breaking news
davi
-
దసరాకు తెరపైకి దేవి
దేవి చిత్రం దసరా సెలవులపై గురి పెట్టి అక్టోబర్ ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. డ్యాన్సింగ్ స్టార్, దర్శక, నటుడు ప్రభుదేవా తన సొంత బ్యానర్ ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమన్నా నాయకిగా నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ ప్రధాన పాత్రను పోషించారు. నటి ఎమీజాక్సన్ ఒక స్పెషల్ సాంగ్‌లో నటించడం విశేషం. ఇకపోతే ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఇతర ముఖ్య పాత్రల్లో ఆయా భాషల్లో ప్రముఖ నటీనటులు నటించారని చిత్ర దర్శకుడు విజయ్ తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ సుమారు 12 ఏళ్ల తరువాత ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి అని తెలిపారు. ఆయనతో పనిచేయడం చిత్రంలోని ప్రతి ఒక్కరికీ సంతోషంగా ఉందన్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. చిత్ర సింగిల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
ప్రియురాలి కోసం భార్యను చంపేశాడు
కాకినాడ రూరల్ : వివాహేతర బంధానికి అడ్డొస్తుందన్న నెపంతో భార్యను కడతేర్చాడు భర్త. కాకినాడ విద్యుత్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో కిలిం నూకరత్నం దేవి( 27) బలైంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్టమెంట్లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు. ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం’ అని చెప్పాడు. తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండడం, అపార్టమెంట్లో తువాలు చుట్టి ఉండడంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.