breaking news
Debt trap
-
చేతిలో ఐఫోన్.. కారు.. అన్నీ అప్పుతో కొంటున్నవే..!
భారతీయ కుటుంబాలు మునుపెన్నడూ లేని విధంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పండుగ వేళ విపరీతమైన షాపింగ్, అప్పులు సులభంగా లభ్యమవుతున్న నేపథ్యంలో పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ నేహా నగర్ అప్పులపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో 70 శాతం ఐఫోన్లు (iPhones) రుణాల ద్వారా, 80 శాతం కార్లు ఈఎంఐల ద్వారా కొంటున్ననవేనని పేర్కొన్నారు.వినియోగదారు రుణంలో ఈ పెరుగుదల భారతదేశ ఆర్థిక ప్రవర్తనలో లోతైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఆదాయాల కంటే ఆకాంక్షలు వేగంగా పెరుగుతుండటంతో చాలా మంది ఆస్తులను నిర్మించడానికి బదులుగా జీవనశైలికి నిధులు సమకూర్చుకోవడానికి రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి అప్పులు చేటు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు."ధనవంతులు ఆస్తులను నిర్మించుకోడానికి పరపతిగా రుణాలను ఉపయోగిస్తుంటే పేద, మధ్యతరగతివారు మాత్రం విలాసాలను కొనుక్కోవడానికి వాటిని ఉపయోగిస్తారు" అని ఫైనాన్స్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకంలో ప్రముఖంగా చెప్పారు. ఆ వ్యత్యాసమే చాలా మంది మధ్య ఆదాయ వర్గాలు రాబడిని ఇచ్చే పెట్టుబడులకు బదులుగా గాడ్జెట్లు, వాహనాల వంటి క్షీణించే ఆస్తుల కోసం ఈఎంఐ (EMI) చక్రాలలో ఎలా చిక్కుకుపోతున్నారో వివరిస్తుంది. -
అప్పుల ‘ఉచ్చు’
కూతురు పుట్టిన రోజు నాడే యువరైతు ఆత్మహత్య కారేపల్లి: అప్పుల బాధ ఆ రైతు ప్రాణాలు తీసింది. మాణిక్యారం పంచాయతీ కోయగుంపులో ఈసాల ప్రసాద్ (33) అనే యువరైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పుట్టిన నాడే తండ్రి తనువు చాలించడం కలిచివేసింది. ప్రసాద్ తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పత్తి, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. మూడేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రాక పోవడంతో రూ.4 లక్షలు అప్పయింది. ఈ ఏడాది సైతం రూ.లక్ష వరకు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాడు. అయినా పత్తి కలుపు, మిర్చి తోట వేసిన కూలీలకు కూలి డబ్బులు ఇవ్వటానికి చేతిలో చిల్లి గవ్వ లేక పోవడం, గతంలో అప్పులు తెచ్చిన షేట్ల వద్ద మరో మారు అప్పు తెచ్చేందుకు ముఖం చెల్లకపోవడంతో గత నెల రోజులుగా ప్రసాద్ తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఇంట్లో నుంచి ప్రసాద్ చేనుకు వెళ్తుండగా భార్య కోటమ్మ పిలిచింది. ‘కూలోళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఇంటికొచ్చి పోతుండ్రు. ఇవ్వాళ అక్షయ (కూతురు) 4వ పుట్టిన రోజు.. ఇంట్లో చిల్లిగవ్వలేదు..’ అని చెప్పింది. చేనుకుపోయి కూలోళ్లకు డబ్బులిస్తాను. సాయంత్రం కూతురుకు కేక్ కొనుక్కొని వస్తాను అని ఇంటి నుంచి బయలుదేరిన ప్రసాద్ చెనుకు వెళ్లాడు. తీవ్ర మానసిక క్షోభతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కిందకు దించే లోగానే ప్రసాద్ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న తహశీల్దార్ ఎం. మంగీలాల్, ఎస్సై ఎం.రవికుమార్ మృతదేహాన్ని సందర్శించారు. కూతురు పుట్టిన రోజు నాడే.. ప్రసాద్‌కు నాలుగేళ్ల కూతురు అక్షయ, మూడేళ్ల కుమారుడు యక్షంత్ ఉన్నారు. బుధవారం అక్షయ పుట్టిన రోజు.. కేక్ తెస్తానని ఇంటి నుంచి వెళ్లిన తండ్రి శవమై ఇంటికి రావడంతో కోయగుంపులో విషాదం నెలకొంది. డిగ్రీ వరకు చదువుకున్న ప్రసాద్ కబడ్డీలో ఉత్తమ క్రీడాకారుడు కూడా. జిల్లా, రాష్ట్రమీట్లో ఆడిన ఘనత ఆయనకుంది.