దళితులపై దాడులకు ఖండన
ఆగిరిపల్లి :
అమలాపురంలో దళితులపై జరి గిన దాడిని సీపీఎం మండల కార్యదర్శి సత్తు కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు నెక్కల పు శంకరరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవా రం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు న మోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మణిమాల కోటేశ్వరరావు, చొప్పర రాము, బి. పూర్ణ పాల్గొన్నారు.