లో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో క్రిస్మస్ పార్టీపై ఓ జంట కాల్పులు జరిపి 14 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనలో.. ఇద్దరు ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులను అమెరికా పోలీసులు మట్టుబెట్టారు. వీరి మృతదేహం వద్ద దొరికిన ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ).. తీవ్రంగా ప్రయత్నించింది. ఈ ఫోన్ డేటా పక్కా పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ కావటంతో అన్‌లాక్ చేయాలని ఈ మొబైల్ తయారీదారు యాపిల్ కంపెనీని కోరింది. దీనికి నిరాకరించిన యాపిల్ కంపెనీ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా బహిర్గతం చేయటం కుదదరని తేల్చిచెప్పింది. దేశభద్రతే ముఖ్యమని అమెరికా కోర్టు ఆదేశించినా యాపిల్ కంపెనీ ససేమిరా అని తేల్చేసింది. అయితే.. ఆ తర్వాత మెకఫీ సంస్థ, ఇతర సాంకేతిక నిపుణుల సాయంతో ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయించుకుంది. యాపిల్‌కు అండ వినియోగదారుడి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలన్న యాపిల్ నిర్ణయానికి సామాజిక మాధ్యమ వేదికలన్నీ అండగా నిలిచాయి. ట్విటర్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వాట్సప్, యాహూ, లింక్డిన్, డ్రాప్ బాక్స్ వంటి వివిధ సంస్థలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే.. అమెరికాతోపాటు వివిధ ప్రభుత్వాలు మాత్రం.. వ్యక్తిగత స్వేచ్ఛకన్నా.. దేశభద్రతే ముఖ్యమని భావించాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి ఆ దేశ సెనేట్ వరకు అంతటా.. దేశభద్రతకే మద్దతు లభించిం ది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా దేశభద్రతే తొలి ప్రాధాన్యమన్నారు. భారత్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఇంటలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. వాట్సప్, ఫేస్బుక్లతోపాటు పలు సామాజిక మాధ్యమ వేదికలపైనా ఆంక్షలు విధిస్తూ ముసాయిదాను రూపొందించింది. ముసాయిదాలో ఏముంది?: సామాజిక మాధ్యమాలపై ఆంక్షలకోసం కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం.. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపే సమాచారాన్ని ప్రతి పౌరుడూ కనీసం 90 రోజుల పాటు నిల్వ ఉంచాల్సిందే. దేశ భద్రతకు సంబంధించి ఏమాత్రం అనుమానం వచ్చినా.. దర్యాప్తు బృందాలే అడిగినప్పుడు ఈ సమాచారాన్ని చూపించాల్సిందేనని ఆంక్షలు విధించింది. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమేనని హక్కుల సంఘాలు దుయ్యబట్టాయి. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకోవాల్సింది పోయి.. ఉక్కుపాదం మోపాలనుకోవటం సరికాదని.. సాంకేతిక నిపుణులు అన్నారు. దీంతో ఈ ముసాయిదా నుంచి ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లను కేంద్రం మినహాయించింది. ఇదే దేశభద్రతకు ముప్పు ఇలా సమాచారం చాలా భద్రంగా అనుకున్న వ్యక్తికి చేరటం వల్ల కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల రహస్య సమాచార ప్రసారంపై నిఘా పెట్టలేమని భద్రతాసంస్థల వాదన. కానీ సాంకేతిక నిపుణులు మాత్రం ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందని.. అలాంటి పరిష్కారం కోసం యత్నించాల్సిన ప్రభుత్వం.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదంటున్నారు.