breaking news
debt management
-
స్వతంత్ర సంస్థకు రుణ నిర్వహణా బాధ్యతలు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రభుత్వ రుణ నిర్వహణ బాధ్యతలను క్రమంగా తొలగించి, ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియను ఆర్థికశాఖ ప్రారంభించింది. ప్రత్యేకంగా ప్రభుత్వ రుణ నిర్వహణా సంస్థ(పీడీఎంఏ) ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా ఆర్థికమంత్రిత్వశాఖలో రుణ బడ్జెట్ నిర్వహణ విభాగం (పీడీఎంసీ) ఏర్పాటయినట్లు ఒక సర్క్యులర్లో తెలిపింది. రెండేళ్లలో ఇది పూర్తి చట్టబద్ద సంస్థ (పీడీఎంఏ)గా రూపాం తరం చెందుతుంది. -
ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం డిసెంబర్ నాటికి రూ.55.26 లక్షల కోట్లకు చేరింది. త్రైమాసికంగా చూస్తే 3 శాతం పెరిగింది. రుణ నిర్వహణకు సంబంధించి ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ వివరాలను తెలియజేసింది. మొత్తం రుణంలో అంతర్గత రుణ భారం వాటా త్రైమాసికంగా చూస్తే... 92 శాతం నుంచి 92.2 శాతానికి ఎగసింది. రూపీ డినామినేడెడ్లో మార్కెట్లో ట్రేడయ్యే బాండ్లు, ట్రెజరీ బిల్స్ వాటా 85.3 శాతం నుంచి 85.7%కి ఎగసింది. అంతర్గత రుణం రూ.50,97,016 కోట్లని పేర్కొన్న ప్రభుత్వం, 2015 ముగిసిన జీడీపీ పరిమాణంతో 37.2 శాతంగా తెలిపింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో 37.1%. కాగా మార్చి త్రైమాసికంలో ద్రవ్య లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది.