breaking news
DE satyanarayana
-
బంధాలకు దూరం.. ఓదార్పు కరువు
మానసిక ఒత్తిడితోనే సత్యనారాయణకు అనారోగ్యం కుటుంబీకుల నడుమ అనుబంధంతోనే మిగతా వారి ఆత్మహత్య జనగామ : ఉద్యోగం నుంచి సస్పెన్షన్ గురై.. ఇటు తల్లిదండ్రులు, బంధువుల అనుబంధానికి దూరమైన నేపథ్యంలో ఓదార్చే వారు లేకే హౌసింగ్ డీఈ సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన గృహ నిర్మాణ శాఖ డీఈ పారుపల్లి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే, సత్యనారాయణతో ఆయన భార్య, పిల్లలకు అనుబంధం కారణంగా ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా, మరేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో బంధువులకు ఫోన్ చేశారా.. చేయలేదంటే కారణమేమిటనే కోణంలో విచారణ జరగాల్సి ఉంది. సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించగా.. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లే క్రమంలో అక్కడే ఉంటున్న సోదరులిద్దరికి ఎందుకు ఫోన్ చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. హన్మకొండ నుంచి బదిలీపై కరీంనగర్‌కు వెళ్లిన సత్యనారాయణ పదేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో.. కుటుంబ పోషణ, పిల్లల చదవుల కోసం చేసిన అప్పులు భారంగా మారడం.. ఇటు తల్లిదండ్రులు, సోదరులు, బంధువులతో కలిసేందుకు ఇష్టపడని భార్య.. తదితర కారణాలతో మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్యనారాయణ డీఈగా పనిచేసిన హన్మకొండ, నల్లగొండ, కరీంనగర్లల్లో సస్పెన్షన్ గురికాగా.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కుటుంబానికి 400 కిలోమీటర్ల దూరం సస్పెన్షన్ గురైన సత్యనారాయణకు దశాబ్ద కాలం తర్వాత పది రోజుల క్రితమే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ హౌజింగ్ డీఈగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడకు వెళ్లిన ఆయన ఒంటరితనంతో మనోవేదనకు గురయ్యారని తెలుస్తోంది. కుటుంబానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యనారాయణకు ఓదార్పు కరువైపోయిది. దీంతో డిఫ్రెషన్‌కు లోనైన ఆయనను కంట్రోల్ చేసే వారు లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని సమాచారం. కాగా, జూలై 26న సత్యనారాయణ కారు కొనుగోలు చేశారు. కుమార్తెలు, కుమారుడి కోరిక మేరకు కారు కొన్న ఆయన.. నాలుగు రోజులకే ఆ కుటుంబం మెుత్తం కానరాని లోకాలకు వెళ్లిపోవడం గమనార్హం. కాగా, సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందితే.. ఆయన మృతిని తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారా, లేక అమ్మ మాటకు కట్టుబడి రైలుకు ఎదురువెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కారులో ఎక్కించుకుని ఉదయమే ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా సాయంత్రం వరకు నేషనల్ హైవేపై తిరుగుతూ నల్లగొండ జిల్లా భువనగిరి ఆస్పత్రికి సాయంత్రం ఎందుకు తీసుకువెళ్లారనే సమాధానం లోకంలో లేని ఆ కుటుంబంతో పాటే సమాధి అయిపోయింది. కాగా, సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాల నుంచి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీసులు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అందులోని కాల్‌డేటా వెలుగు చూస్తే తప్ప సత్యనారాయణను హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఫోన్లలో మాట్లాడారా అనేది తెలుస్తుంది. తద్వారా ఆయన కుటుంబం ఆత్మహత్మకు కారణాలు తెలియెుచ్చని భావిస్తున్నారు. -
కుటుంబమంతా మృత్యు ఒడిలోకి..
అనారోగ్యంతో డీఈ సత్యనారాయణ మృతి తట్టుకోలేక భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడి ఆత్మహత్య స్వగ్రామం లద్నూరులో ముగిసిన అంత్యక్రియలు తలకొరివి పెట్టిన సత్యనారాయణ తండ్రి ప్రకాశం హన్మకొండ / జనగామ / మద్దూరు : కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టించే విషాదమిది.. కలలో కూడా ఊ హించకుని ఘటనతో ఆ కుటుంబంలోని వృద్ధు లు కుప్పకూలిపోయారు.. ఇదీ మద్దూరు మండలం లద్నూరుకు చెందిన డీఈ సత్యనారాయణ కుటుంబంలో శనివారం చోటు చేసుకున్న పరి స్థితి. లద్నూరుకు చెందిన రిటైర్డ్ ఉపాద్యాయు డు పారుపల్లి ప్రకాశం, మణెమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ(55) గృహ నిర్మా ణ శాఖ డీఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయ న అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెంది నట్లు చెబుతుండగా.. ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి(33), నీలిమ(27), కుమారుడు శివరామకృష్ణ(22) రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తం గా సంచలనం కలిగించింది. గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా చేర్యాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన సత్యనారాయణ ఏఈగా పదోన్నతిపై జనగామలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో వివాహం కాగానే ఉద్యోగరీత్యా జనగామకు మ కాం మార్చి అక్కడే ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత హన్మకొండ ఏఈగా పనిచేస్తూ కరీంనగర్ బదిలీ కాగా, అక్కడ సస్పెన్షన్‌కు గురయ్యా రు. తిరిగి పదేళ్ల అనంతరం డీఈగా ప్రమోషన్‌పై ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌కు బదిలీ అ య్యారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను ఎత్తి వేయడంతో ఆరు రోజుల క్రితం ఇరిగేషన్ శాఖ డీఈగా హైదరాబాద్‌కు సత్యనారాయణను బదిలీ చేశారు. కాగా, వివాహం తర్వాత నుంచి నేటి వరకు ఆయన తన తల్లిదండ్రులు ప్రకాషం, మణెమ్మతో సంబంధాలు అంతంతగానే కొనసాగిస్తున్నాడు. లద్నూరుకు వచ్చిన సందర్భాలే తక్కువేనని చెబుతున్నారు. కాగా సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఒకరు రవి హైదరాబాద్‌లో ట్రావెల్స్ నడుపుతుండగా, మరో సోదరు డు శ్రీనివాస్ జీహెచ్ఎంసీలో ఏఈగా పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం(మార్చి 25న) జరిగి న సత్యనారాయణ తమ్ముడు రవి కుమార్తె పా వని వివాహం లద్నూరులో జరగగా సత్యనారాయణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక ఊరికి వారు రావడం అదే చివరిసారి. అయితే, పావని కంటే పెద్దదైన సత్యనారాయణ కుమార్తె స్వాతి వివాహం జరిపించాలని ఆయన తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా సత్యనారాయణ భార్య మీరా అంగీకరించేది కాదని చెబుతున్నారు. రోజంతా కారులోనే.. ఆదిలాబాద్ నుంచి శుక్రవారం ఉదయం సత్యనారాయణ, ఆయన భార్య మీరా, కూతుళ్లు స్వా తి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. సత్యనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తే అసలు కారు నడిపే పరిస్థితి లేకపోవడంతో.. శివరామకృష్ణ నడిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక హన్మకొం డలోని అద్దె∙గృహంలో మీరా తల్లితో సత్యనారాయణ బీటెక్ పూర్తి చేసిన స్వాతి ఉంటుండ గా, రెండో కుమార్తె ఎంటెక్ చేసిన నీలిమ హైదరాబాద్‌లో, కుమారుడు శివరామకృష్ణ బీటెక్ చ దువుతూ హైదరాబాద్ అద్దె గదిలో ఉంటున్నా డు. ఇక సత్యనారాయణ భార్య మీరా ఆసిఫాబాద్‌లోనే భర్తతో పాటు ఉంటోందని సమాచారం. అమ్మమ్మ వద్ద ఉండే స్వాతి తన తండ్రికి ఆరోగ్యం బాగా లేనందున ఆస్పత్రిలో చూపిం చేందుకు వెళ్తున్నామంటూ శుక్రవారం ఉదయం హన్మకొండ నుంచి వెళ్లింది. తల్లిదండ్రులు, సోదరి, సోదరుడితో ఆమె ఎప్పుడు కలుసుకుందో, ఏమో కానీ కుటుంబం మెుత్తం కారులోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేషనల్ హైవేపై తిరగారు. అనంతరం అనారోగ్యానికి గురైన భర్త సత్యనారాయణను భువనగిరి ప్రభు త్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త చనిపోవడంతో మనస్తాపంతో భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ తిరిగి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని కారులోనే ఉంచి.. అంకుశాపూర్ వద్ద రాత్రి 11.30 గంటలకు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తొలుత సత్యనారాయణ మృతదేహాన్ని, ఆ తర్వాత కుటుంబీకుల మృతదేహాన్ని గుర్తించి ఆ ధార్ కార్డు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఎండకాలంలో ఫోన్ చేశాడు.. తన కొడుకు సత్యనారాయణ చివరి సారిగా ఎం డాకాలంలో ఫోన్ చేసి ఊరికి వస్తానని చెప్పాడ ని ఆయన తండ్రి సత్యనారాయణ కన్నీళ్లతో తె లిపారు. అదే చివరిసారి... మళ్లీ ఆయన గొం తు వినలేదని పేర్కొన్నారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న కొడుకు.. శాశ్వతంగా కనిపించకుండా సెలవు తీసుకున్నాడంటూ రోదించారు. ముగిసిన అంత్యక్రియలు లద్నూరులో శనివారం రాత్రి జరిగిన సత్యనారాయణ కుటుంబం అంత్యక్రియలకు ఆదిలాబాద్ జేసీ సుందర్ అబ్నార్ హాజరయ్యారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం లద్నూరుకు తీసుకొచ్చారు. అయితే, సత్యనారాయణ ఆసిఫాబాద్‌లో డీఈగా పనిచేస్తుండగా, అక్కడి జేసీతో పాటు హౌసింగ్ శాఖ ఉద్యోగులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కుటుంబంలో ఎవరూ మిగలకపోవడంతో సత్యనారాయణ తండ్రి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రకాశం అంత్యక్రియలు నిర్వహించారు. హౌసింగ్ సీఈ ఈశ్వర య్య, ఆదిలాబాద్, కరీంనగర్ పీడీలు కృష్ణ య్య, నర్సింహారావు, హౌజింగ్ ఉద్యోగుల సం ఘం బాధ్యులు అప్పారావు, సూర్యారావు, డీఈలు, పీఈలు, ఏఈలతో పాటు గ్రామ సర్పంచ్ పుట్ట రజితతో పాటు గ్రామస్తులు, బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
-
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఘట్కేసర్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీకి చెందిన సత్యనారాయణ(58) అదిలాబాద్ జిల్లా అసిఫాబాబాద్ హౌసింగ్ బోర్డులో డీఈగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి సత్యనారాయణ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆయన భార్య మీర(51), కూతుళ్లు స్వాతి(33), నీలిమ(28), కొడుకు శివరామకృష్ణ(22) కుటంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.