breaking news
dam height
-
పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా? తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్
-
ఘనపురం ప్రాజెక్ట్ కు గత వైభవం
మెదక్: నిజాం కాలంలో నిర్మించిన శతాధిక చరిత్రగల ఘనపురం ప్రాజెక్ట్ గత వైభవం సంతరించుకోనుంది. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యమే లక్ష్యంగా ఆనకట్ట ఎత్తు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్ చివ రి ఆయకట్టు వరకు సాగునీరు అందే అవకాశం ఉంది. మంజీరకు నిలకడ నేర్పిన ఘనపురం పరుగులు తీసే మంజీరమ్మకు ఘనపురం ప్రాజెక్ట్ నిలకడ నేర్పింది. పాపన్నపేట...కొల్చారం మండలాల మధ్య ఏడుపాయల తీరంలో 1905లో నిజాం ప్రభువు ఘనపురం ఆనకట్ట నిర్మించారు. 18,130 చ.కి.మీ. విస్తీర్ణంలో 0.25 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ప్రాజెక్ట్ కింద 42.80 కిలో మీటర్ల పొడవున మహబూబ్ నహర్ కెనాల్ ఉండగా, 11,425 ఎకరాలు ఆయకట్టు ఉంది. 12.80 కిలోమీటర్ల పొడవున ఫతేనహర్ కెనాల్ ఉండగా 10,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండు కెనాళ్ల ద్వారా మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అప్పట్లో ఘనపురం నీటితో ఆయకట్టు అంతా సస్యశ్యామలంగా ఉండేది. రానురాను ఆనకట్ట పూడికకు గురికావడంతో నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలకు పడిపోయింది. దీనికితోడు మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలు శిథిలమయ్యాయి. చివరి ఆయకట్టుకు చుక్కనీరందని పరిస్థితి నెలకొంది. కాల్వల ఆధునికీకరణ కోసం రూ.23.85 కోట్ల జైకా నిధులు మంజూరు కాగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆనకట్ట ఎత్తు పెంచితే..చివరి ఆయకట్టుకు నీరు పూడికకు గురైన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచాలని స్థానిక రైతులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 1988 ప్రాంతంలో అప్పటి మంత్రి రాంచందర్‌రావు కృషితో ఆనకట్ట ఎత్తును అదనంగా ఒక మీటరు పెంచారు. దీంతో ఆయక ట్టు విస్తీర్ణం సుమారు 30 వేలకు పెరిగింది. కా నీ పూడిక నిల్వనీటి సామర్థ్యానికి అడ్డుగా మారింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్ప టి మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి ప్రతిపాదన మేరకు సర్వే నిర్వహించారు. అనంతరం ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల కృషి మేరకు డిసెంబర్ మొదటి వారంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ ఆనకట్టను సందర్శించి ఎత్తు పెంపు విషయమై పరిశీలన చేశారు. ఒక మీటర్ ఎత్తు..1.8 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం : ఘనపురం ఆనకట్ట ప్రాజెక్ట్‌ను ఒక మీట ర్ ఎత్తు పెంచితే నిల్వ నీటి సామర్థ్యం 1.8 టీ ఎంసీలకు పెరుగుతుందని అధికారులు భావి స్తున్నారు. ఇందుకు సుమారు రూ.56 లక్షలు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎత్తు పెంచడం వల్ల ఆనకట్ట వెంట ఉన్న నాగ్సాన్పల్లి, శేరిపల్లి, కొడుపాకల శివారులోని నదీతీర ప్రాంతాలు కొంత వరకు మునిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్టపై ఒక మీటర్ ఎత్తున జెండాలు పాతి ఏరియల్ సర్వేలో సీఎం కేసీఆర్‌కు వివరించనున్నట్లు అధికారులు తెలిపా రు. ఎత్తు పెంచడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాపన్నపేట వరకు ఫతే నహర్ కాల్వలు పొడిగించాలని, ప్రాజెక్ట్‌లో పూడిక తీయాలని రైతులు కోరుతున్నారు.