breaking news
D. Srikanth
-
ఏకపాత్రాభినయం
‘‘ఈ సినిమాలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. ఆ పాత్రను అర్చన అద్భుతంగా పోషించారు. ఆమె చేసిన ప్రమాదకర విన్యాసాలు అమితంగా ఆకట్టుకుంటాయి’’ అని దర్శకురాలు సుజాత బౌరియా అన్నారు. అర్చనతో డి. శ్రీకాంత్ నిర్మించిన ‘పంచమి’ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ -‘‘వృత్తిలో భాగంగా అడవిలోకి వెళ్లి ఇబ్బందులు పడ్డ ఫొటోగ్రాఫర్ కథ ఇది’’ అని చెప్పారు. దర్శకురాలు ఈ సినిమా బాగా తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. ఇది మంచి ప్రయోగమని సంగీత దర్శకుడు శ్రీకోటి చెప్పారు. -
అడవిలో ఒంటరిగా ‘పంచమి’
‘‘ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలా వస్తున్నాయి. తొలి ప్రయత్నంగా వాటికి భిన్నంగా ఓ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఏక పాత్రతో ఈ సినిమా చేయడం జరిగింది’’ అన్నారు సుజాత బౌర్య. అర్చన కథానాయికగా మేఘన హర్ష సమర్పణలో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై సూజాత బౌర్య దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ - ‘‘మంచి ఫొటోలు తీయడానికి అడవికి వెళ్లే పంచమి అనే అమ్మాయికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్ర కథాంశం. సినిమాలో అర్చన నీడ కూడా కనిపించదు. రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. రిస్కీ సీన్స్‌ని అర్చన చాలా ధైర్యంగా చేశారు. కొన్నిసార్లు గాయాలు కూడా అయ్యాయి. అయినా ఖాతరు చేయలేదు. ఈ చిత్రంలో 52 నిమిషాలు పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. ప్రేక్షకులను ఓ సరికొత్త అనుభూతికి గురి చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. తదుపరి ఓ ప్రముఖ హీరోతో రొటీన్‌కి భిన్నంగా ఉండే ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నానని సుజాత అన్నారు.