కాటన్ దుస్తులు కళకళలాడాలంటే... | Cotton Clothing | Sakshi
Sakshi News home page

కాటన్ దుస్తులు కళకళలాడాలంటే...

Mar 11 2015 3:55 AM | Updated on Sep 2 2017 10:36 PM

కాటన్  దుస్తులు  కళకళలాడాలంటే...

కాటన్ దుస్తులు కళకళలాడాలంటే...

వేసవి వచ్చిందంటే మన వస్త్రధారణను ఉన్నపళాన మార్చేస్తాం. కాటన్ తప్ప మరో మెటీరియల్ వైపు చూడటానికి కూడా

వేసవి వచ్చిందంటే మన వస్త్రధారణను ఉన్నపళాన మార్చేస్తాం. కాటన్ తప్ప మరో మెటీరియల్ వైపు చూడటానికి కూడా భయపడతాం. వేసవి ఉగ్రత నుంచి కాపాడటమే కాక... కాటన్ మనకు అందాన్ని, హుందాతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే కాటన్‌కు అందాన్ని తెచ్చేది మాత్రం గంజి! నిజానికి మార్కెట్లో దొరికే గంజి పౌడర్ కంటే... ఇంట్లో చేసుకున్న గంజివల్ల బట్టలు మరింత అందంగా ఉంటాయంటారు వస్త్ర నిపుణులు. అంతేకాదు.. ఆరు రకాలుగా గంజిని తయారు చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఇవే ఆ ఆరు రకాలు...

 మొక్కజొన్న పిండిని చల్లని నీటిలో వేసి కలిపి బాగా మరిగించాలి. ఇందులో ముంచి ఆరబెడితే కాటన్ దుస్తులు చక్కగా ఫెళఫెళలాడతాయి.
 
బంగాళాదుంప ఆరోగ్యానికి ఎంత మంచిదో, కాటన్ దుస్తులకూ అంతే మంచిది. బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. ఆ నీటిని రాత్రంతా ఉంచి, ఉదయం లేచాక వడగట్టుకుని బట్టలకు పెట్టాలి.
 
అన్నం ఉడికించిన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు కలిపితే మంచి గంజి తయారవుతుంది. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే కూరగాయలు, కాటన్ దుస్తుల అందాన్నీ ఇనుమడింపజేస్తాయి. పచ్చి కూరగాయల్ని శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకుని, అందులో బట్టల్ని ముంచి తీసి ఆరబెట్టాలి.

 చేమదుంపల్ని కెమికల్ ట్రీటెడ్ స్టార్చ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీనితో కూడా మనం గంజి చేసుకోవచ్చు. ముందుగా వీటిని చెక్కి, మెత్తగా రుబ్బి, కాసిన్ని నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి బట్టలకు పట్టించాలి.అన్నం ఉడికించిన నీళ్లు గంజిలా ఉపయోగపడినట్టే... గోధుమల్ని ఉడికించిన నీళ్లు కూడా గంజిలాగా ఉపయోగపడతాయి. కాబట్టి అలా ప్రయత్నించినా ఫర్వాలేదు.
 
గమనిక: ఏ గంజి అయినాగానీ... చల్లారిన తర్వాతే దుస్తులకు పెట్టాలి తప్ప వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement