కూల్.. కూల్‌గా..
                  
	
		రత్నగిరి భక్తులకు ఎండ నుంచి రక్షణ
	
		ఆలయప్రాంగణం, వ్రతమండపాలవద్ద కూల్ పెయింట్

	 
	అన్నవరం:
	సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎండలో కాళ్లు కాలుతుండగా పరుగంటి నడక కష్టాలు తొలగాయి. వారికి ఎండ నుంచి  రక్షణకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఎండదెబ్బతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం ‘సాక్షి’ లో‘ ‘వేడి’ంపులు’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. దానికి స్పందించిన ఈఓ కె. నాగేశ్వరరావు  ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, పార్కింగ్ స్థలం వద్ద కూల్ పెయింట్ వేయించారు. దేవస్థానం డీఈఈ రామకృష్ణ  ఈ పనులను పర్యవేక్షించారు. ఆలయప్రాంగణం, రథంపాత్, ఇతర ప్రదేశాలలో వారం రోజుల్లో షామియానాలు వేయిస్తామని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి  తెలిపారు. ఇప్పటి వరకూ వేసవిలో చలువపందిర్లు వేస్తున్నారని, వాటిని వేసవి అనంతరం తొలగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అలా కాకుండా శాశ్వతప్రాతిపదికన ఇనుపగొట్టాలు పాతి అవసరమైనప్పుడు ఆ గొట్టాల ఆ«ధారంగా షామియానాలు వేసుకొని, అవసరం తీరాక ఆ గొట్టాలను తీసి భద్రపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.