breaking news
december 15
-
పాత రూ.500నోట్లకు ఆఖరి అవకాశం
-
పాత రూ.500నోట్లకు ఆఖరి అవకాశం
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ పాత రూ.500నోట్ల చెల్లుబాటయ్యే ప్రదేశాలు, గడువును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాత రూ.1000 నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోగా.. రూ.500 నోట్ల చెల్లుబాటు గడువు కూడా సమీపిస్తోంది. ఈ నెల 15 తర్వాత మెడికల్ షాపుల్లో, ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో పాత రూ.500 నోటును స్వీకరించరు. ఆ తర్వాత ఈ నెల 31వరకూ బ్యాంకుల్లో డిపాజిట్ కోసం స్వీకరిస్తారు. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే పాత రూ.500నోట్లను తీసుకుంటారు. -
ఆదరణ తగ్గని పుస్తక పఠనం
ఏటేటా లక్షలాది గ్రంథాల అమ్మకాలు 15 నుంచి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన అందమైన అక్షరాల ఒడి.. జ్ఞానప్రియుల అద్భుత లోకం.. వందలు, వేల సంవత్సరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న భాండాగారం.. గతాన్ని వర్తమానానికి, వర్తమానాన్ని భవిష్యత్తుకు అనుసంధానిస్తూ మానవసమాజాన్ని నవోత్సాహంతో ముందుకు నడిపించే అద్భుత చోదక శక్తి ‘పుస్తకం’. కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మికం, చరిత్ర, తత్వశాస్త్రం, మనస్తత్వం, సామాజికం, ఆర్థికం, రాజకీయం, జాతీయం,అంతర్జాతీయం.. అన్ని అంశాలకు ప్రతిబింబం. కాగితాల దొంతరలో కూర్చిన అక్షరాల వెంట పరుగులు పెట్టే నేత్రాలు.. భావాన్ని మనసు పొరల్లో నిక్షిప్తంచేసే మరో ప్రపంచం ‘పుస్తకం’. వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ రాజ్యమేలుతోన్న కాలంలోనూ పుస్తకం వన్నె తరగలేదు. వైభవాన్ని కోల్పోలేదు. పాఠకుడి ఆదరణ, జిజ్ఞాస మేరకు అన్ని రంగాల్లోకి రెక్కలల్లార్చుకొని విస్తరిస్తూనే ఉంది. విభిన్న భాషా సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ నగరంలో వందల ఏళ్లుగా పుస్తకం వర్ధిల్లుతూనే ఉంది. అలా పాఠకుల ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలకు పైగా మహానగరంలో ఏటేటా వేడుక చేసుకుంటోన్న పుస్తకం మరోసారి ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు ఇందిరాపార్కు ఎన్టీఆర్ స్టేడియం ‘హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,సిటీబ్యూరో సామాజిక మార్పులకు అనుగుణంగా పుస్తకం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. మానవ సంబంధాల్లో, మార్కెట్ సంబంధాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పుస్తకం స్పందిస్తోంది. కాల్పనిక సాహిత్యం, చారిత్రక గ్రంథాలు అప్పటి తరాన్ని ప్రభావితం చేస్తే.. ఇప్పుడు మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రంగాలకు చెందిన పుస్తకం లక్షల మెదళ్లకు పదును పెడుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కెరీర్‌కు పుస్తకం కేరాఫ్‌గా మారింది. అయినప్పటికీ సాహితీ పాఠకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. కన్యాశుల్కంలో గిరీశం గిలిగింతలు చూస్తున్నారు. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో ఏముందో తెలుసుకుంటున్నారు. ‘అసమర్ధుని జీవయాత్ర’లోని సాహిత్య సమర్థతను అంచానా వేస్తున్నారు. ప్రతి ఇంటినీ బుల్లితెర ధారావాహికలు ముంచేస్తున్నా.. అక్షరం విలువ తెలిసిన పాఠకుడు నవలను ఆదరిస్తున్నాడు. అందుకే తెలుగు, ఇంగ్లిష్ పుస్తక ప్రచురణ సంస్థలు పదుల సంఖ్యలో మనగలుగుతున్నాయి. విశాలాంధ్ర, నవోదయ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఎమెస్కో వంటి ప్రచురణ సంస్థలు దశాబ్ధాలుగా వివిధ రంగాల పుస్తకాలను ప్రచురిస్తుండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లాక్స్వాన్, కేంబ్రిడ్జి, పియర్సన్, టాటా మెగ్రాహిల్ వంటి పబ్లికేషన్స్ మాధ్యమిక, ఉన్నత విద్యారంగానికి చెందిన ప్రామాణిక పుస్తకాలను ముద్రిస్తూ పాఠకలోకానికి చేరవయ్యాయి. ఓరియంట్ లాంజ్ఞన్, ఇండియా బుక్‌హౌస్ వంటి సంస్థలు అనేక విలువైన పుస్తకాలను అందజేస్తూనే ఉన్నాయి. రూప పబ్లిషర్స్ నుంచి వచ్చే చేతన్ బగత్, రస్కిన్‌బాండ్ వంటి రచయితల పుస్తకాల కోసం జిజ్ఞాసాపరులు ఎదురు చూస్తుంటారు. చేతన్ భగత్ ‘టు స్టేట్స్’, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మైలైఫ్’, ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’, ‘వాట్ యంగ్ ఇండియా’, ‘రెవల్యూషన్ 2020’ వంటి గ్రంథాలు ఇప్పటికీ హాట్‌కేకులే. రస్కిన్‌బాండ్ ‘చిల్డ్రన్స్ ఓమ్ని బస్’, గ్రేట్ స్టోరీ ఫర్ చిల్డ్రెన్’, ‘స్కూల్ డేస్ స్కూల్ టైమ్స్’ వంటి పిల్లల పుస్తకాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ ఇప్పటికీ పాఠకుడి మనసు దోచుకుంటూనే ఉంది. పిల్లల కామిక్స్ సైతం విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్, మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీటివ్ పుస్తకాలే కాదు.. తెలుగు సాహితీ గ్రంథాలకు కూడా అద్భుత ఆదరణ ఉంది. