breaking news
Cough medicine
-
దగ్గు సిరప్ వివాదం.. కాంచీపురం యూనిట్ మూసివేత
చెన్నై/కాంచీపురం: మధ్యప్రదేశ్‌లో 20 మంది వరకు చిన్నారుల మృతికి కారణమని భావిస్తున్న దగ్గు మందు తయారీ ప్లాంట్‌ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో సిరప్ కోల్డ్రిఫ్ తాగిన చిన్నారులు కిడ్నీలు ఫెయిలై మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణల తో ఈ సిరప్ విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీనే నిషేధం విధించింది. మార్కెట్లో ఉన్న స్టాక్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. సిరప్‌లో ప్రమాదకర రసాయనా లున్నా యంటూ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఔషధ విభాగం ప్రకటించింది. తక్షణమే కోల్డ్రిఫ్ ఉత్పత్తిని నిలిపి వేయాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మందును మధ్యప్రదేశ్, కేరళ కూడా నిషే ధించాయి. కోల్డ్రిఫ్ సిరప్ విక్రయాలను నిలిపివే యా లంటూ పుదుచ్చేరి, ఒడిశా ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. కోల్డ్రిఫ్లో ప్రమాదకర డై ఇథిలీన్ గ్లైకాల్ 48.6 శాతం కనిపించడంపై వివరణ ఇవ్వాలని కంపెనీకి రెండో సారి నోటీసు ఇచ్చామని మంత్రి మా సుబ్రమణియన్ చెప్పారు. ఇప్పటికే ఇదే విషయంలో ఈ నెల 3న మొదటి నోటీసు పంపించామన్నారు. కంపెనీ వివరణ ఎలా ఉన్నా చట్టపరమైన క్రిమినల్ చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని ఆ కంపెనీ పూర్తిస్థాయి మూసివేతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.చెన్నైలో మధ్యప్రదేశ్ సిట్కోల్డ్రిఫ్ మరణాలపై దర్యాప్తునకు ఏర్పాటైన మధ్యప్రదేశ్ సిట్ బృందం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఫార్మా కంపెనీ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించింది. అదేవిధంగా, కాంచీపురంలోని సీల్ వేసిన కంపెనీ యూనిట్‌ను పరిశీలించింది. అవసరమైన వివరాలను తెల్సుకుంది. -
Coldrif syrup: ఆ విషయంపై క్లారిటీ ఇవ్వండి: డబ్ల్యూహెచ్‌వో
మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా..? అంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టత కోరింది. భారత అధికారుల నుంచి వివరణ అనంతరం ఆ దగ్గు మందుపై అలర్ట్ జారీ చేసే అవసరముందా? అనే దానిపై పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తాజాగా, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దీంతో, దగ్గు సిరప్ సంబంధిత మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తమియా బ్లాక్‌లోని భరియాధానా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ధని దెహారియా, జున్నార్‌దియోకు చెందిన రెండేళ్ల జయుషా యదువంశీ సోమ, మంగళవారాల్లో చనిపోయినట్లు అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ చెప్పారు. దగ్గు మందు తాగిన తర్వాత వీరిద్దరూ కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకే చెందిన మరో ఆరుగురు చిన్నారులు నాగ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌ను నిషేధించాయి. తమిళనాడు ల్యాబ్ నివేదికల ప్రకారం ‘కోల్డ్రిఫ్’లో 48.6 శాతం డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. -
తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దగ్గు మందులపై నిషేధం విధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్ కాఫ్ సిరప్‌లను బ్యాన్ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.కాగా, రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్‌ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. -
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్ వద్దు!
