breaking news
dead bodys collected
-
స్వదేశానికి ‘ఇరాక్ మృతదేహాలు’
అమృత్సర్/కోల్‌కతా: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన 39 మంది భారతీయుల్లో 38 మృతదేహాలను ప్రత్యేక విమానంలో కేంద్రం సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. మరొక మృతదేహం ఎవరిదనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవటంతో దాన్ని ఇరాక్‌లోనే ఉంచారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆదివారం ఇరాక్ వెళ్లడం తెలిసిందే. 38 మృతదేహాల్లో 27 పంజాబ్‌కు, నాలుగు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవి కావడంతో ఆ 31 మృతదేహాలను అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో బంధువులకు అప్పగించారు. మిగిలిన ఏడింటిని కోల్‌కతా, పట్నా విమానాశ్రయాల్లో ఆప్తులకు అధీన పరిచారు. వీరంతా దాదాపు సంవత్సరం క్రితమే చనిపోయారనీ, భూమిలో పాతిపెట్టిన శవాలను ఇటీవల వెలికి తీసి తెచ్చినందున ఇప్పుడు ఈ శవపేటికలను తెరవడం మంచిది కాదని వీకే సింగ్ సూచించారు. శవాలను పాతిపెట్టిన స్థలంలో విషపదార్థాలు ఉండేవనీ, అలాగే మృతదేహాలను ఎంబామింగ్ చేసి శవపేటికల్లో పెట్టడంతో వాటిని తెరవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. -
భర్తల వేధింపులు తాళలేకే..
పిల్లలతో అక్కా చెల్లెళ్ల అఘాయిత్యం మిగిలిన ముగ్గురి మృతదేహాలు లభ్యం నిందితుల కోసం పోలీసుల గాలింపు ఏడు అడుగులు నడిచి.. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన ఆ ఇద్దరు ధన మందాధుల కాఠిన్యాన్ని తట్టుకోలేక.. పిల్లలతో కలిసి ఆత్మాహత్యలకు పాల్పడిన అక్కాచెల్లెళ్ల ఉదంతం, అనంతరం పరిణామాలు కొత్తపేటలో సోమవారం అందరి హృదయాలను కలిచివేశాయి. ఈ సంఘటనలో ఆదివారం ఒక మృతదేహం లభ్యం కాగా, ఒక కుమార్తె ప్రాణాలతో బయటపడిన విషయం విదితమే. మిగిలిన ముగ్గురి మృతదేహాల సోమవారం లభ్యమయ్యాయి. ప్రాణాలతో బయటపడిన ఒక కుమార్తె ప్రమీల.. తల్లిదండ్రులను కలిసినప్పుడు వారి వేదన కట్టలు తెచ్చుకుంది. ఇంతటి ఘాతుకానికి కారకులైన ఇద్దరు భర్తలు, మామపై పోలీసులు కేసులు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. కొత్తపేట : ఒకే కడుపున పుట్టిన అక్కాచెల్లెళ్లు, ముగ్గురు పిల్ల్లలతో ఆదివారం కాలువలో దూకిన ఘటనలో.. మానేపల్లి పుష్పలత (35), కుమార్తె మాన్విత (7), ప్రమీల కుమార్తె నల్లమిల్లి శ్రీగోదా అలివేలు మంగతాయారు (5) మృతదేహాలు సోమవారం ఉదయం కండ్రిగ సమీపంలో లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలను పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆదివారం రాత్రి నల్లమిల్లి నాగవెంకట పద్మ ప్రమీలను స్థానికులు రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడిన విషయం విదితమే. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి మృతుల తండ్రి, తాత బుచ్చిరాజు పోలీసులకు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనుమానాలతో వేధింపులు బుచ్చిరాజు పెద్ద కుమార్తె పుష్పలతకు విజయవాడకు చెందిన ఫైనాన్షియర్ మానేపల్లి రణధీర్‌తో 2006లో వివాహమైంది. వారికి సంజన్, మాన్విత ఇద్దరు పిల్ల్లలు. వారి సంసారం కొంతకాలం సజావుగానే సాగింది. అనంతరం అనుమానం, అదనపు కట్నం కోసం భార్యను, పిల్లలను వేధించేవాడు. ఈ విషయాన్ని పుష్పలత