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ 1954 నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ముద్రించారు. ఈ పుస్తకం నగరంలో ప్రతిరోజు కనీసం 200 కాపీలు అమ్ముడవుతూనే ఉంది. తస్లీమా నస్రీన్ ‘లజ్జ’ నవల, తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యల సాహిత్యం, ముళ్లపూడి రచనలు, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ,పెద్దిభొట్ల, మధురాంతకం రాజారాం వంటి ప్రముఖ రచయితల కథల పుస్తకాలు, మనస్తత్వ గ్రంథాలు, తెలుగు సినిమా సాహిత్యం, బాపు కార్టూన్లు, వట్టికోట ఆళ్వారుస్వామి ‘మట్టి మనిషి’, ‘గంగు’నవలల కోసం పాఠకులు వెతికి మరీ చదువుతున్నారు. అంతేనా.. మేనేజ్మెంట్ గురించి తెలుసుకునేవారు కూడా రామాయణం. మహాభారతాన్ని చదువుతున్నారు. ఆనాటి పరిస్థితులనునేటి స్థితిగతులకు అన్వయిస్తూ.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేస్తున్నారు. అందుకే జీవిత సత్యాలను చెప్పే ఈ మహాగ్రంథాలు ప్రతి కార్పొరేట్ కార్యాలయంలో కొలువుదీరుతున్నాయి. 15 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 15న 30వ ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ కన్వీనర్ డాక్టర్ ఎస్.రఘు, కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు. 16 నుంచి 10 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్స్ చాన్సలర్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ హాజరవుతారన్నారు. తెలుగు సాహిత్యంలోని ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయితల పాత్ర, కథ, నవల, వచన కవిత–పరిణామ వికాసాలు, ఉద్యమాలు–పాట ప్రభావం, తెలంగాణ సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బాలసాహిత్యం తదితర అంశాలపై సాహితీవేత్తలతో ప్రసంగాలు ఉంటాయని వివరించారు. మహాశ్వేతాదేవి సాహిత్య ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా‡వెంకటేశం, గూడ అంజన్న ప్రాంగణాన్ని డాక్టర్ కె.వి.రమణాచారి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్.గోపి. నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, ఎం.వేదకుమార్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి, యాకూబ్, సుద్దాల అశోక్‌తేజ, భూపాల్, ఏలె లక్ష్మణ్ వంటి సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు. – సుందరయ్య విజ్ఞానకేంద్రం 280 స్టాళ్లతో ప్రదర్శన.. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు ‘హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’ మరోసారి వేదిక కానుంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న ఈ వేడుకలో 280 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. శని,ఆది వారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో హైదరాబాద్ పుస్తక ప్రదర్శణ కమిటీ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. -
డిసెంబర్ 15 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 15 నుంచి 18 వరకు సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో రోడ్లను సుందరంగా మార్చాలని జీహెచ్ఎంసీ అధికా రులను ఆదేశించారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే దాదాపు 3 వేల మంది ప్రతినిధుల పర్యటనల కోసం పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. హైటెక్స్‌లో సదస్సు.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 1934లో ఏర్పడ్డ తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో నాలుగు రోజుల చొప్పున సదస్సులు నిర్వహించటం ఆనవారుుతీ. 1998లో నగరంలోని పబ్లిక్ గార్డెన్సలో నిర్వహించిన తర్వాత మళ్లీ ఇప్పుడు అవకాశం లభించింది. రోడ్ల నాణ్యతను పెంచటంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చిస్తారు. ఇటీవల తెలంగాణకు కొత్తగా 2,500 కి.మీ. కొత్త జాతీయరహదారులు మంజూరైన నేపథ్యంలో వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పరిజ్ఞానం, దేశంలోనే గొప్ప రోడ్లుగా వాటిని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలై ఇందులో సూచనలు అందే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
వామ్మో డిసెంబర్ 15!
