breaking news
cravings
-
కోరికల పరుగు
ఈ అనంత విశ్వంలో మానవ జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణానికి ఇంధనం, వేగం, దిశ అన్నీ ఇచ్చేది ఒక్కటే ‘కోరిక’. పుట్టుకతో మొదలైన ఈ కోరికల పరుగు, మనిషి చివరి శ్వాస విడిచే వరకు సాగుతూనే ఉంటుంది. నది సముద్రంలో కలవాలని పరిగెత్తినట్లు, మనిషి కోరికల వెనుక పరిగెడుతుంటాడు. కానీ నదికి గమ్యం దొరుకుతుంది, మనిషి కోరికల పరుగుకు గమ్యం దొరకడం లేదు. ఆధ్యాత్మిక కోణంలో ఈ ‘కోరికల పరుగు’ వెనుక ఉన్న రహస్యాన్ని, దాని ప్రమాదాలను, దాన్ని అధిగమించే మార్గాన్ని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన నిజాలు కనిపిస్తాయి. హిందూ తత్వశాస్త్రంలో కోరికను ‘తృష్ణ’ అంటారు. తృష్ణ అంటే కేవలం దాహం కాదు, ఎంత తాగినా తీరని విచిత్రమైన దాహం. ఒక కోరిక నెరవేరగానే, ఆ సంతోషం కొద్దిసేపట్లోనే ఆవిరైపోతుంది. ఆ స్థానంలో మరో కొత్తకోరిక మొలకెత్తుతుంది. సైకిల్ ఉన్నవాడు బైక్ కావాలంటాడు, బైక్ ఉన్నవాడు కారు కావాలంటాడు, కారు ఉన్నవాడు విమానం కావాలంటాడు. ఈ పరుగు వస్తువుల దగ్గరే ఆగిపోదు; కీర్తి, అధికారం, పదవుల వైపు విస్తరిస్తుంది. ఈ పరుగులో మనిషి ’వర్తమానాన్ని’ (జీవితాన్ని) పూర్తిగా కోల్పోతున్నాడు. మన జీవితాల్లో కూడా ‘ఈ ఒక్క కోరిక తీరితే నేను ప్రశాంతంగా ఉంటాను’ అని అనుకుంటాం. కానీ ఆ కోరిక తీరిన తర్వాత కూడా ప్రశాంతత దొరకదు. సుఖం అనేది వస్తువుల్లో లేదు, మన అంతరంగంలో ఉందనే సత్యాన్ని గ్రహించకుండా బాహ్య ప్రపంచంలో వెతకడమే ఈ మృగతృష్ణ. ప్రాపంచిక విషయాల వైపు పరిగెత్తే మనస్సును – సేవ, కరుణ, భక్తి, ఆత్మవిచారణ వైపు మళ్ళించడం. నది ప్రవాహాన్ని మళ్ళించి పంటలు పండించినట్లు, కోరికల శక్తిని ఆధ్యాత్మిక ప్రగతికి వాడుకోవచ్చు.కోరికల పరుగులో అలసిపోవడం కాదు, ఆ పరుగును ఆపి ‘నేను ఎటు పరిగెడుతున్నాను? ఎందుకు పరిగెడుతున్నాను?’ అని ఒక్క క్షణం ఆగి ఆలోచించడమే వివేకం. పరుగు ఆగిన చోటే ప్రశాంతత మొదలవుతుంది. ఆ ప్రశాంతతే పరమాత్మ స్థితి. మనస్సు అనే అశ్వాన్ని కోరికల వైపు కాకుండా, అంతిమ సత్యం వైపు నడిపించినప్పుడే ఈ జీవన ప్రయాణానికి సార్థకత లభిస్తుంది.కోరికలు ఉండటం సహజం, కానీ కోరికలే మనల్ని నడపడం ప్రమాదకరం. ఈ పరుగును అదుపు చేయడానికి ఆధ్యాత్మికత కొన్ని మార్గాలను చూపుతోంది.‘నాకు ఏది లభించిందో అది భగవత్ ప్రసాదం’ అనే భావన అలవడినప్పుడు పరుగు వేగం తగ్గుతుంది. కోరిక పుట్టినప్పుడు దాంతో పాటు పరిగెత్తకుండా, ‘నా మనస్సులో ఈ కోరిక పుట్టింది‘ అని ఒక మూడోవ్యక్తిలా గమనించడం ఒక్కటే పరిష్కారం.శ్రీ శంకరాచార్యులు భజగోవింద శ్లోకాల్లో కోరికల తీవ్రతను హెచ్చరించారు. అగ్నిలో నెయ్యి పోస్తే అగ్ని చల్లారదు, ఇంకా ఎక్కువ రగులుకుంటుంది. అలాగే, కోరికలను తీర్చుకుంటూ పోతే అవి శాంతించవు, మరింత బలీయంగా తయారవుతాయి. శరీరం ముసలిదైపోయినా, పళ్ళు రాలిపోయినా, చేతికి కర్ర వచ్చినా... మనస్సులో ఉన్న ఆశ/కోరిక మాత్రం ముసలిది కాదు, అది పరిగెడుతూనే ఉంటుంది.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
పుచ్చకాయఫై రాజ్యాంగ నిర్మాత ముఖచిత్రం
-
మట్టితినడమే పనిగా...
