breaking news
DccB meeting
-
అనర్హుడివి.. సమావేశం ఎలా నిర్వహిస్తావ్!
డీసీసీబీ మీటింగ్ నుంచి ఎనిమిది మంది డెరైక్టర్ల వాకౌట్ చైర్మన్ అనర్హుడయితే సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీత అవినీతి కుంభకోణాలను ఎందుకు సీబీసీఐడీకి అప్పగించరని ప్రశ్న వాకౌట్ అనంతరం తీర్మానాలను ఆమోదించుకున్న బోర్డు రాజకీయ దురుద్దేశమే అంటున్న చైర్మన్ నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పంచాయితీ ఓ ప్రహసనంగా మారింది. అసలు అధ్యక్షుడి ఎన్నికనే సవాల్ చేస్తున్న డెరైక్టర్లు కొందరు ఆయన సమావేశాన్ని ఎలా నిర్వహిస్తాడంటూ బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు. శనివారం డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి చైర్మన్‌తో సహా 20 మంది సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమై ఎజెండాను చదువుతుండగానే కొందరు డెరైక్టర్లు ఆందోళనకు దిగారు. చైర్మన్‌గా ఎన్నికైన 15 రోజుల్లోపు వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా, 95 రోజుల వరకు రెండు పదవుల్లో ముత్తవరపు కొనసాగారని, 1964 సహకార చట్టం పరిధిలోని సెక్షన్ల ప్రకారం ఈ పదవికి అనర్హుడవుతారని వాదించారు. అయితే, చైర్మన్ ముత్తవరపు మాత్రం తాను చేసిన దాం ట్లో పొరపాటు లేదని, ఏకకాలంలో రెండు సొసైటీల్లో పదవులు ఉండకూడదనే సహకా రం చట్టం చెబుతోందని చెప్పారు. దీంతోపా టు జిల్లా బ్యాంకు, దేవరకొండ బ్రాంచిల్లో జరిగిన అవినీతి అక్రమాల కేసును సీబీసీఐడీకి అప్పగించాలని ఏడాది క్రితం తీర్మానం చేసినా ఇప్పటివరకు ఎందుకు అప్పగించలేదని డెరైక్టర్లు చైర్మన్‌ను నిలదీశారు. సీబీసీఐడీకి అప్పగిస్తూ చేసిన తీర్మానాన్ని అసలు సీబీసీఐడీకి పంపారా అని ప్రశ్నించారు. తమ రెండు డిమాండ్లను సమావేశంలో అంగీకారం తెలపనందున తాము వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటిం చారు. సమావేశాన్ని బహిష్కరించిన వారి లో డెరైక్టర్లు జన్నలగడ్డ హనుమయ్య, డేగబా బు, గరిణె కోటేశ్వర్రావు, చాపల లింగయ్య, పిల్లమర్రి శ్రీనివాస్, పీరునాయక్, ఎర్పుల సుదర్శన్, మిర్యాల గోవర్ధన్లున్నారు. ఎనిమి ది మంది డెరైక్టర్లు సమావేశం నుంచి వాకౌట్ చేసినప్పటికి మెజార్టీ సభ్యులు సమావేశంలో ఉండడంతో ఎజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే : బహిష్కరించిన డెరైక్టర్లు అవినీతికి పాల్పడిన అధికారులను ప్రోత్సహిస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అవినీతి సొమ్మును రికవరీ చేయాలని సమావేశాన్ని బహిష్కరించిన డెరైకర్టర్లు డిమాండ్ చేశారు. సమావేశ బహిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీసీఐడీకి అక్రమాల కేసును అప్పగించాలని, చైర్మ న్ పదవి నుంచి ముత్తవరపును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్చార్జ్ సీఈఓ నర్మదకు వినతిపత్రం అందజేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వాకౌట్.. రాజకీయ దురుద్దేశంతోనే శనివారం జరిగిన బోర్డు సమావేశం నుంచి ఎనిమిది మంది డెరైక్టర్లు వాకౌట్ చేశారని చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆరోపించారు. సమావేశం అనంతరం ఆ విలేకరులతో మాట్లాడారు. దేవరకొండ బ్రాంచిలో జరిగిన అవినీతికి, తమ పాలకవర్గానికి సంబంధం లేదని, అయినా పోలీసు విచారణ జరిగిందని, డిపార్ట్మెంట్ 51 విచారణ కూడా చేసిందని చెప్పారు. బోర్డు సమావేశం నుంచి డెరైక్టర్లు వాకౌట్ చేయడం అనైతికమన్నారు. రైతులు యూరియాతో పాటు రుణాల కోసం ఇబ్బందులు పడుతుంటే వాటిపై చర్చింకుండా వాకౌట్ చేయడంలో అర్థం లేదన్నారు. తనపై అనర్హత వేటు వేయాలని చేసిన ఆరోపణలో పసలేదన్నారు. భువనగిరి, సూర్యాపేట భవనాల నిర్మాణం విషయంలో అందరి ఆమోదంతోనే టెండర్లు పిలిచి పనులను అప్పగించినట్లు చెప్పారు. ఇప్పటికైన రాజకీయాలకు పోకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. జిల్లాలో 91 గోదాములను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లను మంజూరి చేసిందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో డెరైక్టర్లు గద్దపాటి రాములు, ముత్యంరావు, శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గుడిపాటి వెంకటరమణ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలో ఆమోదించిన అంశాలివే... ముత్తవరపు పాండురంగారావు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినందున రాజీనామాను ఆమోదం. సీఈఓగా సంఘం రామయ్య నియామకానికి అనుమతి చేనేత సహకార సంఘాలకు మంజూరు చేసే క్రెడిట్ లిమిట్లపై వడ్డీరేట్లను సవరించారు. సూర్యాపేట, భువనగిరి, బ్రాంచి భవనాలు, కోదాడ బ్రాంచ్ ప్రహరిగోడ నిర్మాణం చేసే కాంట్రాక్టర్లకు మొదటి విడత బిల్లులు చెల్లింపులు ప్రసన్న ప్రింటర్స్‌కు రిజిస్టర్ ప్రింట్ సరఫరా చేసినందుకు గాను రూ. 3లక్షల 95వేల 295లను చెల్లింపు. అధ్యక్షుడి చాంబర్‌తోపాటు మీటింగ్ హాల్, సీఈఓ, జీఎం చాంబర్ల రిపేర్ల కోసం రూ.లక్షా17వేల 684 , జనరల్‌బాడీ సమావేశ హాల్లో చెక్కతో డయాస్ ఏర్పాటు కార్పెట్ ఏర్పాటుకు రూ.లక్షా 7వేల 490, పి.నాగేశ్వర్రావు ఆర్. శ్యాంసుందర్, కె.సంజీవరెడ్డి అనామత్ ఖాతాలో చేయడం తదితర అంశాలను ఆమోదించారు. -
వెలుగు చూస్తున్న వ్యవహారాలు
- సీడీపీ నిధుల వినియోగంపై అభ్యంతరాలు - ‘అవిశ్వాసం’ అనంతరం వాడీవేడీగా డీసీసీబీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో నెలకొన్న విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన డీసీసీబీ వ్యవహారాలు ఈ విభేదాల పుణ్యమా అని ఇప్పుడు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. ఇటీవల డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం అనంతరం తొలిసారిగా బుధవారం బ్యాంకు మేనేజింగ్ కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ , 2013-14 ఆర్థిక సంవత్సర అడిట్ నివేదికల ఆమోదం వంటి అంశాలపై సభ్యులు వాడీవేడీగా చర్చించారు. ఈ సమావేశానికి ఒకవర్గం డెరైక్టర్లు ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించాలని పట్టుబట్టగా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి మాత్రం ఇందుకు అనుమతించలేదు. ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా డీసీసీబీలో కొనసాగుతున్న వ్యవహారాలు బయటకు పొక్కాయి. ఒకవర్గం డెరైక్టర్లు పలు అంశాలపై డీసీసీబీ ఉన్నతాధికారులను నిలదీశారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు, బ్యాంకు లావాదేవీలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీడీపీ నిధుల వినియోగం అంశంపై కూడా వాడీవేడీగా చర్చ జరిగింది. ఈ నిధులను బ్యాంకు అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని కొంద రు డెరైక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేసినట్లు ఆరోపించారు. అలాగే మార్చి 31లోపు పంట రుణం బకాయిలను మొత్తం చెల్లించిన సుమారు 400 మంది రైతులకు ఈ సారి రుణాలు మంజూరు చేయకపోవడం పట్ల మరికొందరు డెరైక్టర్లు అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, డెరైక్టర్లు దుర్గం రాజేశ్వర్, జోగిందర్‌సింగ్, సీఈవో అనంత్‌రావు పాల్గొన్నారు.