breaking news
CPWD management
-
చైనా సరిహద్దుల్లో 44 కీలక రోడ్లు
న్యూఢిల్లీ: డోక్లాం ప్రతిష్టంభన, పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్– చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకమైన 44 రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అదేవిధంగా, పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో 2,100 కిలోమీటర్ల పొడవైన అంతర్గత, అనుసంధాన రహదారులను నిర్మించాలని యోచిస్తోంది. చైనాతో సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో బలగాల తరలింపు వేగంగా జరిగేలా వ్యూహాత్మకంగా కీలకమైన 44 రోడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వార్షిక నివేదిక పేర్కొంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం బాధ్యతలను ఈ సంస్థ చూసుకుంటుంది. సీపీడబ్ల్యూడీ పంపిన ప్రతిపాదనలు కేబినెట్ కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయి. జమ్మూకశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్–చైనాల మధ్య 4 వేల కిలోమీటర్ల మేర వాస్తవ నియంత్రణ రేఖ ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలో 44 రోడ్ల నిర్మాణానికి రూ.21వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతోపాటు రాజస్తాన్, పంజాబ్లలోని భారత్– పాక్ సరిహద్దు వెంబడి అంతర్గత, అనుసంధాన రహదారుల నిర్మాణానికి రూ.5,400 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
ఇది దుర్మార్గ పాలన: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం : మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రంలో భారీ కుంభకోణాలకు టీఆర్ఎస్ సర్కార్ పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఈ పథకాలేవీ నడవనీయకుండా చేసి కృత్రిమంగా నీటి ఎద్దడి పరిస్థితులను సృష్టిస్తున్నాయని భట్టి నిప్పులు చెరిగారు. సీపీడబ్ల్యూడీ పథకాలను నిర్వీర్యం చేసి మిషన్ భగీరథ లేకపోతే.. రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేదనే పరిస్థితులను తయారు చేస్తున్నారని అన్నారు. గత మూడేళ్లుగా.. ఈ సీపీడబ్ల్యూడీ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపేసిందని భట్టి తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.30 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టి.. ఎవరినీ పనిచేయనీకుండా ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేస్తూ.. వీటికి మాత్రం రూపాయి విడుదల చేయడం లేదని భట్టి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలొనే ఇటువంటి పథకాల్లో 340 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 9 నెలలుగా జీతాలు లేవని చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరు చెప్పుకుని.. దానిమీద 56 వేల కోట్ల రూపాయల్లో, కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఆ సొమ్ముతో రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చేయాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని భట్టి తెలిపారు. నేను అసెంబ్లీకే పోటీ చేస్తా..! లోక్ సభకు పోటీచేస్తారని వస్తున్న వార్తలపై భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి మాత్రమే పోటీచేస్తానని ప్రకటించారు. తన కుటుంబం నుంచి మరెవ్వరూ ఎన్నికల్లో పోటీచేయరని తెలిపారు. -
ప్రథమ పౌరుడి విడిదిల్లు
రాష్ట్రపతి నిలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది కానీ హైదరాబాద్‌లో, అదీను బొలారంలో ఏమని సైబరాబాదీలు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో సికింద్రాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గర్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన, వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. బ్రిటీషు వారి పాలనలో అప్పటి ‘‘వైస్రాయ్ నివాసం’’ గా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత నిజాం ప్రభువులు స్వాధీన పరచుకున్నారు. స్వాతంత్య్రానంతరం, 1950లో కేంద్ర ప్రభుత్వం రూ.60 లక్షలకు కొనుగోలు చేసి దక్షిణాదిలో రాష్ట్రపతికి విడిదిగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు, హైదరాబాద్‌లోని బొల్లారం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాష్ట్రపతి రిట్రీట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తరాదికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్థానిక ప్రజా సమస్యలపై ఒక అవగాహన కోసమని దక్షిణాది రాష్ట్రాల వారి కోసం హైదరాబాద్‌లో అలాగే మరొకటి సిమ్లాలో ఏర్పాటు చేశారు. ఏడాదికోసారి.. ఏటా కొన్ని రోజులపాటు రాష్ట్రపతి దక్షిణాది పర్యటనకు వస్తుంటారు. వారం నుంచి పదిహేను రోజులుండే ఈ పర్యటన సమయంలో రాష్ట్రపతికి ఇదే భవనం విడిదిల్లు. ఆ సమయంలో స్థానిక పెద్దలను ఆయన కలుస్తున్నారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, డా॥సంజీవరెడ్డి తదితరులందరూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం 15 రోజులు రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇటీవల మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇక్కడ విడిది చేశారు. భారీ నిర్మాణం.. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్రపతి భవన నిర్మాణం జరిగింది. రాష్ట్రపతి నిలయం నిర్మాణ శైలి రాచఠీవీతో చూపరులను ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. మొత్తం ప్రాంగణంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ఒక చక్కని హెర్బల్ గార్డెన్‌ను ఇటీవల అభివృద్ధి చేశారు. అనేక అరుదైన ఆయుర్వేద మొక్కలసాగు ఇక్కడ జరుగుతోంది. సీపీడబ్ల్యూడీ నిర్వహణ రాష్ర్టపతి నిలయం చుట్టూ ఎత్తయిన ప్రాకారాలతో, అధిక భాగం దట్టమైన పురాతన వృక్షాలతో నిండి ఉంటుంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స డిపార్టమెంట్ వారు రాష్ర్టపతి నిలయం నిర్వహణ చూస్తున్నారు. రాష్ర్టపతి ఇక్కడ బస చేయని రోజుల్లో గట్టి పోలీస్ భద్రత ఉంటుంది. లోనికి ఎవరినీ అనుమతించరు. ఏడాదిలో ఓ నెల రోజులు మాత్రం, అదీ రాష్ర్టపతి హైదరాబాద్ వస్తున్నారంటే, ఆయా ఏర్పాట్లు చూసే అధికారులు, సంబంధిత సిబ్బందితో రాష్ర్టపతి నిలయం సందడిగా పలు ప్రభుత్వశాఖల అధికారులతో నిండిపోతుంది. గత రెండుమూడేళ్లుగా రాష్ర్టపతి పర్యటన అనంతరం, ఒక వారం రోజులపాటు జంటనగరాల్లో సాధారణ పౌరులని ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కలిపిస్తున్నారు. ఇతర రోజులలో ఈ విశాల ప్రాంగణంలో ఎలాంటి జనసంచారం ఉండదు. దీంతో రాష్ట్రపతి నిలయ ప్రాంగణం విషసర్పాలకు నెలవైంది. రాష్ర్టపతి వచ్చే సందర్భంలో స్థానిక జూ అధికారులు విసృ్తత తనిఖీలు నిర్వహించి విషసర్పాలను పట్టి స్థానిక నెహ్రూ జూలాజికల్ పార్కుకి తరలిస్తున్నారు. ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న స్థానికులు రాష్ర్టపతి పర్యటన లేనిరోజుల్లో సాధారణ పౌరులు ఈ నిలయాన్ని సందర్శించేందుకు అనుమతించాలని కోరుతున్నారు. కాలుష్యం ఎరుగని ఈ ప్రశాంత ప్రాంగణం ఏడాదిలో సుమారు 10 నెలలు ఖాళీగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంగణంలోకి ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో వాకింగ్‌కు అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు. - మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com