తరుముకొస్తున్న హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్పు గడువు 75 లక్షల వాహనాలకు ఈ సమయం సరిపోదంటున్న రవాణాశాఖ లేకుంటే సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించిన ట్టే గడువు పెంచాలని కోరే యోచనలో సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రవాణాశాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిసెంబరు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)ను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ప్లేట్ల ఏర్పాటు జరుగుతున్నప్పటికీ మీరెందుకు అమలుచేయట్లేదని గతంలో సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని ప్రశ్నించింది. దీంతో డిసెంబరు 15 నాటికి అన్ని వాహనాలకు అమర్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు లక్ష్యం కొండలా పేరుకుపోవటంతో ఇంత తక్కువ గడువులో అది సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో గడువు పెంచేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సరఫరా అస్తవ్యస్తం ఏడాది క్రితం హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమల్లోకి తెచ్చినప్పుడు ప్రతి వాహనదారుడు వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. ప్లేట్లను సరఫరా చేసే సంస్థ సరిపడా సరఫరా చేయలేకపోవటమే దీనికి కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్ సిరీస్‌తో రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాలకు మాత్రమే అమరుస్తూ వస్తున్నారు. ఇప్పటికి వాటి సంఖ్య 5.50 లక్షలకు చేరుకుంది. ఏపీ సీరీస్‌తో ఉన్న 75 లక్షల వాహనాలకు వాటిని అమర్చే పనికి శ్రీకారం చుట్టలేదు. ప్లేట్లను సరఫరా చేసే కంపెనీతో ప్రభుత్వం అప్పట్లో ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సరిపడా ప్లేట్లు సరఫరా కాకుంటే రవాణాశాఖ నేరుగా ఆ కంపెనీని ప్రశ్నించలేకపోతోంది. ఆర్టీసీ-రవాణాశాఖ సంయుక్త సమావేశాలు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. గడువు తరుముతుండటంతో ఇప్పుడు సంయుక్త సమావేశానికి రెండు విభాగాలు సిద్ధమయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా డిసెంబరు 15 నాటికి 75 లక్షల వాహనాలకు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేయటం సాధ్యం కాదని రవాణాశాఖ తేల్చేసింది. దీనిపై కంపెనీతో ఆర్టీసీ చర్చించగా, సరిపడా ప్లేట్లు సరఫరా చేయాలంటే 16 డిమాండ్లను నెరవేర్చాలని షరతు విధించింది. విధివిధానాల్లో జాప్యం ఏపీ సిరీస్‌తో ఉన్న పాత వాహనాలను టీఎస్ సిరీస్‌లోకి మార్చే విషయమై 12 రోజుల క్రితమే ఉత్తర్వు జారీ అయినా ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు కాలేదు. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ప్రస్తావన లేకుండా తొలుత మార్గదర్శకాలు రూపొందించారు. తర్వాత దాన్ని మార్చి హెచ్‌ఎస్‌ఆర్‌పీని చేర్చారు. దానిపై న్యాయశాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిదిద్దేందుకు ఇన్ని రోజుల సమయం తీసుకున్నారు. మరో రెండు మూడు రోజుల్లో తుది మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే ప్లేట్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
డిసెంబర్ 15 లోగా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు.