breaking news
crop loan weiver
-
చంద్రబాబుకు కోటయ్య కమిటీ నివేదిక
-
చంద్రబాబుకు కోటయ్య కమిటీ నివేదిక సమర్పణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటయ్య కమిటీ సోమవారం తమ నివేదికను సమర్పించింది. బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం అందలేదన్న ఆ కమిటీ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నివేదికను అందచేసింది. ఇక కోటయ్య కమిటీ తన నివేదికలో రుణాల విలువను తగ్గించి చూపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ మాఫీ పై అధ్యయనం కోసంకోటయ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈనెల 22న కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించాల్సి ఉంది. 184వ ఎస్ఎల్బీసీ సమావేశంలో మొత్తం రుణాల విలువ రూ.1.02లక్షల కోట్ల పైమాటే అన్న కోటయ్య కమిటీ రుణాల విలువ రూ.72వేలకోట్లుగా పేర్కొంది. తీసుకున్న రుణాల విలువ రూ.72 వేల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రుణాలు రూ.62వేల కోట్లు, డ్వాక్రా, చేనేత రుణాలు రూ.12వేల కోట్లు, బంగారంపై రుణాలు రూ.34వేల కోట్లు, పంటరుణాలు రూ. 26వేలకోట్లుగా తెలిపింది. మొత్తం మీద కోటయ్య కమిటీ నిర్దిష్ట 45 రోజులలోనే తన తుది నివేదికను సమర్పించింది. -
కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఐటీ, సౌర విద్యుత్ విధానాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా రుణమాఫీపై ఆర్బీఐ లేఖ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.