breaking news
Cotton Material
-
కాటన్ దుస్తులు కళకళలాడాలంటే...
వేసవి వచ్చిందంటే మన వస్త్రధారణను ఉన్నపళాన మార్చేస్తాం. కాటన్ తప్ప మరో మెటీరియల్ వైపు చూడటానికి కూడా భయపడతాం. వేసవి ఉగ్రత నుంచి కాపాడటమే కాక... కాటన్ మనకు అందాన్ని, హుందాతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే కాటన్‌కు అందాన్ని తెచ్చేది మాత్రం గంజి! నిజానికి మార్కెట్లో దొరికే గంజి పౌడర్ కంటే... ఇంట్లో చేసుకున్న గంజివల్ల బట్టలు మరింత అందంగా ఉంటాయంటారు వస్త్ర నిపుణులు. అంతేకాదు.. ఆరు రకాలుగా గంజిని తయారు చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఇవే ఆ ఆరు రకాలు... మొక్కజొన్న పిండిని చల్లని నీటిలో వేసి కలిపి బాగా మరిగించాలి. ఇందులో ముంచి ఆరబెడితే కాటన్ దుస్తులు చక్కగా ఫెళఫెళలాడతాయి. బంగాళాదుంప ఆరోగ్యానికి ఎంత మంచిదో, కాటన్ దుస్తులకూ అంతే మంచిది. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. ఆ నీటిని రాత్రంతా ఉంచి, ఉదయం లేచాక వడగట్టుకుని బట్టలకు పెట్టాలి. అన్నం ఉడికించిన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు కలిపితే మంచి గంజి తయారవుతుంది. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే కూరగాయలు, కాటన్ దుస్తుల అందాన్నీ ఇనుమడింపజేస్తాయి. పచ్చి కూరగాయల్ని శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకుని, అందులో బట్టల్ని ముంచి తీసి ఆరబెట్టాలి. చేమదుంపల్ని కెమికల్ ట్రీటెడ్ స్టార్చ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీనితో కూడా మనం గంజి చేసుకోవచ్చు. ముందుగా వీటిని చెక్కి, మెత్తగా రుబ్బి, కాసిన్ని నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి బట్టలకు పట్టించాలి.అన్నం ఉడికించిన నీళ్లు గంజిలా ఉపయోగపడినట్టే... గోధుమల్ని ఉడికించిన నీళ్లు కూడా గంజిలాగా ఉపయోగపడతాయి. కాబట్టి అలా ప్రయత్నించినా ఫర్వాలేదు. గమనిక: ఏ గంజి అయినాగానీ... చల్లారిన తర్వాతే దుస్తులకు పెట్టాలి తప్ప వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. -
అత్తయ్య ఐతేనేం?కత్తుల రత్తయ్య ఐతేనేం?
రెక్కలు టపటపలాడించడానికి.. రివ్వున ఎగిరిపోడానికీ... కాలం కాదిది. చలి ఎలా ఉందో చూశారు కదా! కత్తుల రత్తయ్యలా తిరుగుతోంది. కొత్త కోడలి అత్తగారిలా వణికిస్తోంది. బయటికి బయల్దేరినవారెవరైనా... నిండా స్వెటర్ కప్పుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని భుజాలను దగ్గరకు బిగించుకుని ‘కృష్ణా, రామా...’ అనుకుంటూ వెళ్లిన దారినే వచ్చేయడం క్షేమకరం. కానీ మగువలు ఊరుకుంటారా! చలి గాలులకు జడిసి నిలబడిపోతారా?! చలి కోట్ల కింద అందమైన డ్రెస్‌లను దాచేసుకుని వేడుకలను వెలవెలబోనిస్తారా! నో... వే..! ఊలుతోనే సల్వార్ కమీజ్‌లు, ఊలుతోనే లెగ్గింగ్స్ డిజైన్ చేయించుకుని... వింటర్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు! మీరూ ఫాలో అవండి! అదే బెస్ట్. ఆల్ ది బెస్ట్. 1- లక్నో వర్క్ చేసిన జ్యూట్, కాటన్ మెటీరియల్‌తో తయారు చేసిన బ్లేజర్ చలిని ఆపుతుంది. దీనికి ఇన్నర్‌గా కాంట్రాస్ట్ స్పగెట్టి లేదా టీ షర్ట్ వేసుకొని, జీన్స్‌కి మ్యాచ్ అయ్యే బెల్ట్ వాడాలి. కార్పొరేట్ ఉద్యోగులు ఇలా రెడీ అయితే వింటర్లో సౌకర్యవంతంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. 2- లేత పచ్చపువ్వుల ప్రింట్ ఉన్న మందపు కాటన్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లేజర్, లోపల స్పగెట్టి లేదా టీ షర్ట్ ధరించి బెల్ట్ వాడాలి. జెగ్గింగ్ లేదా జీన్స్ ధరిస్తే స్టైల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ చలిని తట్టుకునేవిధంగా ఉంటుంది. సింపుల్‌గా సౌకర్యవంతంగా అనిపించే ఇలాంటి స్టైల్స్‌ని మీరూ ట్రై చేయవచ్చు. 3- ఆరెంజ్ రా సిల్క్ టాప్ పైన వెల్వెట్ ఓవర్ కోట్ వాడాలి. వెల్వెట్ క్లాత్ మందంగా ఉంటుంది. చలి తట్టుకునే విధంగానూ, ఫ్యాషన్‌గానూ ఉంటుంది. టాప్‌కి వాడిన ముదురురంగు లైన్స్‌ను బట్టి జెగ్గింగ్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ వింటర్ డ్రెస్ అవుతుంది. 4- జెగ్గింగ్ ధరించి, పైన టీ షర్ట్ వేసి ఆపైన ఊలు ఓవర్ కోట్‌ను వాడటంతో స్టైల్‌గా కనువిందుచేస్తోంది ఈ డ్రెస్. కాలేజీకెళ్లే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది. 5- ఊలుతో డిజైన్ చేసిన డ్రెస్సులు చలిని ఆపుతాయి. అందుకని స్వెటర్స్ అల్లేవారితో సల్వార్ కమీజ్, లెగ్గింగ్స్ మన శరీర కొలతల ప్రకారం తయారుచేయించుకోవచ్చు. వంగపండు రంగు ఊలుతో డిజైన్ చేసిన ఈ సల్వార్ కమీజ్, నలుపు రంగు ఊలుతో తయారుచేసిన ఈ లెగ్గింగ్ అలా డిజైన్ చేసినవే! నెక్కి గోటా బార్డర్, బ్లాక్ అండ్ వైట్ వీవింగ్ వల్ల ఈ సల్వార్ కమీజ్ హైలైట్‌గా నిలిచింది. ఊలుకు సాగే గుణం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైన రెగ్యులర్ యాక్సెసరీస్ ఏవైనా వాడుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఉండాలంటే డ్రెస్‌లోని రంగులను బట్టి ఇయర్ రింగ్స్, చెప్పులు ధరించాలి. మోడల్స్: అశ్విని, సొనాలి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com