breaking news
Daraa
-
వైమానికి దాడులు... తిరుగుబాటుదారుల హతం
డెమాస్కస్: సిరియా దక్షిణ ప్రావెన్స్ ప్రాంతమైన దార్రాలోని జస్సెమ్ పట్టణాన్ని అక్రమించిన తిరుబాటుదారులపై ఆ దేశం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ సైనికాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సిరియాలో తిరుగుబాటు దారులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం గతేడాది నుంచి వైమానిక దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలరోజులుగా నిర్వహించిన వైమానిక దాడుల్లో 271 మంది పౌరులు మరణించగా, 190 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారని సైనికాధికారులు వివరించారు. -
117 మంది తీవ్రవాదుల హతం
డెమాస్కస్: దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలల్లో తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని సైనిక బృందాలు ముమ్మరం చేశాయి. అందులోభాగంగా దాదాపు 117 మంది తీవ్రవాదలను మట్టుబెట్టినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఆల్ ఖైదాలో సంబంధాలు ఉన్న 47 మంది తీవ్రవాదులను మషారా పట్టణంలో చంపివేసినట్లు తెలిపింది. అలాగే దక్షిణ ప్రావెన్స్లోని దర్రార్లో 70 మంది రెబల్స్‌ను అంతమొందించినట్లు పేర్కొంది. అయితే సిరియా రాజధాని డెమాస్కస్‌లో శనివారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 11 మంది గాయపడ్డారని మీడియా వెల్లడించింది.