breaking news
copper metal
-
కొత్త బంగారంగా రాగి.. పెట్టుబడిదారుల చూపంతా దీనిపైనే!
విలువైన లోహాలు అంటే.. ముందుగా మనకు గుర్తొచ్చేది బంగారం, వెండి మాత్రమే. పెట్టుబడిదారులు కూడా చాలాకాలంగా వీటినే సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి కొంత మారుతోంది. రాగి ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. కొందరు దీనిని కూడా కొత్త బంగారంగా అభివర్ణిస్తున్నారు.గత ఏడాది బంగారం ధర దాదాపు 70 శాతం, వెండి ధర ఏకంగా 150 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో అల్యూమినియం, పల్లాడియం, ప్లాటినమ్‌తో పాటు రాగి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.భారీగా పెరిగిన రాగి ధరలులండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో రాగి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఒక దశలో మెట్రిక్ టన్ను రాగి ధర 14,737 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.14 లక్షలకు సమానం. తవ్వకం, శుద్ధి సామర్థ్యాలకు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు మధ్య అంతరం పెరుగుతుండటంతో.. రాగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రాగి ధరలు పెరగడానికి అమెరికా సుంకాల ప్రభావం కూడా ఒక ముఖ్యమైన కారణం. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచే అవకాశం ఉందన్న వార్తలతో కొనుగోలుదారులు ముందుగానే పెద్ద మొత్తంలో రాగిని కొనుగోలు చేస్తున్నారు. 2026 తొలి అర్ధభాగంలో అమెరికా సుమారు 8.85 లక్షల టన్నుల రాగిని దిగుమతి చేసుకుంది. దీంతో ప్రపంచంలోని రాగి నిల్వల్లో గణనీయమైన భాగం అమెరికాకు తరలిపోయింది. ఫలితంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో అందుబాటులో ఉన్న నిల్వలు తగ్గాయి. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ప్రధాన కారణాలుమార్కెట్లో రాగికి చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే డిమాండుకు తగిన సరఫరా లేదు. ప్రపంచంలో ఉన్న పాత రాగి గనులు తమ ఉత్పత్తిని పెంచడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రధాన రాగి ఉత్పత్తి దేశాల్లో కూడా ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి.రాగికి డిమాండ్ పెరగడానికి మరో ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లు భారీగా నిర్మిస్తున్నారు. ఈ డేటా సెంటర్లలో విద్యుత్ వ్యవస్థలు, కేబుల్స్, నెట్వర్క్ పరికరాలు వంటి వాటిలో రాగిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల విస్తరణ కూడా రాగికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. అంటే.. భవిష్యత్తులో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలు పెరిగే కొద్దీ రాగి అవసరం కూడా పెరిగే అవకాశం ఉంది.భారీ డిమాండ్ఈ ఏడాది ఇప్పటి వరకు రాగి ధరలు సుమారు 16 శాతం పెరిగాయి. ముఖ్యంగా.. ఇటీవల నమోదైన రికార్డు ధరలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కూడా మించిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రోకరేజీలు 2026లో రాగి ధరలు టన్నుకు 11,000-12,000 డాలర్ల స్థాయిలో ఉంటాయని అంచనా వేసినప్పటికీ, మార్కెట్ ధరలు ఇప్పటికే ఆ స్థాయిని దాటిపోయాయి. దీంతో రాగి మార్కెట్‌పై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరిగింది. -
రాగి.. ఆరోగ్యరహస్యమేగి
సాక్షి, అదిలాబాద్: రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీరు పోసి ఉదయం తాగితే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. గతంలో రాగి చెంబులను ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ గ్లాస్లులు, ప్లాస్టిక్ ప్లేట్లు, నిత్యావసర వస్తువులన్నీ ప్లాస్టిక్ కావడంతో అనారోగ్యనికి గురవుతున్నారు. మారుతున్న జీవన విధానంలో 30ఏళ్లలోపు వారికి కూడా గుండె జబ్బులు, బీపీ, షుగర్, అల్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో పట్టణ ప్రాంత ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే రాగి వినియోగం అమాంతం పెరిగింది. ఇళ్లలోనే కాకుండా రెస్టారంట్లలో కూడా రాగి పాత్రలను వాడుతున్నారు. రాగి పాత్రలోని నీరు ఆరోగ్యకరం రాగి పాత్రల్లో నీటిని తాడగం, రాగి ప్లేట్లల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. జీర్ణశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి పాత్రల విలువ తెలుస్తోంది నేను ఇప్పటికీ రాగి చెంబులోనే నీటిని తాగుతా. నాతో పాటు మా ఇంట్లోని వారందరూ కూడా రాగి పాత్రలనే వాడుతారు. రాగి పాత్రల వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రావు. -నల్లా రత్నాకర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ ఆ నీటిని తాగితే ఎంతో మేలు.. ప్రస్తుతం రాగి బాటిళ్లలోనే నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాం. రాగి పాత్రల్లోని నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు ఎలాంటి రోగాలు దగ్గరకు రావు. -రాంరెడ్డి, తహసీల్దార్ -
డాక్టర్ కాపర్ నుంచి కాపర్ ఫిల్టర్డ్ మాస్క్
లక్డీకాపూల్: డాక్టర్ కాపర్ బ్రాండ్‌తో రాగి ఉత్పత్తులు తయారీలో ఉన్న ఎంఎస్ఆర్ ఇండియా తాజాగా కాపర్ పిల్టర్డ్ ఎన్–95 రీయూజెబుల్ మాస్క్‌తో పాటు పేటెండెడ్ కాపర్ కేర్ కీను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ మెష్ క్లాత్, మాయిశ్చర్ కంట్రోల్, యాంటీ బ్యాక్టీరియల్ ఫినిష్, కాపర్ ఫిల్టర్, ఎన్–95 ఫిల్టర్, కాపర్ క్లాత్ ఫిల్టర్‌తో ఐదు లేయర్లతో కూడిన మాస్క్‌ను రూపొందించినట్టు ఎంఎస్ఆర్ సీఈఒ డాక్టర్ ఎం.మల్లారెడ్డి తెలిపారు. ఎన్–95 మాస్క్ కంటే 90 శాతం మెరుగ్గా ఇది పని చేస్తుందన్నారు. వీటిని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో రూ. 199లకే అందిస్తున్నామని తెలిపారు. 2021 మార్చి నాటికి ఒక కోటి యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మల్లారెడ్డి వెల్లడించారు. -
శ్రీకాకుళం ఏజెన్సీలో ఘరానా మోసం
శ్రీకాకుళం: రైస్ పుల్లింగ్, కాపర్ కాయిల్ పేరుతో శ్రికాకుళం ఏజెన్సీలో రూ. 50 లక్షలు కొల్లగొట్టిన వారిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి చెందిన వ్యక్తులంగా నిందితులు చెప్పుకోవటంతో పోలీసులు వారిపై కేసునమోదు చేయడంలేదని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దోనుబాయి ప్రాంతంలో ఏజెంట్ నెట్వర్క్ ముసుగులో మాయగాళ్లు గిరిజనులకు మస్కా కొట్టారు. అయితే సొమ్ము రికవరీకి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. పోలీసుల అదుపులో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ముగ్గురు నిందితులు ఉన్నారు.