మట్టి వాసనను ఇష్ట పడని మనుషులుండరు. చిన్న తనంలో చాలామందికి మట్టి, చాక్ పీస్ లు వంటివి తిన్న అనుభవాలూ ఉంటాయి. కొందరు గర్భిణిలకు కొన్ని వాసనలు పడకపోవడంతోపాటు, కొన్ని వస్తువులను పదే పదే తినాలన్న కోరిక కూడ కలుగుతుంటుంది. అయితే అవి గర్భంలోని పిల్లలకు ఎటువంటి హాని కలిగించనివి అయితే ఫర్వాలేదు. కానీ ఓ మహిళ ఏకంగా మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పటినుంచీ ఇటుక పొడిని, మట్టిని తినడం పనిగా పెట్టుకొందట. మట్టి తినేందుకు, ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు అనేక అబద్ధాలు కూడ చెప్తుండేదట. లివర్పూల్ కు చెందిన చెందిన 30 ఏళ్ళ జెన్నీ మాసన్.. మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు ఇటుకపొడి, ఇసుక, మట్టి వంటి పదార్థాలను ఎవ్వరికీ తెలియకుండా తినేసేదట. ఇంట్లోని గోడల్లో ఉండే ఇటుకల పొడి, గార్డెన్ లోని మట్టిలను అందరి కళ్ళూగప్పి సేకరించుకొని, ఆహార పదార్థాలతోపాటు.. ఎంతో ఇష్టంగా తినేదట. అయితే అటువంటి పదార్థాలను తినాలన్న అలవాటు... ఆమెలో చివరికి 'పికాగా' నిర్థారణ అయ్యిందట. రైలీ కొన్నోర్ గర్భంలో పడినప్పుడు అలవాటుగా మారిన మట్టి తినే సమస్య... ఆమెకు అతడు పుట్టిన మూడు నెలల తర్వాత తీరిందట. ఓ టీవీ కార్యక్రమంలో మట్టి తినడంవల్ల కలిగే నష్టాలను వివరించినా ఆమె మానుకోలేక పోయిందట. అంతకు ముందు పికా గురించి తాను ఎప్పుడూ వినలేదని, అటువంటి సమస్య ఉంటుందని తనకు తెలియదని జెన్నీమాసన్ చెప్తోంది. పికా అనేది శరీరంలో రక్త హీనత, పోషక లోపాల వల్ల సంభవించే రుగ్మత అని, అది మట్టి, ఇసుక, ఇటుకపొడి వంటివి తినే కోరిక కలిగేట్లుగా చేస్తుందని తెలుసుకొన్న జెన్నీ తర్వాత... వాటి జోలికి పోలేదు. గర్భధారణ సమయంలో ఇటువంటి లోపాలు సంభవించడం సాధారణమేనని, అయితే సమస్యను వెంటనే వైద్యులకు వివరించి తగిన జాగ్రత్తలు, వైద్యం తీసుకోకుంటే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని తెలుసుకొంది. పోషక విలువలు కలిగిన పదార్థాలను సేవించడం మానుకొని, పనికిరాని మట్టిని తినడం నష్టాన్ని కలుగజేస్తుందని తెలుసుకొంది. ఇసుక మట్టి దంతాలకు కూడ తీవ్ర నష్టాన్నికలిగిస్తాయని వైద్యుల ద్వారా తెలుసుకొంది. అయితే ప్రసవం వరకూ కూడ ఎవరు ఎన్ని చెప్పినా అలవాటును మానలేకపోయింది. చివరకు బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఆమెలో మట్టి తినాలన్న కోరిక దూరమైంది. ప్రస్తుతం మూడేళ్ళ తన కొడుకు రైలీ కొన్నోర్ ను చూసినప్పుడల్లా ఎంతో భయం వేస్తుందని, అదృష్టం కొద్దీ బిడ్డకు ఎటువంటి అవకరాలు రాకపోయినా, తదుపని బిడ్డల విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆలోచనతో మట్టి తినడం మానుకున్నాని జెన్నీ చెప్తోంది. తనకు వచ్చిన సమస్య ఇంకెవరికైనా వస్తే వెంటనే వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకొని, కడుపులోని బిడ్డల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది.