న్యూఢిల్లీ: రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఈ మేరకు శుక్రవారం స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్‌ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో వీరికి సరైన అవగాహన కల్పించాలని వైద్యులను కోరింది. ‘పిల్లల్లో దగ్గు సంబంధ వ్యాధులు వాటంతటవే లేదా ఔషధాలతో పనిలేకుండానే చాలావరకు తగ్గిపోతాయి. తగినంత హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక చర్యల ద్వారా ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చు’అని అది పేర్కొంది. అదే సమయంలో, సరైన ప్రమాణాలను పాటిస్తూ తయారైన ఉత్పత్తులను వాడాలని ఆరోగ్య విభాగాలు, ఆస్ప త్రులకు సూచించింది. ప్రభుత్వ వైద్యసంస్థలతో ్చపాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమ అడ్వైజరీని పాటించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.సిరప్‌లలో కల్తీ సత్యదూరందగ్గు మందు తాగిన అనంతరం కిడ్నీలు ఫెయిలై మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9కి చేరిందని డీజీహెచ్ఎస్ తెలిపింది. అదేవిధంగా, పొరుగు నున్న రాజస్తాన్‌లో సికార్‌లో సంభవించిన ఓ మరణం దగ్గు మందు తాగడంతో అవయవాలు ఫెయిలై సంభవించినట్లు అధికారులు గుర్తించారు. చనిపోయిన 9 మంది చిన్నారుల్లో కనీసం ఐదుగురు కోల్డ్రెఫ్, ఒకరు నెక్స్ట్రో సిరప్ తాగినట్లు తేల్చారు. వైరల్ జ్వరాల కేసుల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీజీహెచ్ఎస్ తెలిపింది. ఇటువంటి కేసులను తీసుకోవద్దని, గుర్తించిన వెంటనే నేరుగా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలని కోరింది. అదేవిధంగా, డెక్స్ట్రో మెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్‌లతో తీవ్ర అనారోగ్యం బారినపడుతున్న ఘటనల నేపథ్యంలో రాజస్తాన్‌లో ఈ సిరప్ వాడినట్లుగా గుర్తించిన 1,420 చిన్నారులను పరిశీలనలో ఉంచామంది. అయితే, చిన్నారుల మరణాలకు దగ్గు మందు కల్తీయే కారణమన్న ఆరోపణలకు తగు ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కిడ్నీలు ఫెయిలయ్యేందుకు అవకాశమున్న డైఇథలీన్ గ్లైకాల్(డీఈజీ) లేదా ఇథిలీన్ గ్లైకాల్(ఈజీ) రసాయనాలు ఈ దగ్గు సిరప్‌లలో లేవని శాంపిళ్ల పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేసింది. సిరప్‌లలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు నిరాధారాలంటూ కొట్టిపారేసింది. ప్రజలకు సూచనలుచిన్నారులకు దగ్గు వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.OTC (ఓవర్ ది కౌంటర్) దగ్గు మందులు దయచేసి వాడకూడదు.సహజ చికిత్సలు (తేనె, తులసి, గోరువెచ్చని నీరు) డాక్టర్ సూచనతో మాత్రమే వాడాలి.ఈ మార్గదర్శకాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలు. మీ ఇంట్లో చిన్నారులు ఉంటే, దగ్గు మందుల వాడకంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి.ఇదీ చదవండి: అమెరికా-పాక్‌లు! నాకు నువ్వు.. నీకు నేను! -
దగ్గుమందు కేసుపై సీబీ‘ఐ’
- రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన డీసీఏ - సీఐడీ నివేదికపై అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారం కొలిక్కి రావట్లేదు. ఇతర దేశాలకు దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారంలో నేర పరిశోధన విభాగం (సీఐడీ) సమర్పించిన విచారణ నివేదికపై ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దగ్గు మందు అక్రమ రవాణా అంశాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు డీసీఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు సరిగా దర్యాప్తు చేయలేదని పేర్కొంది. డీసీఏ ప్రతిపా దనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2015 అక్టోబర్‌లో అసోంలోని భారత సరిహద్దులో దగ్గు మందు సిరప్‌ను అక్రమ రవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ లోని ఓ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ మందుల లారీ హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కొన్ని దుకాణాలు, డీలర్ల వద్ద తనిఖీలు చేసి ఔషధ నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్న దగ్గు మందు కొనుగోలు బిల్లులను పరిశీలించగా మందును విక్రయించి నట్లు రికార్డుల్లో పేర్కొన్నా, వాటిని ఎక్కడా సరఫరా చేయలేదని విచారణలో తేలింది. నేరుగా ఇతర దేశాలకు తరలించారని నిర్ధారించారు. విచారణలో లోపాలు.. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇక్కడే వ్యవహారం దారితప్పినట్లు తెలుస్తోంది. డీసీఏ విభాగం అధికారులు నమోదు చేసిన అభియోగాలకు అనుగుణంగా ఎలాంటి ఆధా రాల్లేవని సీఐడీ విభాగం కోర్టుకు తెలిపింది. దీంతో దీనిపై అభిప్రాయం తెలపాలని డీసీఏ కు కోర్టు సూచించింది. దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారంలో సీఐడీ విభాగం సరిగా విచారించలేదని, దాదాపు రూ.300 కోట్ల విలువైన దగ్గు మందు తెలంగాణ నుంచి అక్రమ రవాణా అయిందని రాష్ట్ర ప్రభుత్వానికి డీసీఏ నివేదించింది. కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు వ్యవహారం బయటపడుతుందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి డీసీఏ ఈ అంశంపై కోర్టుకు నివేదించనుంది. కాసుల కక్కుర్తితో... మన రాష్ట్రంలోనే సరఫరా చేయాల్సిన దగ్గు మందు (ఫెన్సిడిల్) బంగ్లాదే శ్‌కు అక్రమంగా రవాణా అవుతోంది. ఈ మందును కొద్ది పరిమాణంలో తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఇదే మందును ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మత్తు వస్తుంది. మన దేశంలో ఈ మందు నిల్వపై ఆంక్షలు ఉన్నాయి. ఒక్కో ఔషధ దుకాణంలో ఐదు సిరప్‌ల కంటే ఎక్కువగా అందుబాటులో ఉండనివ్వరు. హైదరాబాద్‌లో ఫెన్సిడిల్ మందు రూ.65కు లభిస్తోంది. బంగ్లాదేశ్ లో దీన్ని రూ.260కు విక్రయిస్తున్నారు. అక్కడ ఈ మందుకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఫార్మా నిర్వాహ కులు కాసులకు కక్కుర్తి పడి బంగ్లాదేశ్‌కు అక్రమ రవాణా చేస్తున్నారు. -
తీగలాగితే.. డొంక కదిలింది!
కామారెడ్డి : దేశ సరిహద్దులు దాటిన దగ్గుమందు అక్రమ దందా రాకెట్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. కామారెడ్డి కేంద్రంగా సాగిన ఈ స్మగ్లింగ్‌తో ఇతర ప్రాంతాల మెడికల్ ఏజెన్సీలకూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గుంటూరులోనూ సోదాలు నిర్వహించారని ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఫెన్సిడిల్ అక్రమదందా వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. ఫెన్సిడిల్ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే కామారెడ్డి అజంతా మెడికల్ ఏజెన్సీ అనుమతులను రద్దు చేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. దందాతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ రాకెట్లో గుంటూరుకు చెందిన శేషు ఏజెన్సీకీ భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. అక్కడికి వెళ్లి రికార్డులను సీజ్ చేశారు. ఆ ఏజెన్సీ నుంచి 3.20 లక్షల ఫెన్సిడిల్ బాటిళ్లు అక్రమ రవాణ అయినట్టు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ప్రముఖ మెడికల్ ఏజెన్సీగా శేషు ఏజెన్సీకి గుర్తింపు ఉంది. ఈ ఏజెన్సీకి ఫెన్సిడిల్ అక్రమదందాలో భాగస్వామ్యం ఉందని అనుమానించిన అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. అలాగే భీమవరం, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన డ్రగ్ వ్యాపారులకూ ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల గుంటూరుకు వెళ్లి అక్కడి అధికారుల సాయంతో శేషు ఏజెన్సీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెన్సిడిల్ అక్రమ రవాణా వ్యవహారంలో సదరు ఏజెన్సీకి చెందిన బిల్లులు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్టు సమాచారం. అజంతాకు ఆగిపోయిన బిల్లుల చెల్లింపులు ఫెన్సిడిల్ అక్రమ దందా కేసులో అనుమతులు రద్దయిన అజంతా ఏజెన్సీకి వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన బిల్లులు నిలిచిపోయినట్టు సమాచారం. అజంతా ఏజెన్సీ నుంచి నాలుగైదు జిల్లాలకు చెందిన వందలాది ఏజెన్సీలు, దుకాణాలకు మందులు సరఫరా చేసేవారు. కోట్ల రూపాయల్లో వ్యాపారం నడిచేది. అయితే అజంతా ఏజెన్సీ కేసుల్లో ఇరుక్కోవడం, అందులో తమ వద్ద మందులు తీసుకునే రిటైలర్లకు ఫెన్సిడిల్ సరఫరా చేసినట్టు బోగస్ బిల్లులు తయారు చేసుకున్న వ్యవహారంలో ఆయా మెడికల్ షాప్‌ల వారు విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. తమకు సంబంధంలేని వ్యవహారంలో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహంతో ఉన్న సదరు దుకాణాదారులు అజంతాకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. బిల్లుల వసూళ్ల కోసం అజంతా ఏజెన్సీ యజమానులు ఒత్తిడి తెచ్చినా చాలా మంది ససేమిరా అంటున్నట్టు సమాచారం.