తన తల్లిదండ్రులకు ఫో¯ŒS చేసి చెప్పేది. వారు నచ్చజెబుతూ వచ్చారు. రెండో కుమార్తె నాగసత్యపద్మ ప్రమీలను రాజమహేంద్రవరానికి చెందిన పోలవరం ప్రాజెక్టులోని ఒక కాంట్రాక్టర్ వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నల్లమిల్లి వెంకటరత్నంతో 2010లో వివాహం జరిగింది. వారి కుమార్తె శ్రీ గోదా అలివేలు మంగతాయారు. ఈమె భర్త, మామ వీరబ్రహ్మానందం అదనపు కట్నం తీసుకురమ్మని, ఎవరితోనూ మాట్లాడకూడదని, సుమారు మూడున్నరేళ్ల పాటు ఇంట్లో నిర్బంధిస్తూ వేధించారు. దీంతో ఏడాది క్రితం కుమార్తెతో పుట్టింటికి వచ్చేసింది. భర్త కొన్ని రోజుల క్రితం విడాకుల నోటీసు పంపించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విజయవాడ వెళ్లిన తల్లిదండ్రులు.. భర్త వేధింపులపై పెద్ద కుమార్తె పుష్పలత శనివారం ఫో¯ŒSలో చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విజయవాడ వెళ్లారు. అక్కడ పుష్పలత, పిల్లలు లేకపోవడంతో బుచ్చిరాజు తన అల్లుడు రణధీర్‌ను నిలదీశారు. వారి కోసం వెతుకుతుండగా, రెండో కుమార్తె ప్రమీల ఫో¯ŒS చేసి అక్క కొత్తపేట వచ్చినట్టు తెలిపింది. వారు తిరుగు ప్రయాణంలో ఉండగా రాత్రి 7 గంటల సమయంలో బంధువులు ఫో¯ŒS చేసి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు మనుమలతో కాలువలో దూకినట్టు తెలిపారు. తల్లిదండ్రులు, బంధువుల రోదన వర్ణనాతీతం విజయవాడ నుంచి ఆదివారం రాత్రి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు, ప్రాణాలతో బయటపడిన ప్రమీల రోదన అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. ఆస్పత్రిలో మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు వర్ణనాతీతం. మీ సంసారాలు చక్కదిద్దేందుకు మరో ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండా మీరే నిర్ణయం తీసుకుని దూరమయ్యారా.. మా జీవితంలో ఆనందం లేకుండా చేశారంటూ ఆ దంపతులు రోదించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఇద్దరి భర్తలు, మామపై కేసుల నమోదు అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, రావులపాలెం సీఐ బి.పెది్దరాజు మృతుల వివరాలను బంధువుల నుంచి సేకరించారు. తండ్రి బుచ్చిరాజు ఫిర్యాదు మేరకు మృతురాలు పుష్పలత భర్త మానేపల్లి రణధీర్పై అదనపు ఎస్సై కేఎం జోషి, నల్లమిల్లి నాగసత్యపద్మ ప్రమీల ఫిర్యాదు మేరకు ఆమె భర్త వెంకటరత్నం, మామ వీరబ్రహ్మానందంపై ఎస్సై డి.విజయకుమార్ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ స్థానికేతర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫో¯ŒSలో బుచ్చిరాజును పరామర్శించి సానుభూతి తెలిపా రు. ఆయన తరఫున వైఎస్సార్సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు తదితరులు మృతుల తల్లిదండ్రులు, బంధువులను స్థానిక ఆస్పత్రి వద్ద ఓదార్చారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు కూడా వారిని పరామర్శించారు. పోలీసుల అదుపులో పెద్దల్లుడు.. పరారీలో చిన్నల్లుడు బుచ్చిరాజు పెద్దల్లుడు విజయవాడకు చెందిన మానేపల్లి రణధీర్గుప్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెండో అల్లుడు, రాజమహేంద్రవరానికి చెందిన నల్లమిల్లి వెంకటరత్నం, అతని తండ్రి వీరబ్రహ్మానందం పరారీలో వున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు.