breaking news
declared
-
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
1975. జూన్ 25. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటిమయమైన అధ్యాయానికి తెర లేచిన రోజు. దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాలు దేశ ప్రజల పాలిట నిత్య కాళరాత్రే అయింది. ఎటుచూసినా దమనకాండ. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకుని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు, జీవించే హక్కుకే దిక్కు లేని దుస్థితి.పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెట్టిన పరిస్థితి! సర్వం సహా అధికారమంతా ఇందిర చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతం! అసలే దుందుడుకుతనానికి మారుపేరు. ఆపై బాధ్యతల్లేని అధికారం. దాని అండతో, సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారల్లా జైలుపాలే. చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేయడం సంజయ్ నియంతృత్వ పోకడలకు పరాకాష్టగా నిలిచింది.మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాలా హాహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి, నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెర లేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ అకృత్యాలు, దాని పరిణామాలు తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....అలా మొదలైందినిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా నానారకాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. ఇందిరకు వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీకి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది మాత్రం ఇందిర ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే. 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఇందిరపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిర ఎన్నికల ఏజెంటు యశ్పాల్ కపూర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పని చేశారని పేర్కొన్నారు.ఈ కేసును కొద్దిరోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిర సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భమది. మూడేళ్ల పాటు ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికీ బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిర ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు! దానిపై ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చినా, పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పునిచ్చింది.ఇది విపక్షాలకు అతి పెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవ) నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చూస్తుండగానే దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటసాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది.పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిర సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. ‘అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించా’లంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.ఏం జరిగింది?⇒ ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్య్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. ⇒ మీడియాపై కనీవినీ ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. ⇒ అనుమానం వస్తే చాలు, ఎంతటివారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ⇒ జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణీ, మధు దండావతే, నానాజీ దేశ్‌ముఖ్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కరుణానిధి, జార్జి ఫెర్నాండెజ్, ప్రకాశ్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు.⇒ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు. ⇒ ఈ నిర్బంధాలకు గుర్తుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ సమయంలో పుట్టిన తన కూతురికి మీసా భారతి అని పేరు పెట్టుకోవడం విశేషం! ⇒ న్యాయవ్యవస్థ హక్కులకు కూడా కోత పడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. ⇒ జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ⇒ సుందరీకరణ పేరుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు.చివరికేమైంది? ⇒ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జనవరి 20న లోక్‌సభను రద్దు చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారి ఓటమి పాలైంది. ⇒ ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్ కూడా ఓటమి చవిచూశారు. ⇒ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ⇒ లుకలుకలతో కొద్దికాలానికే కుప్పకూలినా, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. ⇒ ఎమర్జెన్సీ ఆందోళనల్లోంచే ఫెర్నాండెజ్, కారత్ వంటి కొత్త తరం నాయకులు ఎదిగి వచ్చారు.మీడియాకూ చుక్కలే ⇒ ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిర సర్కారు, ముఖ్యంగా ఆమె తనయుడు సంజయ్ గాంధీ అక్షరాలా ఉక్కుపాదం మోపారు! అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ పేరుతో చట్టమే తెచ్చారు. ⇒ మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. ⇒ జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యర్, కె.ఆర్.మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. ⇒ మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు. ⇒ చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ⇒ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ), హిందూస్తాన్ సమాచార్, సమాచార్ భారతి వంటి వార్తా సంస్థలను ‘సమాచార్’ పేరిట బలవంతంగా విలీనం చేసిపారేశారు. ⇒ వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తనూ అక్షరాక్షరం క్షుణ్నంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ⇒ ఇన్ని చేసినా కలానికి మాత్రం సంకెళ్లు వేయలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది. ⇒ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది.సినిమాలకూ చీకటి రోజులే!⇒ బాలీవుడ్‌తో పాటు దేశ సినీ పరిశ్రమకు కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంగానే మిగిలిపోయింది.⇒ సంజయ్గాందీని ప్రస్తుతించేందుకు నిరాకరించారని బాలీవుడ్ స్టార్ దేవానంద్ సినిమాలను దూరదర్శన్‌లో నిషేధించారు.⇒ ప్రభుత్వ 20 సూత్రాల పథకాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభావరిలో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిశోర్‌కుమార్ గొంతు ఆలిండియా రేడియోలో విని్పంచకుండా, ఆయన పాటలు దూరదర్శన్‌లో కన్పించకుండా చేశారు.⇒ ఇందిరను పోలిన పాత్రలో సుచిత్రసేన్ జీవించిన ‘ఆం«దీ’, నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన ‘కిస్సా కుర్సీ కా’ వంటి సినిమాలను నిషేధించారు. ఇందిర నియంతృత్వాన్ని సినీ పరిశ్రమ ఎదిరించింది. దేవానంద్ ఏకంగా నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట కొత్త పార్టీయే పెట్టారు.⇒ శత్రుఘ్న సిన్హా, ప్రాణ్, డానీ డెంగ్జోంగ్పా వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొలిటికల్ స్టార్ బ్రిగేడ్ పేరిట జనతా పార్టీకి మద్దతిచ్చారు. ⇒ విప్లవ ఇతివృత్తంతో పట్టాభిరామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండ మారుతను నిషేధించడమే గాక అందులో నటించిన ఆయన భార్య స్నేహలతారెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధంలో గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెరోల్‌పై బయటికొచ్చిన ఐదు రోజులకే కన్నుమూశారు.హోం మంత్రికే తెలియదు! దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తూ నాటి కేంద్ర హోం మంత్రి ఓం మెహతాకే తెలియదు! ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది. తర్వాత కాసేపటికే కేంద్ర కేబినెట్‌ను సమావేశపరిచిన ఇందిర, ఎమర్జెన్సీ విధింపు గురించి సహచర మంత్రులకు తీరిగ్గా వెల్లడించారు. అనంతరం ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని చెప్పుకొచ్చారు.ఇది ప్రజాస్వామ్యానికి ఇందిర పాతర వేసిన రోజు – ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
నా మతం మానవత్వం... ఇదే నా డిక్లరేషన్... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
Singapore: ఈ 16 కీటకాలను లొట్టలేసుకుంటూ తినొచ్చు
వివిధ రకాల కీటకాలు, పురుగులను లొట్టలేసుకుంటూ తినే ఆహార ప్రియులకు సింగపూర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కీచురాళ్లు, గొల్లభామలు, చిమ్మట జాతులకు చెందిన కీటకాలను మనుషులు నిర్భయంగా, ఏమాత్రం సందేహం లేకుండా ఆహారంగా లాగించేయవచ్చని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.సింగపూర్ ఫుడ్ రెగ్యులేటర్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) తాజాగా 16 జాతుల కీటకాలను మనుషులు తినవచ్చని తెలిపింది. వీటిని ఆహారంలో వినియోగించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కీటకాలు సింగపూర్, చైనా వంటకాలలో విరివిగా వినియోగిస్తుంటారు.స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక అందించిన నివేదిక ప్రకారం క్యాటరింగ్ వ్యాపార నిర్వాహకులు ఎస్ఎఫ్ఏ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరు చైనా, థాయ్‌లాండ్, వియత్నాంలో ఉత్పత్తి అయ్యే ఈ కీటకాలను సింగపూర్‌కు సరఫరా చేస్తుంటారు. వీరు ఈ కీటకాలను సింగపూర్ తీసుకురావాలంటే ఎస్ఎఫ్ఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -
శ్రీరామ నవమి ఇకపై ప్రభుత్వ సెలవుదినం!
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ, కాళీపూజ, సరస్వతీ పూజలను ఘనంగా జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీ రామ నవమికి నేటి వరకూ సెలవు లేదు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. శ్రీరామనవమి రోజున జనం ఊరేగింపులు నిర్వహించే హక్కులను కాలరాయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రానున్న శ్రీరామ నవమికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ ప్రభుత్వం హిందువులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
వుయ్‌వర్క్ దివాలా!
న్యూయార్క్: ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్‌ఫోలియోను మరింత క్రమబద్దికరించుకోనున్నట్లు పేర్కొంది. రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించేలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడా వెలుపలి దేశాల్లోని తమ కార్యకలాపాలపై ఈ పరిణామ ప్రభావం ఉండబోదని వుయ్‌వర్క్ వివరించింది. సమస్యలను పరిష్కరించుకుని, వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో డేవిడ్ టోలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఈ ఏడాది ప్రథమార్ధంలో 696 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. జూన్ 30 నాటికి వుయ్‌వర్క్‌కు 39 దేశాల్లో 777 చోట్ల కార్యకలాపాలు ఉన్నాయి. అప్పట్లో 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ .. గతంలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో వెలుగొందిన వుయ్‌వర్క్ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి దూకుడుగా విస్తరించడం, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి ఇందుకు దారితీశాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచే దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో ఐపీవోకి వచ్చినా వేల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి 9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకన్నా ముందే కంపెనీ, వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. న్యూమాన్ ఉద్వాసనకు గురయ్యారు. సంస్థలో మెజారిటీ వాటాలు తీసుకున్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. కంపెనీని నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహ ణ వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ వుయ్‌వర్క్ ఆగస్టులోనే వెల్లడించింది. ఆ తర్వాత లీజులన్నింటినీ పునఃసమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించింది. నష్టాల్లో ఉన్న లొకేషన్ల నుంచి వైదొలగనున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రభావం ఉండదు.. వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి స్పష్టం చేశారు. దివాలా ప్రక్రియలో భారత వ్యాపారం భాగంగా లేదని తెలిపారు. వుయ్‌వర్క్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌నకు 73 శాతం, వుయ్‌వర్క్ గ్లోబల్‌కు 27 శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌లో ఏడు నగరాల్లో వుయ్‌వర్క్ ఇండియాకు 50 కేంద్రాలు ఉన్నాయి. 2021 జూన్‌లో వుయ్‌వర్క్ ఇండియాలో వుయ్‌వర్క్ గ్లోబల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
డొమినికా టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 421/5 డిక్లేర్డ్
-
కరోనాతో చనిపోయి.. బతికొచ్చాడు!
క్రైమ్: విడ్డూరంగా అనిపిస్తుందా?. కరోనా టైంలో చనిపోయాడని అధికారులు ప్రకటించిన ఓ వ్యక్తి.. రెండేళ్ల తర్వాత బతికొచ్చాడు. అది తెలిసి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ తిన్నారు. మధ్యప్రదేశ్ ధార్‌కు చెందిన కమలేష్ అనే వ్యక్తికి.. కరోనా రెండో వేవ్ టైంలో అంటే 2021 లాక్డౌన్ సమయంలో కరోనా సోకింది. అయితే వైరస్‌తో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు అధికారులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించలేదు వైద్య సిబ్బంది. దీంతో మున్సిపల్ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు(బుధవారం) కమలేష్ తిరిగి రావడంతో అంతా షాక్ తిన్నారు. తనని అహ్మదాబాద్‌లో ఓ గ్యాంగ్ ఇంతకాలం బంధించి ఉంచిందని, మత్తు మందు ఇస్తూ వచ్చిందని చెప్తున్నాడు కమలేష్. ఎలాగోలా తప్పించుకుని వచ్చానని చెప్పగా.. భార్యతో పాటు తల్లిదండ్రులు అతన్ని కమలేష్‌గా ధృవీకరించారు. ఈ వ్యవహారంపై ధార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
-
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
-
అత్యాచార పర్వం.. ఎమర్జెన్సీ విధింపు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. మహిళలపై చిన్నారులపై అఘాయిత్య ఘటనలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలకు, పిల్లలకు భద్రతగా కూడా పోలీసులు వెళ్తుండడం కనిపిస్తోంది అక్కడ. సమాజంలో ఇలాంటి(అఘాయిత్యాలు) ఘటనలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ ప్రకటించారు. పంజాబ్‌లో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారాయన. మేధావులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు.. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను రక్షించుకోవడం మీద దృష్టి సారించాలని పేర్కొంటోంది. కరోనా టైం నుంచి పాక్‌లో మహిళల మీద, పిల్లల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. -
AP: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్ డిక్లేర్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లర్ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజనరెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బీఆర్ఆర్ కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్, కృష్ణా భార్గవ్, సుతేజ్ తదితరులు వెంకటరామిరెడ్డి వెంటవెళ్లి సీఎం జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పిపించేలా రీ–ఆర్గనైజ్ చేసి 410 పోస్టులకు అప్‌గ్రేడ్ ప్రమోషన్ అవకాశాలు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. సర్వే డిపార్ట్మెంట్లో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారమైందన్నారు. అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలోనే డీజీపీ రాజేంద్రనా«థ్‌రెడ్డిని కలిసి మహిళా పోలీసుల సమస్యలను వివరించిందని చెప్పారు. -
భారత్ భారీ స్కోరు; ఇన్నింగ్స్ డిక్లేర్డ్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా 622/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్ మరో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు జోడించింది. రిషబ్ పంత్ సెంచరీ, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించారు. తొలి రోజు సెంచరీ చేసిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(193) ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి(42) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన 101 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 89 పరుగుల జత చేసిన పుజారా ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. చివర్లో పంత్, జడేజా జోడి చెలరేగడటంతో టీమిండియా స్కోరు 600 పరుగులు దాటింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న జడేజాను లయన్ అవుట్ చేయడంతో టీమిండియా కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. జడేజా 114 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 81 పరుగులు చేశాడు. 189 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌తో 159 పరుగులు చేసి పంత్ అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 4, హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. -
లియాండర్ పేస్‌కు చోటు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల చరిత్రలో ఎనిమిది పతకాలు సాధించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనున్నాడు. వేర్వేరు కారణాలతో పేస్ 2010, 2014 ఆసియా క్రీడల్లో ఆడలేదు. హైదరాబాద్‌కు చెందిన డేవిస్ కప్ మాజీ ప్లేయర్ ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ఎంపిక చేయనుంది. ఇందులో పేస్‌కు చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది. అయితే సింగిల్స్‌లో ఇటీవల నిలకడగా రాణిస్తున్న యూకీ బాంబ్రీ మాత్రం యూఎస్ ఓపెన్‌లో అవకాశం దక్కితే ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి అతని పేరు కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. మరో భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న కూడా తాను అందుబాటులో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేశాడు. యూకీ బాంబ్రీ లేకపోతే పురుషుల సింగిల్స్‌లో భారత ర్యాంక్‌ల ప్రకారం తమిళనాడు ఆటగాళ్లు రామ్‌కుమార్ రామ్‌నాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ జట్టులోకి వస్తారు. మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా, కర్మన్ కౌర్ థండీలకు అవకాశం ఉంది. 1994 నుంచి 2006 వరకు వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న లియాండర్ పేస్ 5 స్వర్ణాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. -
‘కల్లూరు’ ఖరారు!
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా దాదాపు ఖాయం అధికారికంగా ప్రకటించటమే తరువాయి.. పది మండలాలతో ప్రతిపాదనలు సత్తుపల్లి/కల్లూరు : కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.. అంటున్నారు. వైరా రెవెన్యూ డివిజన్ కేంద్రమనే ప్రకటనతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కల్లూరు లేదా సత్తుపల్లిని రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. నియోజకవర్గంలో ప్రాబల్యం ఉన్న రాజకీయనాయకులు ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలూ వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పంచాయితీ వెళ్లడంతో చివరకు కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రం చేస్తున్నట్టు సమాచారం. సత్తుపల్లి/కల్లూరు : కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టేనని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంలో నిర్ణయం జరిగిపోయిందని.. అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని తెలిసింది. వైరా రెవెన్యూ డివిజన్ ప్రకటన వెలువడగానే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సత్తుపల్లి లేదా కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తారని భావించారు. అకస్మాత్తుగా వైరా తెరపైకి రావటం రాజకీయవర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజల నుంచి బలంగా డిమాండ్ వినిపించింది. అధికార, ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిచాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కల్లూరు రెవెన్యూ డివిజన్ సాధించేందుకు అండగా నిలిచాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు అత్యవసర మండల సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. కల్లూరు మండలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ప్రతి ఒక్కర్నీ అఖిలపక్షం బృందం కలిసి సమస్యను వివరించింది. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఆన్లైన్లో అభ్యంతరాలు, వినతులను పంపించారు. పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు.. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి ఒప్పించినట్టు సమాచారం. కల్లూరు రెవెన్యూ డివిజన్ అన్ని మండలాలకు కేంద్రంగా ఉంటుందని.. ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ కూడా పూర్తయిందని వివరించినట్లు తెలిసింది. వైరా రెవెన్యూ డివిజన్ ఖమ్మానికి కేవలం 20 కిలోమీటర్ల దూరమే ఉందని.. వైరా రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలంటూ ఎన్నడూ కనీస ప్రతిపాదన కూడా లేదని వివరించినట్లు సమాచారం. పది మండలాలతో.. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం మండలాలతో కలిపి కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఇప్పటికే అధికార వర్గాలలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
మే 23న సీబీఎస్ఈ 12 క్లాస్ ఫలితాలు!
న్యూఢిల్లీః సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ ) 12 తరగతి ఫలితాలను మే 23న ప్రకటించనుంది. ఈ సంవత్సరం మార్చి 1న ప్రారంభమై ఏప్రిల్ 22 తో ముగిసిన క్లాస్ 12 పరీక్షలకు మొత్తం 10,67,900 మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు. కాగా... మేనెల, ఆఖరి వారంలో సీబీఎస్సీ క్లాస్ 12, 10 పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని ఇంతకు ముందే తెలిపిన సీబీఎస్సీ బోర్డ్... ఈ నెల 23న 12 వ తరగతి ఫలితాలు వెల్లడించనుంది. అనుకున్న ప్రకారం జరిగితే నెలాఖరులోపు పదోతరగతి ఫలితాలు కూడ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మే 23వ తేదీన వెల్లడయ్యే 12వ తరగతి ఫలితాలను అభ్యర్థులు అధికారిక సీబీఎస్ఈ డాట్ నిక్ డాట్ ఇన్ (cbse.nic.in) లో పరిశీలించవచ్చని బోర్డు సూచించింది. అలాగే తమ రోల్ నెంబర్లను ఇతర వెబ్సైట్లలో కూడ చూసుకోవచ్చని తెలిపిన బోర్డు... వెబ్సైట్ లో అడిగిన అన్ని వివరాలను అభ్యర్థులు నమోదు చేసిన తర్వాతే ఫలితాలు కనిపిస్తాయని స్పష్టం చేసింది. స్క్రీన్ పై వచ్చిన ఫలితాల జాబితాను భవిష్యత్ ఉపయోగాలకోసం డౌన్ లోడ్ లేదా ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం మంచిదని అభ్యర్థులకు బోర్డు సలహా ఇచ్చింది. గతేడాది సీబీఎస్ ఈ 12వ తరగతి పరీక్షలకు మొత్తం 10,40,368 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 43,29,85 మంది బాలికలు, 607,38,3 మంది బాలురు ఉన్నారు. ఈసారి మొంత్తం 14,99,122 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవ్వగా, వారిలో 44,66,41 మంది బాలికలు, 607,38,3 మంది బాలురు ఉన్నారు.